శనివారం , 7 సెప్టెంబర్ 2024

ఘటనలు

ఆగ
15
శని
నందలూరు ముత్తుమారమ్మ జాతర
ఆగ 15 – ఆగ 17 all-day
నందలూరు ముత్తుమారమ్మ జాతర

నందలూరు రైల్వేస్టేషన్ దారిలోని అరవపల్లె ముత్తు మారమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతరకు రాయలసీమ నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు హాజరవుతారు.

తమిళనాడు ప్రాంతానికి చెందిన అంకయ్య మొదలియార్, వీరస్వామిలు ముత్తుమారమ్మ 150 యేండ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయాభివృద్ధికి కృషిచేశారు. కర్నాటకలోని హుబ్లి నుంచి ముత్తుమారమ్మ మూలవిరాట్‌ను తీసుకొచ్చి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో కుడివైపున వినాయకుడు, ఎడమవైపున సుబ్రహ్మణ్యుడు కొలువై ఉన్నారు.

సెప్టెం
26
శని
గండికోట ఉత్సవాలు
సెప్టెం 26 – సెప్టెం 27 all-day
గండికోట ఉత్సవాలు

కడప: ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ గండికోట ఉత్సవాలను సెప్టెంబర్ 26న నిర్వహించాలని కలెక్టర్ వెంకటరమణ ఆదేశించారు. బుధవారం సభాభవన్‌లో నిర్వహించిన జిల్లా పర్యాటక ప్రమోషన్ కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 26న గండికోట ఉత్సవాలు, 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు.

కార్యక్రమాలను నిర్వహించేందుకు వేదిక, రిసెప్షన్, పార్కింగ్ స్థలం, అప్రోచ్ స్థలం, ఎగ్జిబిషన్, విద్యుత్తు దీపాలు తదితర వసతులు కల్పించాలని ఆదేశించారు. ప్రజలకు తెలిసేలా ప్రచారం చేయాలని చెప్పారు. తాగునీటి సమస్యను 15రోజుల్లోగా పరిష్కరించాలన్నారు. గండికోట ప్రాశస్థ్యం తెలిసేలా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.

జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి గోపాల్ మాట్లాడుతూ.. జిల్లాలోని 23 పర్యాటక వసతి, సమాచార భవనాలన్ని దేవాదాయశాఖ స్థలాల్లో నిర్మించారన్నారు. గండికోట నుండి మైలవరం వరకు జల విహారయానం, వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తీసుకోవాలని చెప్పారు. స్థానిక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి రెండుకోట్ల రూపాయలు బడ్జెట్‌లో ఉందన్నారు. యాత్రికులను ఆకర్షించేలా పుష్పగిరి దేవాలయం, ఆమీన్‌పీర్ దర్గా, చింతకొమ్మదిన్నె మండలంలోని గంగమ్మ దేవాలయాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.

ఇంతకీ ఈ సారైనా గండికోట ఉత్సవాలు జరుగుతాయా?

అక్టో
4
ఆది
‘మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు’ పుస్తకావిష్కరణ @ సిపి బ్రౌన్ గ్రంధాలయం, యర్రముక్కపల్లి
అక్టో 4 @ 10:00 ఉద. – 12:00 సా.

ఉపన్యాసకులు :

డా. పత్తిపాక మోహన్, సహాయ సంపాదకులు, నేషనల్ బుక్ ట్రస్ట్ (స్వాగత వచనం)

ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి (పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు)

ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి (సభాధ్యక్షత)

ఎం నారాయణ శర్మ (పుస్తక సమీక్ష)

సింగమనేని నారాయణ (పుస్తక సంపాదకులు, ప్రసంగిస్తారు)

ఆహ్వాన పత్రం:

madhuranatakam rajaram uttama kathalu

ఏప్రి
14
గురు
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల అంకురార్పణ @ కోదండరామస్వామి దేవాలయం
ఏప్రి 14 @ 8:00 సా. – 9:30 సా.
ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాల అంకురార్పణ @ కోదండరామస్వామి దేవాలయం

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

ఏప్రి
15
శుక్ర
ధ్వజారోహణం, శ్రీరామజయంతి @ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట
ఏప్రి 15 @ 8:00 ఉద. – 10:00 ఉద.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

పోతన జయంతి, కవి సమ్మేళనం @ కోదండ రామాలయం, ఒంటిమిట్ట
ఏప్రి 15 @ 4:00 సా. – 7:59 సా.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

శేషవాహనం @ కోదండరామస్వామి దేవాలయం, ఒంటిమిట్ట
ఏప్రి 15 @ 8:00 సా. – 9:30 సా.

ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్‌ 14 నుంచి 24వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి.

వివరాలకు… https://kadapa.info/ontimitta-brahmotsavam/

ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… https://kadapa.info/ఒంటిమిట్టకు/

ఫిబ్ర
22
బుధ
వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు – రాయచోటి @ వీరభద్ర స్వామి వారి ఆలయం
ఫిబ్ర 22 – మార్చి 4 all-day

రాయచోటి వీరభద్రస్వామి  బ్రహ్మోత్సవాలు ఈ నెల 22 నుండి వచ్చే నెల 4వ తేదీ వరకు జరగనున్నాయి.

రాయచోటిలో మాండవ్య నది ఒడ్డున భద్రకాళి సమేత వీరభద్రుస్వామి దేవాలయం ఉంది. వీరభద్ర స్వామికి రాచరాయుడు అనే పేరుకూడ ఉంది. ఇక్కడ మార్చి నెలలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాలు జరిగిన తరు వాత మధ్యలో ఉన్న ద్వారాలు దాటుకొని సూర్యకిరణాలు స్వామి వారి పాదాలను తాకడం ప్రత్యేక విశేషం.

ఉత్సవాలలోని ముఖ్య ఘట్టాలు:

23-02-2017 : కల్యాణ ఉత్సవము, సుమంగళి పూజ

27-02-2017 : పూలంగి సేవ

28-02-2017: నంది వాహనోత్సవం

01-03-2017 : అగ్నిగుండ ప్రవేశం, మహా నైవేద్యం, రథోత్సవం

error: