ఆదివారం , 29 డిసెంబర్ 2024

ఘటనలు

జూలై
7
మంగ
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు
జూలై 7 all-day
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.

ఈ  ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.

నవం
24
మంగ
రారా వర్ధంతి
నవం 24 all-day
రారా వర్ధంతి

1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.

ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.

మే
17
మంగ
గాంధీజీ ప్రొద్దుటూరుకు వచ్చారు
మే 17 – మే 18 all-day

1929 మే 17న  కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు గాంధీజీ  ప్రొద్దుటూరు చేరినారు.

అనంతరం శెట్టిపల్లి కొండారెడ్డి గారి భవనానికి మహాత్ముడు కారులో వెళ్లారు. అక్కడ కొంతసేపు విశ్రాంతి తీసుకుని సుమారు అరగంట పాటు నూలు వడికారు. ఆ తరువాత ఆయన అక్కడనే శయనించినారు.

స్థానిక వసంతపేటలోని మునిసిపల్ కార్యాలయం దగ్గర మహాత్మునికి సన్మాన పత్రాలను, విరాళాలను సమర్పించడానికి 18 వ తేదీ ఉదయం సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 6 గంటలకే కస్తూరిబాయితో సహా ఆ ప్రదేశానికి వెళ్ళిన గాంధీజీ ప్రొద్దుటూరు సభ ముగియగానే చాగలమర్రికి బయలుదేరి వెళ్ళినారు.

గాంధీజీ గారి పర్యటన పూర్తి వివరాల కోసం ఇక్కడ చూడండి… https://kadapa.info/గాంధీజీ-కడప-1929/

జూలై
7
గురు

error: