మంగళవారం , 24 డిసెంబర్ 2024

ఘటనలు

నవం
10
గురు
సిపి బ్రౌన్ పుట్టిన రోజు
నవం 10 all-day
సిపి బ్రౌన్ పుట్టిన రోజు

కడప కేంద్రంగా తెలుగు బాషా సముద్ధరణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఆంగ్లేయుడు సిపి బ్రౌన్‌. వీరు 1798, నవంబరు 10న కోల్‌కత్తాలో జన్మించారు. సిపి బ్రౌన్‌ పూర్తి పేరు చార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. 1812లో తండ్రి మృతి చెందడంతో సిపిబ్రౌన్‌ తన కుటుంబంతో 14వ యేట ఇంగ్లాండుకు వెళ్లిపోయారు. ఇండియా పాలనలో పనిచేస్తూ మరణించిన వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడంతో 1817లో తన 22వ యేట సిపిబ్రౌన్‌ చెన్న పట్టణoలో అడుగు పెట్టారు. 1820లో కడప కలెక్టర్‌ సహాయకుడిగా ఉద్యోగం ప్రారంభమైంది. అప్పటి  కడప కలెక్టర్‌ హన్‌బరీ  తెలుగులో మాట్లాడేవారు. అయనను స్ఫూర్తిగా తీసుకున్న బ్రౌన్‌ అనతి కాలంలోనే తెలుగును అనర్గళంగా మాట్లాడటం నేర్చుకున్నారు. 1822 అక్టోబరులో మచిలీపట్నం జిల్లా రిజిష్ట్రార్‌గా వెళ్లారు.

1826లో రిజిష్ట్రార్‌గా మళ్లీ కడపకు బదిలీపై వచ్చారు. కడపలో గ్రంథాల ఆవిష్కరణ, శుద్ధ ప్రతుల తయారుచేసేందుకు అనువుగా పెద్ద బంగ్లా, ఆహ్లాదకరమైన తోటను వెయ్యి వరహాలు ఇచ్చి కొన్నారు. అక్కడి నుంచి 1829 మే నాటికి 16వేల పదాల నిఘంటువును తయారు చేశారు.

1832లో  బదిలీపై మచిలీపట్నం వెళ్లారు. అక్కడ ప్రింటింగ్‌ ప్రెస్‌ స్థాపించి నిఘంటువులను అచ్చు వేయించారు. 1834లో కంపెనీ బోర్డు బ్రౌన్‌ను తొలగించింది. ఉద్యోగాన్ని పోగొట్టుకున్న బ్రౌన్‌ లండన్‌ కోర్టు ఆఫ్‌ డైరెక్టర్‌కు అప్పీలు చేసి మూడు సంవత్సరాల జీతాన్ని పొందారు. ఉద్యోగం పోయిన సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా తాను తయారు చేసిన ఇంగ్లీష్‌ నిఘంటువులను అమ్ముకుని లండన్‌ వెళ్లి పోయారు.

1841లో చెన్న పట్టణ  పోస్టు మాస్టర్‌ జనరల్‌గా, తరువాత మదరాసు  విశ్వవిద్యాలయ పాలకమండలి సభ్యునిగా, గ్రంథాలయ క్యూరేటర్‌గా పని చేశారు. 1846లో తన గ్రంథాలయం నుంచి దేశభాషలలోని 2,440 రాత ప్రతులను చెన్నై లిటరసీ సొసైటికి బహూకరించారు.

తెలుగుభాషా సాహిత్యాల సముద్ధరణకు నడుంబిగించిన తెలుగు బిడ్డకు 1853లో పక్ష వాతం జబ్బు వచ్చింది. దీంతో ఆయన సెలవు పెట్టి నీలగిరి కొండలకు, 1855లో లండన్‌కు వెళ్లిపోయారు. 1865లో తెలుగు ఆచార్యుడిగా చేరారు. అప్పట్లోనే  చందస్సును అచ్చు వేయించారు.  ఆంధ్ర సాహిత్యాన్ని ప్రజ్వలింపజేసిన బ్రౌన్‌ చిరస్మరణీయుడు. 1884 డిసెoబరు 12న సిపిబ్రౌన్‌ తుదిశ్వాస వదిలారు .

నవం
22
మంగ
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి
నవం 22 all-day
లక్కోజు సంజీవరాయశర్మ జయంతి

గణిత బ్రహ్మగా పేరొందిన లక్కోజు సంజీవరాయశర్మ (నవంబర్ 22, 1907 – డిసెంబరు 2, 1997) ప్రపంచంలో ఆరు వేల గణితావధానాలు చేసిన ఏకైక వ్యక్తి.

సంజీవరాయశర్మ 1907 నవంబర్ 22 న వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు లో జన్మించాడు. ఈయన తల్లితండ్రులు నాగమాంబ, పెద్ద పుల్లయ్యలు.

లక్కోజు సంజీవరాయశర్మ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

నవం
24
గురు
రారా వర్ధంతి
నవం 24 all-day
రారా వర్ధంతి

1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రామ చంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు. తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది.

ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు). వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి. వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు. రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.

 

జన
11
బుధ
నర్రెడ్డి శివరామిరెడ్డి వర్ధంతి
జన 11 all-day

వైఎస్సార్‌ జిల్లా గడ్డం వారి పల్లెలో 1922 ఫిబ్రవరి 25న పుట్టిన నర్రెడ్డి శివరామిరెడ్డి స్వాతంత్య్ర సమరయోధులు, కమ్యూనిస్టు నాయకులు.

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత చట్టసభకు ఎన్నికైన తొలితరం ప్రజాప్రతినిధుల్లో ఒకరు. 1957లో కమలాపురం–పులివెందుల ఉమ్మడి నియోజకవర్గం సీపీఐ ఎమ్మెల్యేగా శివరామిరెడ్డి ఎన్నికయ్యారు.

గతంలో సీపీఐ కడప జిల్లా కార్యదర్శిగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. రైతులోకం, అరుణోదయ పత్రికలకు సంపాదకులుగా పనిచేశారు.

వెనుకబడిన రాయలసీమ పురోగతి ప్రాజెక్టుల నిర్మాణంతో సాధ్యమని భావించి ఉద్యమబాట పట్టారు. 1996లో గండికోట ప్రాజెక్టు శంకుస్థాపన కోసం ఆయన నాటి కడప కలెక్టరేట్‌ ఎదుట నిరాహార దీక్ష చేశారు. సాక్షితో పాటు పలు పత్రికలకు వ్యాసాలు రాసి గుర్తింపు పొందారు.

2019 జనవరి 10న (గురువారం) బ్రెయిన్‌ డెడ్‌కు గురైన శివరామిరెడ్డి  హైదరాబాదులోని యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ జనవరి 11న కన్నుమూశారు.

జన
22
ఆది
బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు
జన 22 all-day
బ్రౌన్ లైబ్రరీ నిర్మాణం మొదలైన రోజు

తెలుగు పునరుజ్జీవన పితామహుడుగా పేరుపొందిన సి.పి.బ్రౌన్‌ పూర్తిపేరు ఛార్లెస్‌ ఫిలిప్‌ బ్రౌన్‌. ఈయన తూర్పు ఇండియా కంపెనీ ఉద్యోగిగా 1820లో కడపజిల్లా కలెక్టర్‌కు సహాయకుడుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించాడు. ఈయన కడపలో 15 ఎకరాల తోటను ఒక బంగ్లాతో సహా 3,000 వరహాలకు కొన్నాడు. ( ఒక వరహా అంటే ఆ రోజుల్లో 4 రూపాయలుతో సమానం) తెలుగు సాహిత్యానికి సేవచేయడానికై ఆయన ఈ తోటను కొన్నాడు. ఆ స్థలాన్ని బ్రౌన్‌ కాలేజ్‌ అని ఆ రోజుల్లో పిలిచేవారు. సి.పి.బ్రౌన్‌ తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకోసం కట్టించిన భవన శిథిలాలమీద నేటి సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రం ఆవిర్భవించింది.

శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని తెలుగుశాఖ 1974 లో సి.పి.బ్రౌన్‌ పరిశోధనా పథకాన్ని ప్రారంభించింది. దీనికి ఆచార్య జి.ఎన్‌.రెడ్డి అధ్యక్షుడు కాగా బంగోరె(బండి గోపాలరెడ్డి) పరిశోధకుడుగా ఉండేవారు. ఈ ఇద్దరు లండన్‌లో ఉండినటువంటి వేల పుటల వ్రాతప్రతులను తెప్పించారు. దాదాపు 20 సంపుటాల లేఖలు తెప్పించారు. ఈ ప్రాజెక్టు నిర్వహణకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి పదిహేనువేల రూపాయల గ్రాంటును మంజూరుచేసింది.

ఆచార్య జి.ఎన్‌.రెడ్డి, బంగోరెలు తమ పరిశోధనలో భాగంగా కడపకు అనేక పర్యాయాలు వచ్చారు. బ్రౌన్‌, రచనలు ఆయన స్వీయచరిత్ర ఆధారంగా ఒక పర్యాయం సి.పి.బ్రౌన్‌ నివసించిన స్థలాన్ని వాళ్ళు గుర్తించారు. తరువాత వాళ్ళు అప్పటి జిల్లా కలెక్టరు డా.పి.ఎల్‌.సంజీవరెడ్డి గారిని కలుసుకొని సి.పి.బ్రౌన్‌ తెలుగు సాహిత్యానికి సేవచేసిన స్థలంలో ఒక గ్రంథాలయాన్ని స్థాపించాలని కోరారు.

