రెండో దఫా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తరువాత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పర్యటన అనే భావనను మార్చేశారు. అంతకు ముందు పల్లెబాట, నగరబాట, రైతు చైతన్యయాత్ర, పొలం బడి, రైతు సదస్సులు వంటివి నిర్వహించారు. రెండోసారి పదవిని చేపట్టిన తరు వాత ప్రజలతో ముఖాముఖీ సమావేశమై ప్రభుత్వ పథకాల గురించీ, అవి ప్రజలకు చేరుతున్న తీరు గురించీ, వాటితో చేకూరిన లబ్ధిని గురించీ, మంచిచెడుల గురించీ మాట్లాడాలని అనుకున్నారు. అలాగే భూపంపిణీ, ఇళ్లు, ఇళ్ల స్థలాల […]పూర్తి వివరాలు ...
చంద్రబాబుకు కోపం వచ్చింది. పట్టిసీమ నుంచి నీళ్లిస్తామని చెబితే వినకుండా సిద్ధేశ్వరం అలుగు కట్టుకుంటామని వెళతారా? అని పోలీసులను ఉసిగొలిపాడు. వాళ్లకు చేతనైనదంతా వాళ్లు చేశారు. మీ పట్టిసీమ మాకెందుకు? సిద్ధేశ్వరం కట్టుకుంటే చాలని అనడమే శాంతిభద్రతల సమస్య అయింది. ముందు రోజే హౌస్ అరెస్టులు చేశారు. నాయకుల కోసం ఆరా తీసి ఆందోళన పెట్టారు. సిద్ధేశ్వరం దారులన్నీ జనమయం అవుతాయని అటకాయించారు. ఇటు నందికొట్కూరు నుంచి, అటు వెలుగోడు నుంచి చెక్‌పోస్టులు తెరుచుకున్నాయి. అసలు దారులు, […]పూర్తి వివరాలు ...
సాగునీళ్ళలో సీమకు జరిగిన మోసమేమిటి? కీ.శే కె శ్రీరామకృష్ణయ్య (శ్రీరామక్రిష్ణయ్య) గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ఇంజనీరుగా పని చేసి పదవీ విరమణ పొందినారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకాలో భాగమైన బేతపూడికి చెందిన వీరు సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు. రాయలసీమకు సంబంధించి సాగునీటి పథకాల ప్రతిపాదనలు తయారు చేయడంలో వీరు పాలు పంచుకున్నారు. వీరి కృషిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ జలాశయం (ఇది తెలుగుగంగ పథకంలో […]పూర్తి వివరాలు ...
తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా గురించి ఎవరూ ఏమీ అడక్కపోయినా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు గత రెండేళ్ళుగా చెప్తూనే వస్తున్నారు. ఆయన ఎప్పుడైనా అలసిపోయి ఊరుకుంటే ఆయన ఏరి కోరి నియమించుకున్న కలెక్టరు కె వెంకటరమణ గారు కడప జిల్లా అంటే “భయం… భయం…” అని అందరికీ నూరిపోస్తూనే ఉన్నారు (కాకతాళీయంగా పదో తరగతి ఫలితాలు విడుదలైన రోజే ఈ జిల్లా కలెక్టరుగా ఆయనకు చివరిరోజు). వీళ్ళ దృష్టిలో ‘రాష్ట్రంలో ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా…మొదటి నిందితులు కడప […]పూర్తి వివరాలు ...
ఓ స్వయం ప్రకటిత మేధావీ గారు.. చాల్లే చూశాం గానీ… కొన్నేళ్ల క్రితం వరకు మేధావులంటే చాలా అంచనాలుండేవి. మేధావులు ప్రపంచానంతా ఒక యూనిట్ గా చూస్తారని అనుకునే వాడిని. వారికి ప్రాంతాలు, కులాలు, మతాలతో సంబంధం ఉండదనుకునే వాడిని. కానీ ఏపీలో స్వయంప్రకటితులుగా వెలసిన కొందరు మేధావులను చూశాక మేధావుల వెనుక కూడా మర్మాలుంటాయని అర్థమైంది. చలసాని శ్రీనివాసరావు. సమాజం గౌరవించదగ్గ వ్యక్తి. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని చెప్పగానే జనం కోసం నడుం బిగించారు. […]పూర్తి వివరాలు ...
యనమల రామకృష్ణుడు గారు 2016 -17 ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బడ్జట్ శాసనసభలో ప్రవేశ పెడుతూ చేసిన ప్రసంగంలో “గోదావరి, క్రిష్ణా జిల్లాల ప్రాంతమంత 160 సంవత్సరాల క్రితం దుర్భర దారిద్ర్యములో ఉండేదని, సర్ ఆర్దర్ కాటన్ మహాశయుడు ధవలేశ్వరం మరియు విజయవాడల దగ్గర బ్యారేజిల నిర్మాణం చేయడం వలన ఆ ప్రాంతాలు ధాన్యాగారాలుగా మారాయి” అని వివరించారు. అదేవిధంగా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేసి రాయలసీమను ధాన్యాగారంగా మారుస్తుందని చెప్పారు. గోదావరి నదిని క్రిష్ణానదితో అనసంధానించడం ద్వారా […]పూర్తి వివరాలు ...
ఇప్పటికి సరిగ్గా పదేళ్ళ కిందట 2006లో కడప.ఇన్ఫో ప్రారంభమైంది. ఇటీవలి కాలంలో కడప.ఇన్ఫోలో కొన్ని వ్యాసాలను/అభిప్రాయాలను ప్రచురించిన నేపధ్యంలో వివిధ అంశాల మీద కొంతమంది వీక్షకులు అసహనం వ్యక్తం చేస్తూ స్పందించారు.ముఖ్యంగా మూడు రకాలైన ప్రశ్నలను/ఆరోపణలను విజ్ఞులైన వీక్షకులు లేవనెత్తారు. అందులో మొదటిది ముఖ్యంగా రాయలసీమకు/కడప జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపైన ప్రచురించిన వ్యాసాలు/అభిప్రాయాలు ఇతర ప్రాంతాల మీద విషం చల్లేవిగా ఉన్నాయన్నది వారి ఆరోపణ. ఇక రెండవది తెదేపాకు ఇబ్బంది కలిగించేటటువంటి అంశాలకు ప్రాధాన్యత ఇస్తున్నామట, […]పూర్తి వివరాలు ...
నగరి శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్ చినికి చినికి గాలివానగా మారడం తెలిసిందే. సభలో రోజా మాట్లాడిన తీరు అభ్యంతరకరమే. తను వాడిన మాటలకు సాటి సభ్యులు నొచ్చుకున్నప్పుడు క్షమాపణ చెప్పకపోవడమూ హుందాతనం కాదు. ఆమెతోబాటు అసభ్యపదజాలం వాడినవాళ్ళందరి మీదా ఒకేరకమైన చర్య తీసుకుని ఉంటే బాగుండేది. అదలా ఉంచితే, సభ్యులను అసలు ఎన్నిరోజుల వరకు సస్పెండ్ చెయ్యొచ్చు అనేదొక ప్రశ్న. సభ్యుల సస్పెన్షన్‌ను ఒక సెషనుకు మాత్రమే పరిమితం చెయ్యడం వెనుక బలమైన కారణముంది. ఇది ఆయా […]పూర్తి వివరాలు ...