- Categories
-
Tags
air kadapa all india radio bakkayapalli brahmani steels communist leader sivaramireddy cp brown cp brown library cpbrown cpbrown research center eddula eddula eswar eddula eswarreddy gandhi in kadapa gandhi in proddutur gandikota gandikota utsavalu go120 jagan reddy kadapa kadapa airport kadapa district kadapa radio kasinayana mahatma gandhi proddatur tour mj death anniversary muneyya narreddy sivaramireddy omc ontimitta brahmotsavams padmanabham padmanabham birth anniversary padmanabham death anniversary padmavati medical college puttaparti puttaparti narayanacharya birth anniversary puttaparti narayanacharyulu raaraa raaraa birth anniversary rayachoti rims sivaramireddy death anniversary sreebhag pact veerabhadra temple vivekanandareddy vontimitta brahmotsavam ycvreddy ycvreddy birth anniversary ycvreddy death anniversary yeddual eswarreddy ys ys birthday ys death anniversary ys jagan ys jagan sworn as ap cm ys viveka ys vivekananda reddy ysjagan ysr ysr birth anniversary ysr district yvreddy birthday అనంతరాజుపేట అన్నమయ్య జయంతి అన్నమాచార్యుల జయంతి అరవపల్లె అస్మిత : విమర్శనాత్మక వాస్తవికత - నా కథానిక ఆకాశవాణి ఆకాశవాణి కడప ఆకాశవాణి కడప ప్రసారాలు ఆరాధన ఉక్కు కర్మాగారం ఉద్యాన కళాశాల ఎంజె వర్ధంతి ఎద్దుల ఈశ్వరరెడ్డి ఎమ్మనూరు చినవెంకటరెడ్డి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు ఓబులాపురం మైనింగ్ కంపెనీ కడప కడప జిల్లా కడప విమానాశ్రయం కడపలో గాంధీజీ కడపలో గాంధీజీ ఉపన్యాసం కలిమిశెట్టి మునెయ్య కాశినాయన కాశినాయన ఆరాధన కేతు విశ్వనాథరెడ్డి గండికోట గండికోట ఉత్సవాలు గాంధీజీ కడప పర్యటన గాంధీజీ పర్యటన చలసాని ప్రసాద్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ జీవో120 జ్యోతి తవ్వా సురేష్ రెడ్డి ధ్వజారోహణం నందలూరు నర్రెడ్డి శివరామిరెడ్డి పత్తిపాక మోహన్ పద్మనాభం పద్మనాభం జయంతి పద్మనాభం వర్ధంతి పద్మావతి మహిళా వైద్య కళాశాల పుట్టపర్తి నారాయణాచార్యుల వర్ధంతి పెద్దమ్మ దేవర పోతన జయంతి ప్రొద్దుటూరు బక్కాయపల్లె దేవర బసవరాజు పద్మనాభం బ్రాహ్మణి ఉక్కు మద్రామాయణ ప్రవచనం మధురాంతకం రాజారాం ఉత్తమ కథలు ముఖ్యమంత్రిగా జగన్ ముత్తు మారమ్మ ముత్తుమారమ్మ ముత్తుమారమ్మ జాతర మునెయ్య మునెయ్య వర్ధంతి యెద్దుల ఈశ్వరరెడ్డి రాచమల్లు రామచంద్రారెడ్డి రాజశేఖరరెడ్డి రాయచోటి రాయలసీమ రాయలసీమ అభివృద్ది సదస్సు రారా జయంతి రారా వర్ధంతి రిమ్స్ రైల్వే కోడూరు లక్కోజు సంజీవరాయశర్మ విక్టరీ హైస్కూలు విరసం వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు వెంకటకృష్ణ వెంకటకృష్ణయ్య వై.ఎస్.రాజశేఖర రెడ్డి వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ జయంతి వైఎస్ పుట్టినరోజు వైఎస్ ప్రమాణస్వీకారం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ వర్ధంతి వైఎస్ఆర్ జిల్లా వైవిరెడ్డి జయంతి వైసివి రెడ్డి వైసివి రెడ్డి జయంతి వైసివి రెడ్డి వర్ధంతి వైస్ జగన్ శివరామిరెడ్డి వర్ధంతి శ్రీభాగ్ శ్రీభాగ్ ఒడంబడిక శ్రీభాగ్ ఒప్పందం శ్రీరామజయంతి సంజీవరాయశర్మ సామవేదం షణ్ముఖ శర్మ సి.పి.బ్రౌన్ సింగమనేని నారాయణ సిద్దేశ్వరం అలుగు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన సిపి బ్రౌన్ సిపిబ్రౌన్
వైసివిరెడ్డిగా తెలుగు సాహితీ లోకానికి పరిచితుడైన ఎమ్మనూరు చినవెంకటరెడ్డి అభ్యుదయవాది- కడపజిల్లా పులివెందుల సమీపంలోని బోనాల గ్రామంలో 14-2-1924న జన్మించారు.
1968 ఏప్రిల్నుండి 1969 అక్టోబర్ దాకా, రా.రా.సంపాదకత్వంలో వెలువడిన ‘సంవేదన’ త్రైమాసిక పత్రిక, ప్రచురణ కర్తగా, ‘యుగసాహితి’ సంస్థను నిర్వహించారు. వైసివి కథలన్నీ 1982లో ‘గట్టిగింజలు’ అన్న సంపుటిగా వెలువడ్డాయి. ‘తొలకరి చినుకులు’ అన్న ఖండకావ్యం, ‘గుత్తి చరిత్ర’ అన్న చిరుకావ్యం కూడా రాశారు.
1972 నుండి కడపజిల్లా అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షుడుగా ఎన్నో కవి సమ్మేళనాలు, గోష్టులు నిర్వహించారు.
1989 అక్టోబరు 8వ తేదీన కడప మున్సిపల్ హైస్కూల్లో జరుగుతున్న అభ్యుదయ రచయితల సభల్లో పాల్గొంటూ, మధ్యాహ్న భోజన విరామంలో హఠాత్తుగా గుండెపోటు రావటంతో కన్నుమూశారు.
వైసివి రెడ్డి గురించి జానమద్ది రాసిన వ్యాసం … http://wp.me/p4r10f-wF
ఆరు దశకాల పైచిలుకు సినీ జీవితంలో 400లకు పైగా చిత్రాలలో నటించి తనదైన హావ భావాలతో అఖిలాంద్ర ప్రేక్షకులను నవ్వించిన ప్రముఖ హాస్యనటుడు పద్మనాభం. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, నేపధ్య గాయకుడిగా బహుముఖ పాత్రలను పోషించిన పద్మనాభం కడప జిల్లా పులివెందుల తాలూకా సింహాద్రిపురంలో 1931 ఆగస్టు 20న జన్మించారు.
ఫిబ్రవరి 20, 2010 (శనివారం) ఉదయం గుండెపోటుతో ఆయన చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు. అయిదేళ్ల వయసులోనే పద్మనాభం చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి వెండికప్పు బహుమతిగా పొందారు. ‘మాయలోకం’ చిత్రం ద్వారా సినీరంగంలోకి ఆయన ప్రవేశించారు.
పద్మనాభం రేఖా అండ్ మురళి ఆర్ట్స్ పేర చిత్ర నిర్మాణ సంస్థ ప్రారంభించి ‘దేవత’ పొట్టి ప్లీడర్, శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న చిత్రానలు నిర్మించారు. 1968లో శ్రీరామకథ చిత్రాన్ని నిర్మించటమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు.
పద్మనాభం ఇంటర్వ్యూ ….https://kadapa.info/పద్మనాభం/
1922 ఫిబ్రవరి 28 వ తేదీన కడప జిల్లా పులివెందుల తాలూకా పైడిపాలెం గ్రామంలో జన్మించిన రాచమల్లు రామచంద్రా రెడ్డి తెలుగు సాహితీ లోకానికి ” రా.రా” గా ప్రసిద్ధులు.తెలుగు సాహితీ విమర్శలో రా.రా. కు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన ఇంజనీరింగ్ పట్టభద్రులు (మద్రాసు).