జిల్లా కలెక్టరు డా.పి.ఎల్‌.సంజీవరెడ్డిగారు అప్పటి సి.పి.బ్రౌన్‌ నివసించిన స్థల యజమాని శ్రీ సి.ఆర్‌.కృష్ణస్వామి గారి నుండి 20 సెంట్ల స్థలాన్ని విరాళంగా పొందడంలో విజయం సాధించారు. గ్రంథాలయ నిర్మాణం పనిని అప్పటి కడపజిల్లా రచయితల సంఘం అధ్యక్షకార్యదర్శులైన డా.మల్లెమాల వేణుగోపాలరెడ్డి గారికి, శ్రీ జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారికి అప్పజెప్పారు.

1986లో స్థలదాత శ్రీ సి.కె.సంపత్‌కుమార్‌ గారు (సి.ఆర్‌.కృష్ణస్వామిగారి కుమారుడు) అధ్యక్షుడుగా, జిల్లా కలెక్టర్‌ ప్రధాన పోషకుడుగా, జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారు కార్యదర్శిగా సి.పి.బ్రౌన్‌ స్మారక ట్రస్టు ఆవిర్భవించింది.

1987 జనవరిలో శ్రీ జంధ్యాల హరినారాయణ గారు జిల్లా కలెక్టరుగా వచ్చారు. ఆయన గ్రామీణ క్రాంతిపథం నిధులనుండి మూడున్నర లక్షల రూపాయలు ట్రస్టుకు మంజూరుచేశారు.

1987 జనవరి 22 న గ్రంథాలయ భవనానికి పునాది వేయబడినది. ఈ కార్యక్రమానికి సరస్వతీపుత్ర పుట్టపర్తి నారాయణాచార్యులు గారు అధ్యక్షులుగా ఉన్నారు. కడప పట్టణాభివృద్ధి సంస్థ అధ్యక్షులు శ్రీ జి.కృష్ణమూర్తి గారు ఆ సంస్థనుండి మొదటి దఫాగా 43,000 రూపాయలు విరాళంగా ఇచ్చారు.

ఫిబ్ర
26
ఆది
నటుడు వెంకటకృష్ణయ్య వర్ధంతి
ఫిబ్ర 26 all-day

నాటక రంగంలో విభిన్న పాత్రలు పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న లక్కిరెడ్డిపల్లెకు చెందిన రంగస్థల కళాకారుడు వెంకటకృష్ణయ్య 26 ఫిబ్రవరి 2014న నాగులగుట్టపల్లిలో కన్నుమూశారు.

అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

మార్చి
15
బుధ
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
మార్చి 15 all-day

on March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded that it was a homicide.

ఏప్రి
1
శని
పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం
ఏప్రి 1 all-day

పోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది.

పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

మే
1
సోమ
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి
మే 1 all-day
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి

తెలుగునేలపై జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపదగేయాలు వేనవేలు. ఔత్సాహిక కలాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు.

1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య.

చారిత్రక సత్యాలు ప్రతిబింభించే బుడ్డా వెంగళరెడ్డి, గురిగింజ గుమ్మడి, కోడిపిల్ల, కోడిబాయ లచ్చమ్మది, యాపమానెక్కినావు, తేలుకుట్టిందే పిన్ని, నాంచారి, నామాట, కోల్ కోల్, చీరెల్, తుమ్మెదలు మొదలైన హాస్య గీతాలు ఆయన వినిపించినప్పుడు శ్రోతలు మరియు ప్రేక్షకుల మదిలో గిలిగింతలు కలిగిస్తాయి.

శ్రామికులు పర్వదినంగా జరుపుకునే ‘మేడే’ వేడుకలలో శ్రామికుల ముందు తన గళాన్ని విప్పడానికి తన బృందంతో 1.5.1997 న మంత్రాలయంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తూ కోడుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానరాని తీరాలకు వెళ్ళిపోయారు.

‘రాయలసీమ రాగాలు’ పేర సీమ జానపదాలను మునెయ్య సంకలనం చేశారు. ఈ పుస్తకాన్ని ‘తెలుగు అకాడమీ’ ప్రచురించింది.

మే
21
ఆది
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
మే 21 all-day

21 మే  2007 –  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

error: