మంగళవారం , 19 నవంబర్ 2024

ఘటనలు

మే
31
మంగ
సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన @ కృష్ణా తీరం, సిద్దేశ్వరం
మే 31 all-day

రాయలసీమ సాగునీటి పథకాలకు నీటి లభ్యత కోసం ఏర్పాటు చేయబోయే సిద్దేశ్వరం అలుగుకు శంకుస్థాపన…

రాయలసీమ జిల్లాలకు చెందిన అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు…

జూన్
6
సోమ
అనంతరాజుపేట ప్రభుత్వ ఉద్యాన కళాశాల ప్రారంభం
జూన్ 6 all-day
అనంతరాజుపేట ప్రభుత్వ ఉద్యాన కళాశాల ప్రారంభం

రైల్వేకోడూరు సమీపంలోని అనంతరాజుపేటలో ప్రభుత్వ ఉద్యాన కళాశాల మరియు పరిశోధనా కేంద్రం జూన్ 6 2007న ప్రారంభమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. ఇది రాయలసీమ జిల్లాలలోని ఏకైక ఉద్యానవన కళాశాల (Horticultural College).

డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నా ఈ కళాశాలలో ఉద్యానవన విద్యకు సంబంధించి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

జూన్
7
మంగ
కడప విమానాశ్రయం ప్రారంభమైన రోజు
జూన్ 7 @ 12:00 ఉద.

2015 జూన్ 7న కడప విమానాశ్రయం ప్రారంభమైంది. బెంగుళూరు నుండి ఆ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు.

విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని అప్పటి ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.

జూలై
7
గురు
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు
జూలై 7 all-day
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.

ఈ  ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.

ఆగ
2
మంగ
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి
ఆగ 2 all-day
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి

రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు.

ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఎంజె రైతుల కోసం చేసిన ఉద్యమంకు ప్రతీకగా ఆయన భౌతిక కాయంపై ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళలు అర్పించారు.

ఆయన వామపక్ష దృక్పథానికి సూచనగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన భౌతిక కాయంపై ఎరుపు వస్త్రం కప్పి జోహార్లు అర్పించారు. స్మశానవాటిక వద్ద పలువురు నేతలు, వివిధసంఘాల ప్రతినిధులు, ఎంజె సేవలను గుర్తు చేస్తూ కన్నీటితో ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మైదుకూరులోని సర్వాయపల్లె రోడ్డు నుంచి కడప రోడ్డు ,నాలుగురోడ్ల కూడలి, బద్వేల్ రోడ్డు మీదుగా ఎంజె భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా స్మశాన వాటికకు తరలించారు.

ఆగ
17
బుధ
వైవిరెడ్డి పుట్టినరోజు
ఆగ 17 all-day
వైవిరెడ్డి పుట్టినరోజు

రిజర్వ్ బ్యాంకు ఇరవై ఒకటవ గవర్నర్ గా పనిచేసిన వై.వి.రెడ్డి 1964 బ్యాచ్ కు చెందిన IAS (ఐ.ఏ.ఎస్) అధికారి. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలస్థంభమైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నరుగా ఐదేళ్ళు పనిచేసి 2008 ఆగస్టులో పదవీవిరమణ చేసిన డా. వై.వి.రెడ్డి పూర్తి పేరు యాగా వేణుగోపాల్ రెడ్డి. అంతకు పూర్వం ఆయన అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (IMF) ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా,  Bank for International Settlements, Asian Consultative Council (ACC) చైర్మన్ గా కూడా పనిచేశారు. ఆయన ఉద్యోగ జీవితం దాదాపు పూర్తిగా ఆర్థిక, ప్రణాళికా రంగాల్లోనే సాగింది. ప్రస్తుతం 14వ ఆర్థిక సంఘం అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు.

1941 ఆగస్టు 17న కడప జిల్లా పుల్లంపేట మండలం కొమ్మనవారిపల్లె గ్రామంలో జన్మించారు. వీరి తండ్రి యాగా పిచ్చిరెడ్డి ఆ రోజుల్లోనే అప్పటి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఎన్నో ఉన్నత పదవుల్లో బాధ్యతలు నిర్వహించారు. నంద్యాల కలెక్టర్‌గా కూడా ఆయన పనిచేశారు.

ఆగ
20
శని
హాస్యనటుడు పద్మనాభం జయంతి
ఆగ 20 all-day
హాస్యనటుడు పద్మనాభం జయంతి

ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.

ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో  ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.

పద్మనాభం రేఖా అండ్‌ మురళి ఆర్ట్స్‌ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్‌, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.

పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/

ఆగ
23
మంగ
పద్మావతి మహిళా వైద్య కళాశాల విషయంలో జీవో120 విడుదల చేసిన రోజు
ఆగ 23 all-day

అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి జీవో నెంబరు 120ని విడుదల చేసింది.

జూన్ 8, 2014న ఆం.ప్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయగా, జులైలో రాష్ట్రపతి ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ, ఎస్వీయు పరిధిని ప్రశ్నార్థకం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల(తిరుపతి)లోని 85%గా ఉన్న కన్వీనర్ కోటా సీట్లను 13 జిల్లాలకు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఎస్వీయు పరిధిలోని పరిధిలోని ఐదు జిల్లాల వారికి దక్కాల్సిన 107 సీట్లను ఇతర జిల్లాల వారు తన్నుకుపోయారు. ఈ జీవోను తప్పు పట్టిన ఆం.ప్ర హైకోర్టు ఆ జీవో చెల్లదని తీర్పునిచ్చింది.

జీవో నెంబరు 120 వివరాలు : https://kadapa.info/జీవో120/

 

సెప్టెం
1
గురు
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి
సెప్టెం 1 all-day
పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి

తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త.

పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు.

 ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి.

ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.

 

సెప్టెం
2
శుక్ర
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి
సెప్టెం 2 all-day
వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి

డా.యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే 02/09/2009 నాడు జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందినారు.

error: