గురువారం , 26 డిసెంబర్ 2024

ఘటనలు

జూలై
8
ఆది
వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు
జూలై 8 all-day

14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1949 జూలై 8 న వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు.

వైఎస్ పుట్టినరోజుఅనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జన్‌గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తైన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. జగన్ మోహన్‌ రెడ్డి (కుమారుడు), షర్మిల (కుమార్తె).

1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు.

వరుసగా నాలుగు సార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించి, అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

వైఎస్సార్‌ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్‌ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు.

అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయం సాధించింది. దీంతో పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్‌.రాజశేఖర రెడ్డిని ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలా ఆయనకు తెలుగు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కింది. ఐదేళ్ల అనంతరం అంటే 2009లోనూ వైఎస్సార్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు.

ఆగ
2
గురు
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి
ఆగ 2 all-day
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి

రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు.

ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఎంజె రైతుల కోసం చేసిన ఉద్యమంకు ప్రతీకగా ఆయన భౌతిక కాయంపై ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళలు అర్పించారు.

ఆయన వామపక్ష దృక్పథానికి సూచనగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన భౌతిక కాయంపై ఎరుపు వస్త్రం కప్పి జోహార్లు అర్పించారు. స్మశానవాటిక వద్ద పలువురు నేతలు, వివిధసంఘాల ప్రతినిధులు, ఎంజె సేవలను గుర్తు చేస్తూ కన్నీటితో ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మైదుకూరులోని సర్వాయపల్లె రోడ్డు నుంచి కడప రోడ్డు ,నాలుగురోడ్ల కూడలి, బద్వేల్ రోడ్డు మీదుగా ఎంజె భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా స్మశాన వాటికకు తరలించారు.

ఆగ
3
శుక్ర
ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి
ఆగ 3 all-day

ఎద్దుల ఈశ్వరరెడ్డి1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి.

ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మరణించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి…https://goo.gl/WAV5Ro

 

ఆగ
17
శుక్ర
వైవిరెడ్డి పుట్టినరోజు
ఆగ 17 all-day
వైవిరెడ్డి పుట్టినరోజు

రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నర్ గా పనిచేసిన వై.వి.రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన IAS (ఐ.ఏ.ఎస్) అధికారి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి 2008 ఆగస్టులో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. అంతకు పూర్వం ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా,  Bank for International Settlements, Asian Consultative Council (ACC) చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

1941 ఆగస్టు 17న కడప జిల్లా పుల్లంపేట మండలం కొమ్మనవారిపల్లె గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. నంద్యాల కలెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఆగ
20
సోమ
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

సెప్టెం
1
శని
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి
సెప్టెం 1 all-day
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త.

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు.

 ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి.

ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

 

సెప్టెం
2
ఆది
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
సెప్టెం 2 all-day
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి

డా.యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే 02/09/2009 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినారు.

సెప్టెం
27
గురు
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
సెప్టెం 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

అక్టో
8
సోమ
వైసివి రెడ్డి వర్ధంతి
అక్టో 8 all-day

వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.

ycvreddy1968 ఏప్రిల్‌నుండి 1969 అక్టోబర్‌ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.

1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.

1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.

వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF

అక్టో
22
సోమ
రాయలసీమ విద్రోహదినం
అక్టో 22 all-day

విభజన తరువాత ఆం.ప్ర పాలనా పగ్గాలు చేపట్టిన తెదేపా అందరి సలహాలను, నివేదికలనూ పట్టించుకోకుండా

error: