వార్తా విభాగం

సంకీర్తనలు

ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనె

॥పల్లవి॥ఏది జూచినఁ దమకు యిన్నియును నిటువలెనెవేదువిడిచిన కూడు వెదకినను లేదు॥చ1॥ఏకాంతసౌఖ్యంబు లెక్కడివి ప్రాణులకుపైకొన్నదుఃఖముల పాలుపడెఁ గాకయేకమగు పుణ్యంబు లేడాఁగల విందరికికైకొన్నదురితములు కలపాటిగాక॥చ2॥హితవైనమమకార మెందుఁగల దిందరికిప్రతిలేని విరహతాపము కొలఁదిగాకమతిలోని వేడుకలు మరియేమి మనుజులకుజితమైన దైవమిచ్చిన పాటిగాక॥చ3॥యిరవైవ దైవకృపయేల దొరుకునుఁ దమకుపరిమైనకర్మంబు పరిపాటిగాకయెరవైనపెనుబంధ మేల వీడెడు నాత్మఁదిరువేంకటేశుకృప తిరమైనఁ గాఁక రాగము: శ్రీరాగం రేకు: 0016-01 సంపుటము: 1-95 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, శ్రీరాగంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చె

॥పల్లవి॥చెదఱక వెలుఁగే చేను మేయఁగఁజొచ్చెఆదలించి తగదు నీ కనువారు వేరీlink॥చ1॥చిత్త మింద్రియములచేఁ జిక్కి , కడు మద-మెత్తిన వద్దన నిఁక వేరీహత్తినమనసు మోహాదులతోఁ గూడితత్తరించిన మాన్పఁదగువారు వేరీ॥చ2॥జీవుఁడిన్నిటికిఁ దాఁ జిక్కి పోయినత్రోవఁబోవఁజొచ్చిన బుద్ధిపొల మేదిశ్రీవేంకటేశుని చింతాపరతఁ గానికావఁగ నాత్మకు గతి దానేది రాగము: బౌళి రేకు: 0031-06 సంపుటము: 1-193 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, బౌళిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తాప లేక మేడ లెక్కఁదలఁచేము

॥పల్లవి॥తాప లేక మేడ లెక్కఁదలఁచేముయేపులేని చిత్తముతో యీహీహీ నేము॥చ1॥ఎఱుకమాలినబుద్ధి యెవ్వరైనాఁ బతులంటాతెఱఁగెఱఁగక వీధిఁ దిరిగేముపఱచైన జవరాలు పరులెల్లా మగలంటావొఱపు నిలిపిన ట్లోహోహో నేము॥చ2॥యిందరును హితులంటా యెందైనా సుఖమంటాపొందలేనిబాధఁ బొరలేముమందమతిఁవాడు యెండమావులు చెరువులంటాఅందునిందుఁ దిరిగిన ట్లాహాహా నేము॥చ3॥మేటివేంకటేశుఁ బాసి మీఁదమీఁద జవులంటానాటకపు తెరువుల నడిచేముగూటిలో దవ్వులవాఁడు కొండలెల్ల నునుపంటాయేటవెట్టి యేఁగిన ట్లీహీహీ నేము రాగము: లలిత రేకు: 0015-06 సంపుటము: 1-94 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, లలితపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తన

॥పల్లవి॥తానే కాకెవ్వరు మాకు దాతయు దైవము తనలోనఁ బెట్టుకొని మాకు లోనైనవాఁడు॥చ1॥చదవించి, కూడవెట్టి, జారకుండ నిల్లుగట్టిబెదురులేని బుద్ది పిన్ననాఁడే చెప్పియెదరి నడిగి, ద్రవ్యమిది గొమ్మనుచు నిచ్చిపదిలమై తమ్ముఁ బాలించువాఁడు॥చ2॥మోహవియోగమ్ము, మొహానురాగమ్ముదేహవిబాగంబు దెలిపిని కలికిఐహికమున వేంకటాధీశుఁడై సర్వదేహరక్షకుఁడై తిరుగుచున్నాఁడు రాగము: సామంతం రేకు: 0031-05 సంపుటము: 1-192 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఈ సురలీ మునులీ చరాచరములు

॥పల్లవి॥ఈ సురలీ మునులీ చరాచరములుయీ సకలమంతయు నిది యెవ్వరు॥చ1॥ఎన్నిక నామము లిటు నీవైయుండఁగయిన్నినామముల వారిది యెవ్వరువున్నచోటనే నీవు వుండుచుండఁగ మరియిన్నిటాఁ దిరుగు వారిది యెవ్వరు॥చ2॥వొక్కరూపై నీవు వుండుచుండఁగ మరితక్కిన యీరూపములు తా మెవ్వరుయిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండమక్కువ నుండువారు మరి యెవ్వరు॥చ3॥శ్రీవేంకటాద్రిపై చెలఁగి నీవుండఁగాదైవంబులనువారు తా మెవ్వరుకావలిసినచోట కలిగి నీ వుండఁగయీవిశ్వపరిపూర్ణు లిది యెవ్వరు రాగము: నాదరామక్రియ రేకు: 0015-05 సంపుటము: 1-93 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

బ్రహ్మ గడిగిన పాదము

॥పల్లవి॥బ్రహ్మ గడిగిన పాదముబ్రహ్మము దానె నీపాదము॥చ1॥చెలఁగి వసుధ గొలిచిన నీపాదముబలి తల మోపిన పాదముతలఁకక గగనము దన్నిన పాదముబలరిపుఁ గాచిన పాదము॥చ2॥కామినిపాపము గడిగిన పాదముపాముతల నిడిన పాదముప్రేమపు శ్రీసతి పిసికెడి పాదముపామిడి తురగపుఁ పాదము॥చ3॥పరమయోగులకుఁ బరిపరి విధములపరమొసఁగెడి నీపాదముతిరువేంకటగిరి తిరమని చూపిన-పరమపదము నీపాదము రాగము: ముఖారి రేకు: 0031-04 సంపుటము: 1-191 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఇటు గరుడని నీవెక్కినను

॥పల్లవి॥ఇటు గరుడని నీవెక్కిననుపటపట దిక్కులు బగ్గనఁ బగిలె॥చ1॥ఎగసిన గరుడని యేపున ’ధా’ యనిజిగిదొలఁక చబుకు చేసిననునిగమాంతంబులు నిగమ సంఘములుగగనము జగములు గడగడ వడఁకె॥చ2॥బిరుసుగ గరుడని పేరెము దోలుచుబెరసి నీవు కోపించిననుసరుస నఖిలములు జర్జరితములైతిరుపున నలుగడ దిరదిరఁ దిరిగె॥చ3॥పల్లించిన నీ పసిఁడి గరుడనినికెల్లున నీ వెక్కినయపుడుఝల్లనె రాక్షస సమితి నీ మహిమవెల్లి మునుఁగుదురు వేంకటరమణా రాగము: నాట రేకు: 0015-04 సంపుటము: 1-92 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాటపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎట్టు దరించీ నిదె యీజీవుఁడు

॥పల్లవి॥ఎట్టు దరించీ నిదె యీజీవుఁడుబట్టబయలుగాఁ బరచీ నొకటిread॥చ1॥చెడనిమట్టిలోఁ జేసినముద్దేనడుమ ముంచుకొన్నది వొకటితడియనినీరై తడివొడమింపుచువడిసీని వేపుర వడితో నొకటి॥చ2॥పాయనితనుదీపనములుగా నటుచేయుచు మది వేఁచీ నొకటికాయపుచుట్టరికమ్ములు చేయుచురేయుఁబగలు విహరించీ నొకటి॥చ3॥యిన్నియుఁదానే యేచి కపటములుపన్నీ నిదె లోపల నొకటివెన్నెలచూపుల వేంకటేశ నినుయెన్నికతోఁ గడు నెదిరీ నొకటి రాగము: ముఖారి రేకు: 0031-03 సంపుటము: 1-190 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ముఖారిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

నాఁటికి నాఁడే నా చదువు

॥పల్లవి॥నాఁటికి నాఁడే నా చదువుమాటలాడుచును మఱచేటి చదువు॥చ1॥ఎనయ నీతని నెఱుఁగుటకే పోవెనకవారు చదివినచదువుమనసున నీతని మఱచుటకే పోపనివడి యిప్పటిప్రౌఢలచదువు॥చ2॥తెలిసి యితనినే తెలియుటకే పోతొలుతఁ గృతయుగాదులచదువుకలిగినయీతనిఁ గాదననే పోకలియుగంబులోఁ గలిగినచదువు॥చ3॥పరమని వేంకటపతిఁ గనుటకే పోదొరలగు బ్రహ్మాదులచదువుసిరుల నితని మఱచెడికొరకే పోవిరసపుజీవులవిద్యలచదువు రాగము: సామంతం రేకు: 0015-03 సంపుటము: 1-91 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, సామంతంపూర్తి వివరాలు ...

error: