- Categories
-
Tags
air kadapa all india radio bakkayapalli brahmani steels communist leader sivaramireddy cp brown cp brown library cpbrown cpbrown research center eddula eddula eswar eddula eswarreddy gandhi in kadapa gandhi in proddutur gandikota gandikota utsavalu go120 jagan reddy kadapa kadapa airport kadapa district kadapa radio kasinayana mahatma gandhi proddatur tour mj death anniversary muneyya narreddy sivaramireddy omc ontimitta brahmotsavams padmanabham padmanabham birth anniversary padmanabham death anniversary padmavati medical college puttaparti puttaparti narayanacharya birth anniversary puttaparti narayanacharyulu raaraa raaraa birth anniversary rayachoti rims sivaramireddy death anniversary sreebhag pact veerabhadra temple vivekanandareddy vontimitta brahmotsavam ycvreddy ycvreddy birth anniversary ycvreddy death anniversary yeddual eswarreddy ys ys birthday ys death anniversary ys jagan ys jagan sworn as ap cm ys viveka ys vivekananda reddy ysjagan ysr ysr birth anniversary ysr district yvreddy birthday అనంతరాజుపేట అన్నమయ్య జయంతి అన్నమాచార్యుల జయంతి అరవపల్లె అస్మిత : విమర్శనాత్మక వాస్తవికత - నా కథానిక ఆకాశవాణి ఆకాశవాణి కడప ఆకాశవాణి కడప ప్రసారాలు ఆరాధన ఉక్కు కర్మాగారం ఉద్యాన కళాశాల ఎంజె వర్ధంతి ఎద్దుల ఈశ్వరరెడ్డి ఎమ్మనూరు చినవెంకటరెడ్డి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కడప కడప జిల్లా కడప విమానాశ్రయం కడపలో గాంధీజీ కడపలో గాంధీజీ ఉపన్యాసం కలిమిశెట్టి మునెయ్య కాశినాయన కాశినాయన ఆరాధన కేతు విశ్వనాథరెడ్డి గండికోట గండికోట ఉత్సవాలు గాంధీజీ కడప పర్యటన గాంధీజీ పర్యటన చలసాని ప్రసాద్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవో120 జ్యోతి తవ్వా సురేష్ రెడ్డి ధ్వజారోహణం నందలూరు నర్రెడ్డి శివరామిరెడ్డి పత్తిపాక మోహన్ పద్మనాభం పద్మనాభం జయంతి పద్మనాభం వర్ధంతి పద్మావతి మహిళా వైద్య కళాశాల పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి పెద్దమ్మ దేవర పోతన జయంతి ప్రొద్దుటూరు బక్కాయపల్లె దేవర బసవరాజు పద్మనాభం బ్రాహ్మణి ఉక్కు మద్రామాయణ ప్రవచనం మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు ముఖ్యమంత్రిగా జగన్ ముత్తు మారమ్మ ముత్తుమారమ్మ ముత్తుమారమ్మ జాతర మునెయ్య మునెయ్య వర్ధంతి యెద్దుల ఈశ్వరరెడ్డి రాచమల్లు రామచంద్రారెడ్డి రాజశేఖరరెడ్డి రాయచోటి రాయలసీమ రాయలసీమ అభివృద్ది సదస్సు రారా జయంతి రారా వర్ధంతి రిమ్స్ రైల్వే కోడూరు లక్కోజు సంజీవరాయశర్మ విక్టరీ హైస్కూలు విరసం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వెంకటకృష్ణ వెంకటకృష్ణయ్య వై.ఎస్.రాజశేఖర రెడ్డి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జయంతి వైఎస్ పుట్టినరోజు వైఎస్ ప్రమాణస్వీకారం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వర్ధంతి వైఎస్ఆర్ జిల్లా వైవిరెడ్డి జయంతి వైసివి రెడ్డి వైసివి రెడ్డి జయంతి వైసివి రెడ్డి వర్ధంతి వైస్ జగన్ శివరామిరెడ్డి వర్ధంతి శ్రీభాగ్ శ్రీభాగ్ ఒడంబడిక శ్రీభాగ్ ఒప్పందం శ్రీరామజయంతి సంజీవరాయశర్మ సామవేదం షణ్ముఖ శర్మ సి.పి.బ్రౌన్ సింగమనేని నారాయణ సిద్దేశ్వరం అలుగు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన సిపి బ్రౌన్ సిపిబ్రౌన్
పోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది.
21 మే 2007 – ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.
విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న (2019) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానం ఇందుకు వేదికైంది.
గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముహుర్తాన్ని అనుసరించి 12.23 గంటలకు జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చారు.
2019 శాసనసభ ఎన్నికలలో జగన్ పులివెందుల స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.
ఆకాశవాణి కడప కేంద్రం రాయలసీమ ప్రాంత ప్రజల సాంస్కృతిక వాణిగా 1963 జూన్ 17న రిలే కేంద్రంగా ప్రారంభమైంది. అప్పట్లో కేంద్ర సమాచార ప్రసార శాఖామాత్యులు డా. బెజవాడ గోపాలరెడ్డి ఈ రిలే కేంద్రం ప్రారంభించారు. కొప్పర్తిలో రిలే స్టేషన్ నిర్మించి సాయంప్రసారాలు హైదరాబాదునుండి 20 కిలోవాట్ల ప్రసార శక్తితో ప్రారంభమయ్యాయి. 1975 జూన్ లో స్వతంత్ర కేంద్రంగా ప్రసారాలు ప్రారంభమయిన సభకు రాష్ట్రమంత్రి యం. లక్ష్మీదేవి ముఖ్య అరిథి. బెంగుళూరుకు చెందిన టి. ఆర్. రెడ్డి తొలి అసిస్టెంట్ స్టేషన్ డైరక్టరు. తర్వాత డైరక్టరుగా మంగుళూరు బదలీ అయ్యారు. వీరు బెంగుళూరు కేంద్రం డైరక్టరుగా 1986 జూన్ లో రిటైరయ్యారు. బెంగుళురులో స్థిరపడ్డారు.
1974 నవంబరు 2 నుండి మూడు ప్రసారాలు కడప కేంద్రం నుండి ప్రారంభమై నిలయకళాకారులు, కార్యక్రమ నిర్వాహకులు చేరారు. కార్యక్రమ రూపశిల్పులలో శ్రీ బి. ఆర్. పంతులు, ఆర్. విశ్వనాథం, కె. రాజభూషణరావు, శ్రీ గోపాల్, డా. ఆర్. అనంతపద్మనాభరావు, గొల్లపూడి మారుతీరావు, ఆరవీటి శ్రీనివాసులు, దేవళ్ళ బాలకృష్ణ, డి. కె. మురార్, శ్రీ పి. ఆర్. రెడ్డి, వై. గంగిరెడ్డి, డా. టి. మాచిరెడ్డి, సుమన్, కౌతా ప్రియంవద వంటి వారు ప్రముఖులు. ఈ కేంద్రం రాయలసీమ వాసుల చిరకాల వాంఛలకు ప్రతీకగా ఎందరో కళాకారులను తీర్చిదిద్దింది.
1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.
ఈ ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.
1921 సెప్టంబర్ 28న మహాత్మాగాంధీ తిరుపతి (రేణిగుంట) నుండి ప్రత్యేక రైలు బండిలో కడపకు వచ్చారు. సుమారు మధ్యాహ్నం రెండు గంటల సమయంలో రాజంపేటకు చేరుకున్న గాంధీజీ అక్కడ కొద్దిసేపు ఉపన్యసించి తిరిగి కడపకు అదే రైలులో వెళ్లారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో గాంధీజీ కడప చేరుకున్నారు.
అప్పటికే సన్మాన సంఘం వారు అక్కడ సభకు ఏర్పాట్లు చేసి ఉన్నారు. దాదాపుగా 40వేల మంది సభకు హాజరైనారు. జనసందోహం కారణంగా అక్కడ సుమారు ఒక గంట సేపు గందరగోళం జరిగింది. ఈ సభలో కడప మండల సంఘం వారు, మండల సహోదర బృందం వారు, వైశ్య సంఘం వారు వేర్వేరు సన్మాన పత్రాలను సమర్పించినారు. దీనితో పాటు కొందరు కవులు గాంధీజీని ప్రశంసిస్తూ పద్యాలు కూడా చదివినారు. ఇందుకు ప్రత్యుత్తరంగా గాంధీజీ కొద్దిసేపు ఉర్దూలోను, మరికొంత సేపు ఆంగ్లంలోనూ ఉపన్యసించినారు. ఈ ఉపన్యాసాన్ని గాడిచర్ల హరి సర్వోత్తమ రావు గారు సభికులకు తెలుగులోకి అనువదించారు.
ఆ నాటి ఈ ఉపన్యాసం కడప.ఇన్ఫో సందర్శకుల కోసం యధాతధంగా …
కడప కేంద్రంగా తెలుగు బాషా సముద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్. వీరు 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్ పూర్తి పేరు చార్లెస్ ఫిలిప్ బ్రౌన్. 1812లో తండ్రి మృతి చెందడంతో సిపిబ్రౌన్ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. 1820లో కడప కలెక్టర్ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి కడప కలెక్టర్ హన్‌బరీ తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు.
1826లో రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. కడపలో గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు.
1832లో బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్ ప్రెస్ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను తొలగించింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్ లండన్ కోర్టు ఆఫ్ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని పొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్ నిఘంటువులను అమ్ముకుని లండన్ వెళ్లి పోయారు.
1841లో చెన్న పట్టణ పోస్టు మాస్టర్ జనరల్‌గా, తరువాత మదరాసు విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో తన గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు.
తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు, 1855లో లండన్‌కు వెళ్లిపోయారు. 1865లో తెలుగు ఆచార్యుడిగా చేరారు. అప్పట్లోనే చందస్సును అచ్చు వేయించారు. ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్ తుదిశ్వాస వదిలారు .
గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.
సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.
లక్కోజు సంజీవరాయశర్మ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.
ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.
అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.
తెలుగు పునరుజ్జీవన పితామహుడుగా పేరుపొందిన సి.పి.బ్రౌన్ పూర్తిపేరు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్. ఈయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టర్‌కు సహాయకుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు కొన్నాడు. ( ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 రూపాయలుతో సమానం) తెలుగు సాహిత్యానికి సేవచేయడానికై ఆయన ఈ తోటను కొన్నాడు. ఆ స్థలాన్ని బ్రౌన్ కాలేజ్ అని ఆ రోజుల్లో పిలిచేవారు. సి.పి.బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకోసం కట్టించిన భవన శిథిలాలమీద నేటి సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం ఆవిర్భవించింది.
శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ 1974 లో సి.పి.బ్రౌన్ పరిశోధనా పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఆచార్య జి.ఎన్.రెడ్డి అధ్యక్షుడు కాగా బంగోరె(బండి గోపాలరెడ్డి) పరిశోధకుడుగా ఉండేవారు. ఈ ఇద్దరు లండన్‌లో ఉండినటువంటి వేల పుటల వ్రాతప్రతులను తెప్పించారు. దాదాపు 20 సంపుటాల లేఖలు తెప్పించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పదిహేనువేల రూపాయల గ్రాంటును మంజూరుచేసింది.
ఆచార్య జి.ఎన్.రెడ్డి, బంగోరెలు తమ పరిశోధనలో భాగంగా కడపకు అనేక పర్యాయాలు వచ్చారు. బ్రౌన్, రచనలు ఆయన స్వీయచరిత్ర ఆధారంగా ఒక పర్యాయం సి.పి.బ్రౌన్ నివసించిన స్థలాన్ని వాళ్ళు గుర్తించారు. తరువాత వాళ్ళు అప్పటి జిల్లా కలెక్టరు డా.పి.ఎల్.సంజీవరెడ్డి గారిని కలుసుకొని సి.పి.బ్రౌన్ తెలుగు సాహిత్యానికి సేవచేసిన స్థలంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని కోరారు.
జిల్లా కలెక్టరు డా.పి.ఎల్.సంజీవరెడ్డిగారు అప్పటి సి.పి.బ్రౌన్ నివసించిన స్థల యజమాని శ్రీ సి.ఆర్.కృష్ణస్వామి గారి నుండి 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా పొందడంలో విజయం సాధించారు. గ్రంథాలయ నిర్మాణం పనిని అప్పటి కడపజిల్లా రచయితల సంఘం అధ్యక్షకార్యదర్శులైన డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారికి, శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారికి అప్పజెప్పారు.
1986లో స్థలదాత శ్రీ సి.కె.సంపత్‌కుమార్ గారు (సి.ఆర్.కృష్ణస్వామిగారి కుమారుడు) అధ్యక్షుడుగా, జిల్లా కలెక్టర్ ప్రధాన పోషకుడుగా, జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు కార్యదర్శిగా సి.పి.బ్రౌన్ స్మారక ట్రస్టు ఆవిర్భవించింది.
1987 జనవరిలో శ్రీ జంధ్యాల హరినారాయణ గారు జిల్లా కలెక్టరుగా వచ్చారు. ఆయన గ్రామీణ క్రాంతిపథం నిధులనుండి మూడున్నర లక్షల రూపాయలు ట్రస్టుకు మంజూరుచేశారు.
1987 జనవరి 22 న గ్రంథాలయ భవనానికి పునాది వేయబడినది. ఈ కార్యక్రమానికి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ జి.కృష్ణమూర్తి గారు ఆ సంస్థనుండి మొదటి దఫాగా 43,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు.