ఘటనలు

ఫిబ్ర
14
శని
వైసివి రెడ్డి జయంతి
ఫిబ్ర 14 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

జూన్
7
ఆది
కడప విమానాశ్రయం ప్రారంభమైన రోజు
జూన్ 7 @ 12:00 ఉద.

2015 జూన్ 7న కడప విమానాశ్రయం ప్రారంభమైంది. బెంగుళూరు నుండి ఆ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు.

విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని అప్పటి ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

ఆగ
15
శని
నందలూరు ముత్తుమారమ్మ జాతర
ఆగ 15 – ఆగ 17 all-day
నందలూరు ముత్తుమారమ్మ జాతర

నందలూరు రైల్వేస్టేషన్ దారిలోని అరవపల్లె ముత్తు మారమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతరకు రాయలసీమ నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు హాజరవుతారు.

తమిళనాడు ప్రాంతానికి చెందిన అంకయ్య మొదలియార్, వీరస్వామిలు ముత్తుమారమ్మ 150 యేండ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయాభివృద్ధికి కృషిచేశారు. కర్నాటకలోని హుబ్లి నుంచి ముత్తుమారమ్మ మూలవిరాట్‌ను తీసుకొచ్చి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో కుడివైపున వినాయకుడు, ఎడమవైపున సుబ్రహ్మణ్యుడు కొలువై ఉన్నారు.

ఆగ
16
ఆది
అస్మిత : విమర్శనాత్మక వాస్తవికత – నా కథానిక @ సిపి బ్రౌన్ సమావేశ మందిరం
ఆగ 16 @ 10:00 ఉద.

సభాధ్యక్షత : షేక్ హుసేన్

ప్రసంగించే కథకులు : వేంపల్లి అబ్దుల్ ఖాదర్, వేంపల్లి షరీఫ్, శ్రీమతి షహనాజ్ బేగం, సయ్యద్ మహమద్ ఇనయతుల్లా

నిర్వహణా సంస్థ : సాహిత్య అకాడమీ, బెంగుళూరు

అక్టో
4
ఆది
‘మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు’ పుస్తకావిష్కరణ @ సిపి బ్రౌన్ గ్రంధాలయం, యర్రముక్కపల్లి
అక్టో 4 @ 10:00 ఉద. – 12:00 సా.

ఉపన్యాసకులు :

డా. పత్తిపాక మోహన్, సహాయ సంపాదకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ (స్వాగత వచనం)

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు)

ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి (సభాధ్యక్షత)

ఎం నారాయణ శర్మ (పుస్తక సమీక్ష)

సింగమనేని నారాయణ (పుస్తక సంపాదకులు, ప్రసంగిస్తారు)

ఆహ్వాన పత్రం:

madhuranatakam rajaram uttama kathalu

error: