నివేదిక: ‘Report of a Tour in the Cuddapah & North Arcot పూర్తి వివరాలు ...
ఐదు వందల ఏళ్లకు పైగా ఆధ్యాత్మికంగా , రాజకీయంగా సుదీర్ఘమైన చరిత్ర కలిగిన గంజికుంట నేడు పట్టించుకునేవారు కరువై క్రమక్రమంగా చీకటి పుటల్లోకి నెట్టివేయబడుతోంది. విజయనగర సామ్రాజ్య కాలంలో వనిపెంట , మైదుకూరు, దువ్వూరు ప్రాంతాలకు రాజకీయ కేంద్రంగా విలసిల్లిన గంజికుంట సీమ చరిత్రకు శ్రీకృష్ణ దేవరాయల, అచ్యుతదేవరాయల కాలంనాటి శిలాశాసనాలు(16వ శతాబ్దం ) ఆధారాలుగా నిలుస్తున్నాయి. బ్రిటీషువారి రికార్డులకు ఎక్కిన పాలెగాళ్ళు పట్రా విటలపతినాయుడు వెలమ వెంకోజీ నాయుడు , వన్నూరమ్మలు రాజకీయ కార్యకలాపాలకు గంజికుంట […]పూర్తి వివరాలు ...
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన హరికిరణ్ బదిలీపై వెళుతున్న కలెక్టర్ బాబురావు నాయుడు నుంచి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కడప జిల్లా 51 వ కలెక్టరుగా బేస్తవారం పొద్దున 11 గంటలకు కలెక్టరేట్‌లోని ఛాంబరులో ఆయన బాధ్యతలు తీసుకున్నారు. హరికిరణ్ 2009 బ్యాచ్ కు చెందిన ఐఏఎస్ అధికారి. ఇక్కడ పనిచేసిన బాబురావు నాయుడు గిరిజన కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో తిరుపతి కార్పొరేషన్ కమిషనర్‌గా ఉన్న హరికిరణ్ ను ప్రభుత్వం […]పూర్తి వివరాలు ...
‘ఆంధ్ర సుందరకాండ’ – 1 నుండి 68వ సర్గ వరకు . రచన: గుండ్లూరు నారాయణరాయ శర్మ, ప్రచురణ : 2017లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
76 సంవత్సరాల ముళ్లపూడి వెంకట రమణ ‘బుడుగు’ సృష్టికర్తగా తెలుగు పాఠకులందరికీ సుపరిచితులే. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆయన పాత్రికేయునిగా, రచయితగా, నిర్మాతగా బహుముఖ పాత్రలను పోషించారు. ‘నా రాత అతని గీత మా సినిమా తీతకు పునాదులు వేశాయి’ అంటూ బాపుతో కలిసి తన సినీరంగ ప్రవేశం గురించి చెప్పే రమణ ఆరుసార్లు సినీ రచయితగా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను అందుకున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌సి వర కూ చదువుకున్న ఆయన, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, శ్రీ […]పూర్తి వివరాలు ...
నాగులపల్లె మౌర్యకు 100వ ర్యాంకు వేంపల్లె రిషికి 374వ ర్యాంకు కడప : శుక్రవారం ప్రకటించిన 2017 సివిల్స్ ఫలితాల్లో మన కడపోల్లు మెరిశారు. చాపాడు మండలం నాగులపల్లెకు చెందిన నారపురెడ్డి మౌర్య 100వ ర్యాంకు సాధించగా వేంపల్లికి చెందిన రుషికేష్‌రెడ్డి 374వ ర్యాంకును సాధించి సివిల్స్ లో కడప జిల్లా సత్తా చాటినారు. రైతు కుటుంబానికి చెందిన మౌర్య సివిల్ సర్వీసెస్‌లో ఉన్నత కొలువు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు చంద్రఓబుళరెడ్డి, జయశ్రీ […]పూర్తి వివరాలు ...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ” వారసత్వ కట్టడాల దత్త స్వీకారం’ పథకం కింద కడప జిల్లాలోని ప్రఖ్యాత చారిత్రిక కట్టడమైన గండికోటను దాల్మియా సంస్థ దత్తతకు తీసుకుంది. గండికోట తో పాటు దేశ సార్వభౌమాధికారానికి ప్రతీక అయిన దిల్లీ లోని ఎర్రకోట ను కూడా దాల్మియా సంస్థ దత్తత తీసుకుంది. ఈ నిర్ణయం పై పలు రాజకీయ పక్షాలు , చరిత్ర కారులలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈమేరకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దాల్మియా […]పూర్తి వివరాలు ...
సాగునీటి సౌకర్యాల విషయంలో దశాబ్దాల పాలకుల నిర్లక్ష్యం కారణంగా రాయలసీమ రైతుకు వ్యవసాయం గుదిబండగా మారి, ప్రాణ సంకటమై కూర్చుండింది. కాయకష్టం చేసి గుట్టలు చదును చేసి తను సాగు చేసిన మెట్ట, పొట్ట కూడా నింపలేదని బాధపడుతున్న రైతు వ్యధను ‘ఓ రాయలసీమ రైతన్నా …’ అంటూ జానపదులు ఇలా ఆలపిస్తున్నారు. మెట్టలూ, గుట్టలుదీసి – పట్టుబట్టీ దున్నితేను చిట్టెడైన పండవేమిరా ఓ రాయలసీమ రైతన్నా..! పొట్టలైనా నిండవేమిరా ఎండలోస్తే పంటలేదు, కుండనొక్కా గింజ లేదు […]పూర్తి వివరాలు ...
అందమైన దాన,, సందమామ లాంటి దాన నీ అందమంతా సూసి నేను వాలిపోయాను పొద్దుటూరు లోనా పట్టు సీరలంగడి నాది సీరలన్నీ నీవు సింగారించుకోవే ।।అందమైన॥ ఆళ్ళగడ్డ లోన హారాలంగడి నాది హారాలన్ని నీవు రుంగారించుకోవే ॥అందమైన॥ అనంతపురంలోన అద్దాల మాడి నాది అద్దాల మాడిలోన ముద్దాడుకుందాము రావే ॥అందమైన॥ ముద్దనూరి లోన ముద్దాలంగడి నాది ఒక ముద్దయునా తిని పోదువు రావే ॥అందమైన॥పూర్తి వివరాలు ...