వీరి సంపాదకత్వంలో 1959-63 కాలంలో కడప నుండి వెలువడిన ” సవ్యసాచి ” , 1968-69 కాలంలో వెలువడిన ” సంవేదన ” పత్రికలు తెలుగు సాహిత్యంలో ఒక సంచలనం కలిగించాయి.
వీరి ” అనువాద సమస్యలు ” గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. అలసినగుండెలు (కథా సంపుటి), సారస్వతవివేచన, వ్యక్తి స్వాతంత్ర్యం- సమాజశ్రేయస్సు , బాల సాహిత్యం, నాటికలు, అనువాద రచనలను చేశారు. మాస్కో లోని ప్రగతి ప్రచురణాలయంలో అనువాదకులుగా కూడా పని చేశారు.
రా.రా 1988 నవంబరు 24న తుది శ్వాస వదిలారు.
తెలుగు సాహిత్యంలో ఇరవయ్యో శతాబ్దిలో అత్యంత ప్రతిభావంతులైన ఇంకా కొన్ని తరాలు కూడా చెప్పుకోగల గొప్ప రచయితలు ఐదుగురిని లేదా ఆరుగురిని ఎంపిక చేయాలంటే ఎవరు ఈ పరిగణనకు పూనుకున్నా అందులో శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు ఒకరై వుండడం అనివార్యం. పుట్టపర్తివారు మహాకవి. మహాపండితుడు. గొప్ప భక్తుడు. గొప్ప వాగ్గేయకారుడు. జ్ఞాని. ఆధునిక మహాకావ్యంగా పలువురు పండితులు అభివర్ణించే శివతాండవ కావ్యం యొక్క సృష్టికర్త.
పుట్టపర్తి నారాయణాచార్యులు 1914, మార్చి 28, న అనంతపురం జిల్లా అనంతపురం మండలంలోని చియ్యేడు గ్రామంలో జన్మించారు.
ప్రొద్దుటూరు వీరి అత్తగారి ఊరు. మొదట ఆయన పని చేసింది అనంతపురంలో. కొన్నాళ్ళు తిరువాన్కూర్ లోనూ, కొన్నాళ్ళు ఢిల్లీ లోనూ, ప్రొద్దుటూరులోనూ పనిచేసి చివరకు కడపలో స్థిరపడ్డారు. కడపలో శ్రీ రామకృష్ణా ఉన్నత పాఠశాలలో ఆయన ఉపాధ్యాయుడుగా పనిచేశారు. సాహితీ సృష్టి అంతా కడపలోనే జరిగింది. శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాలు ఆయనకు డి.లిట్. ప్రదానం చేశాయి.
ఆయన కడప లోని రామకృష్ణా హైస్కూల్లో టీచర్ గా పని చేసి 1990 సెప్టెంబర్ 1న స్వర్గస్థులయ్యారు.
తొలి తెలుగు వాగ్గేయకారుడు – తాళ్ళపాక అన్నమయ్య “యోగ వైరాగ్య శృంగార సరణి” పేర మొత్తం 32,000 సంకీర్తనలు రచించాడని అతని మనుమడు చిన్నన్న పేర్కొన్నాడు. అతని పుత్రపౌత్రాదులు వీటిని రాగిరేకులమీద వ్రాయించారు. ఆ రేకులను తిరుమలలో సంకీర్తనా భండాగారంలో పొందుపరచారు. అయితే ప్రస్తుతం 12,000 మాత్రమే లభిస్తున్నవి. రేకులమీది అంకెల ప్రకారం కొన్ని రేకులు లభించడంలేదు.
సంకీర్తనా లక్షణమనే సంస్కృత గ్రంధం కూడా అన్నమయ్య వ్రాశాడట. మంజరీ ద్విపదలో “శృంగార మంజరి” అనే కావ్యాన్ని రచించాడు. అతడు రచించాడని చెప్పబడే 12 శతకాలలో “వేంకటేశ్వర శతకము” ఒక్కటి మాత్రమే లభిస్తున్నది. ఇతర ప్రబంధాలు, వేంకటాచల మహాత్మ్యము, సంకీర్తనలక్షణం, ద్విపద రామాయణం వంటి గ్రంధాలు లభించలేదు.
అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మ సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించాడు. దక్షిణాపధంలో భజన సంప్రదాయానికి అన్నమయ్యే ఆద్యుడు.
ఇంత గొప్పవాడైన ఆ భక్తుడు కడప జిల్లాలోని రాజంపేట తాలూకాలో ఉన్న తాళ్ల్లఫాక గ్రామంలో మే 9, 1408లో జన్మించాడు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు ఖడ్గమైన నందకం అంశతో అన్నమయ్య జన్మించాడని శ్రీవైష్ణవసంప్రదాయంలో నమ్మకం ఉన్నది.
రైల్వేకోడూరు సమీపంలోని అనంతరాజుపేటలో ప్రభుత్వ ఉద్యాన కళాశాల మరియు పరిశోధనా కేంద్రం జూన్ 6 2007న ప్రారంభమైంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కళాశాలను ప్రారంభించారు. ఇది రాయలసీమ జిల్లాలలోని ఏకైక ఉద్యానవన కళాశాల (Horticultural College).
డా.వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్నా ఈ కళాశాలలో ఉద్యానవన విద్యకు సంబంధించి పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
2015 జూన్ 7న కడప విమానాశ్రయం ప్రారంభమైంది. బెంగుళూరు నుండి ఆ రోజు (ఆదివారం) ఉదయం 10 గంటల 40 నిముషాలకు బయలుదేరిన ఎయిర్ పెగాసస్ విమానం ( OP 131) 11 గంటల 30 నిముషాలకు కడప విమానాశ్రయానికి చేరుకుంది. సుమారు 60 మంది ప్రయాణికులు ఈ విమానం ద్వారా బెంగుళూరు నుండి కడపకు వచ్చారు.
విమానాశ్రయ టర్మినల్ భవనాన్ని అప్పటి ఆం.ప్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రారంభించారు.
1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.
ఈ ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.
రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు.
ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఎంజె రైతుల కోసం చేసిన ఉద్యమంకు ప్రతీకగా ఆయన భౌతిక కాయంపై ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళలు అర్పించారు.
ఆయన వామపక్ష దృక్పథానికి సూచనగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన భౌతిక కాయంపై ఎరుపు వస్త్రం కప్పి జోహార్లు అర్పించారు. స్మశానవాటిక వద్ద పలువురు నేతలు, వివిధసంఘాల ప్రతినిధులు, ఎంజె సేవలను గుర్తు చేస్తూ కన్నీటితో ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
మైదుకూరులోని సర్వాయపల్లె రోడ్డు నుంచి కడప రోడ్డు ,నాలుగురోడ్ల కూడలి, బద్వేల్ రోడ్డు మీదుగా ఎంజె భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా స్మశాన వాటికకు తరలించారు.
నందలూరు రైల్వేస్టేషన్ దారిలోని అరవపల్లె ముత్తు మారమ్మ ఆలయంలో జాతర మహోత్సవాలు ఈనెల 15 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు అమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాతరకు రాయలసీమ నుంచే కాకుండా తమిళనాడు నుంచి కూడా భక్తులు హాజరవుతారు.
తమిళనాడు ప్రాంతానికి చెందిన అంకయ్య మొదలియార్, వీరస్వామిలు ముత్తుమారమ్మ 150 యేండ్ల క్రితం నిర్మితమైన ఈ ఆలయాభివృద్ధికి కృషిచేశారు. కర్నాటకలోని హుబ్లి నుంచి ముత్తుమారమ్మ మూలవిరాట్ను తీసుకొచ్చి ఇక్కడి ఆలయంలో ప్రతిష్ఠించారు. ఆలయంలో కుడివైపున వినాయకుడు, ఎడమవైపున సుబ్రహ్మణ్యుడు కొలువై ఉన్నారు.