ఆధునిక సాహిత్యకారులకు చిరపరిచితమైన పేరు రామకృష్ణారెడ్డి పోసా. నిశితంగా రచన చేయడంలో నేర్పరి. వీరి మొదటి కథ ‘వెనుకబడిన ప్రయాణికుడు’ 1965 జులైలో జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది. కడప మాండలికంలో వీరు రాసిన ‘పెన్నేటి కథలు’ ఆంధ్రజ్యోతి వారపత్రికలో వరుసగా ప్రచురితమయ్యాయి. విద్వాన్ విశ్వం ‘పెన్నేటి పాట’ గేయకావ్యం తర్వాత అంతే పదునుగా, స్పష్టంగా రాయలసీమ జనజీవన చిత్రాన్ని రూపుకట్టి చూపించిన కథలు రామకృష్ణారెడ్డి గారి ‘పెన్నేటి కతలు’. పెన్నేటి ఒడ్డున ఒక గ్రామంలోని జీవన శకలాలను ఒక్కో […]పూర్తి వివరాలు ...
నన్నెచోడుడు కడప జిల్లాలో తూర్పు ప్రాంతాలను పొత్తపి రాజధానిగా పాలించిన అర్వాచీన చోళవంశికుడైన మహారాజు. ప్రాచీన చోళులలో ప్రసిద్ధుడైన కరికాలచోళుని వంశం తనదని చెప్పుకున్నాడు. నన్నెచోడుని తండ్రి చోడబల్లి, తల్లి శ్రీసతి. వీరి రాజ్యం కడప జిల్లాతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉండేది. ఈ రాజులు నందలూరు సౌమ్యనాథుని సేవించినారు. ఈ నన్నెచోడుడు ‘కుమార సంభవము’ అనే ఉత్కృష్ణ కావ్యాన్ని రచించిన కవిరాజశిఖామణి సూర్యవంశరాజు గనుక ఇతనికి టెంకాణాదిత్యుడు అని […]పూర్తి వివరాలు ...
పాము కరవలేదు సరికదా! ఎదురుగ చింతలమ్మ ప్రత్యక్షమైంది. నారాయాణయ్య ఏడుస్తూ ఆమె పాదాల మీద పడ్డాడు. చింతలమ్మ ఆ బాలుని ఓళ్ళో చేర్చుకొని వూరడించింది.”ఎందుకు బాబు ఈ అఘాయిత్య?. నీ మూడోతరంలో గొప్ప హరి భక్తుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశమే తరిస్తుంది. నీకు చదువు రాకపోవడమేమిటి వెళ్ళు, తాళ్ళపాక చెన్నకేశవస్వామే నీకు అన్నీ అనుగ్రహిస్తాడు” అని చింతలమ్మ బాలుని చింత తీర్చి అదృశ్యమైంది. అమ్మ చెప్పినట్లు నారాయాణయ్యకు చెన్నకేశవస్వామి దయవల్ల అన్ని విద్యలూ సిద్ధించాయి. […]పూర్తి వివరాలు ...
అదిగో తెలుగు తల్లి తన కన్నబిడ్డకు గోరుముద్దలు తినిపిస్తూ పాడుతూంది. “చందమామ రావో జాబిల్లి రావో,మంచి కుందనంపు పైడికోర వెన్నపాలు తేవో” ఈ చందమామ పాట వ్రాసిందెవరో తెలుసా! తాళ్లపాక అన్నమాచార్యులు/అన్నమయ్య – వేంకటేశ్వరస్వామికి గొప్ప భక్తుడు; మహా కవి. మన తెలుగులో తొలి వాగ్గేయకారుడు. వాగ్గేయకారుడంటే పాటలు స్వయంగా వ్రాసి పాడేవాడని అర్ధం. వేంకటేశ్వరుడు, అన్నమయ్య మేలుకొలుపు పాట పాడుతూంటే విని నిద్రలేచేవాడు. మళ్ళీ ఆయన జోలపాట పాడందే నిద్రపోడు. స్వామికే గాదు అమ్మవారికి కూడ […]పూర్తి వివరాలు ...
పూర్తి పేరు : డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్‌రెడ్డి పుట్టిన తేదీ: 16 అక్టోబర్, 1948 వయస్సు: 66 సంవత్సరాలు వృత్తి : ఆచార్యులు ప్రవృత్తి: సాహితీ వ్యాసంగం విద్యార్హత: తెలుగులో శ్రీ వెంకటేశ్వర విద్యాలయం నుండి డాక్టరేట్ (Ph.D) ప్రస్తుత హోదా: భాద్యులు, సర్ సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం, కడప మరియు గౌరవ అధ్యాపకులు, తెలుగు విభాగం, యోగి వేమన విశ్వవిద్యాలయం నిర్వహించిన హోదాలు: తెలుగు విభాగపు అధిపతిగా పదవీ విరమణ (శ్రీకృష్ణ దేవరాయ […]పూర్తి వివరాలు ...
“విపరీతమైన ఉద్వేగ స్వభావం ఉండీ నేను కవిని ఎందుకు కాలేకపోయాను? వచన రచనే నన్నెందుకు ఆకర్షించింది? ఈ రెండు ప్రశ్నల గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తుంటాను. బహుశా మన సమాజంలో కవిత్వానికీ కవులకీ ఉన్న అగ్రవర్ణాధిక్యత గుర్తొచ్చినప్పుడెల్లా. వీటిని గురించి నేను కావాలని ఆలోచించడం కాదుగానీ నాకు బాల్యంలో పాఠం చెప్పిన వొక గురువు భూతపురి నారాయణస్వామి పండితుడూ, కవి. ఆ హైస్కూల్లో స్వయంగా తన కావ్యం శివభారతం పాఠం చెప్పిన, గొప్ప కవి గడియారం వేంకటశేషశాస్త్రి. ఇంట్లోవున్న […]పూర్తి వివరాలు ...
కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందిన సందర్భంగా.. ప్రముఖ కథా రచయిత ఆచార్య డాక్టర్ కేతు విశ్వనాథరెడ్డి తో కె.ఎస్.రమణ ప్రత్యేకంగా సంభాషించారు. ఆ సంభాషణ ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో డిసెంబర్ 23 ,1996న ప్రచురితమైంది. ఆ సంభాషణ కడప.ఇన్ఫో వీక్షకుల కోసం ఇక్కడ ప్రచురిస్తున్నాం… నిన్న కా.రా. మాష్టారు, నేడు మీరు కేంద్ర సాహిత్యఅకాడమీ అవార్డు పొందటం ఆధునిక తెలుగు సాహిత్యానికి అనువైన వాతావరణం ఏర్పడుతోంది అనటానికి సూచనగా వుందని భావిస్తున్నారు. మీరేమంటారు? “మీరన్నది అక్షరాల నిజం. ఆధునిక […]పూర్తి వివరాలు ...
తల్లిదండ్రులను అందరు పిల్లలు ప్రేమిస్తారు. గౌరవిస్తారు. కాని కన్నబిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులు కొద్దిమంది మాత్రమే! బిడ్డలచే ఆరాధించబడే తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక గుణాలు, సంస్కారం ఉండాలి. మహోన్నతమైన ప్రేమ, ఆదరణ, ప్రవర్తన ఉన్నటువంటి పూజ్యులు నా తల్లిదండ్రులు స్వర్గీయులు కడప కోటిరెడ్డి గారు, శ్రీమతి రామసుబ్బమ్మ గారు. నా తండ్రి శ్రీ కోటిరెడ్డి గారు మనోవాక్కాయ కర్మలతో ధర్మము తప్పక ప్రవర్తించారు. వారి ప్రవర్తన, ఆలోచనలు ఉత్తమోత్తంగా ఉండేవి. అతి సున్నితమైన మనస్సు, అబద్ధమాడకూడదు, ఇతరులను నొప్పించకూడదు […]పూర్తి వివరాలు ...
ఒక రోజు చండ ప్రచండంగా వెలిగిన రారా (రాచమల్లు రామచంద్రారెడ్డి) ఈ రోజు మన మధ్యలేరు. ఆయన సహచరుడైన నాకు ఆయన జ్ఞాపకాలు (రారా జ్ఞాపకాలు) మిగిలాయి. కడపోత్సవాల సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకాన్ని మననం చేసుకోవడం మంచిదన్న అభిప్రాయంతో, నా జ్ఞాపకాల్ని పాఠకుల ముందుంచుతున్నాను. కడప జిల్లాకు సంబంధించి ఆధునిక కథానిక ప్రక్రియలు గాని, విమర్శనా ప్రక్రియను గాని, ఉటంకించదలచుకుంటే రారా పేరు అనివార్యం. నిజానికి ఆయన పేరు కడప జిల్లాకు మాత్రమే పరిమితం కాదు […]పూర్తి వివరాలు ...