వార్తా విభాగం

సంకీర్తనలు

చాలదా హరిసంకీర్తనంగల- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చాలదా హరిసంకీర్తనంగల-మే లిది దీననే మెరసిరి ఘనులు॥చ1॥తలఁప వేదాశాస్త్రములు గానకఅలరుచు వాల్మీకాదులుతలకొని హరిమంత్రమే దగఁ బేర్కొనిఅలవిమీరఁ గడు నధికములైరి॥చ2॥యితరదైవముల నెఱఁగనేరకప్రతిలేనిమహిమఁ బార్వతిమతిఁ దలఁపుచు హరిమంత్రమె పేర్కొనిసతతము హరులో సగమై నిలిచె॥చ3॥చదువులుఁ బలుమరుఁ జదువనోపకఅదివో నారదాదులుపదిలపువేంకటపతిహరినామమేవదల కిదియ జీవనమై మనిరి రాగము: సామంతం రేకు: 0033-04 సంపుటము: 1-205 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎంతమానుమన్నఁ జింతలేల మానునే – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎంతమానుమన్నఁ జింతలేల మానునేపంతపుమనసు హరిపై నుంటేఁగాకread॥చ1॥తీరని బంధాలు నేఁడే తెగుమంటే నేల తెగుభారపుమమతఁ బెడఁబాసినఁగాకవూరటగా మమత నేనొల్లనంటే నేల మానువోరువుతో లంపటము లొల్లకుంటేఁగాక॥చ2॥వేఁకపుఁగోపము నేఁడే విడుమంటే నేల విడుతోఁకచిచ్చయినయాసఁ దుంచినఁగాకఆఁకట నానేల మాను అన్నిటాను యిందరికిమాఁకుపడి తత్తరము మఱచుంటేఁగాక॥చ3॥పెట్టనిది దైవ మిట్టే పెట్టుమంటే నేల పెట్టుయిట్టే వేంకటపతి యిచ్చినఁగాకయిట్టునట్టు నీతఁడు దా నిందరికి నేల యిచ్చువొట్టినవిరక్తి నేమి నొల్లకుంటేఁగాక రాగము: ముఖారి రేకు: 0033-03 సంపుటము: 1-204 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

పసలేని యీబ్రదుకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥పసలేని యీబ్రదుకుఅసలు చొచ్చి చొచ్చి అలసినట్టాయెread॥చ1॥తొల్లిటిజన్మాదులఁ గానినరరూపుపల్లించుకొన్న యీబ్రదుకుకల్లసుఖములచే కనలి కమ్మరముల్లుదీసి కొఱ్ఱు మొత్తినట్టాయ॥చ2॥బూటకములనెల్లఁ బొరలి సంసారంపు-పాటు దెచ్చినయీబ్రదుకునీటుగ నెద్దు దన్నీనని గుఱ్ఱము –చాటు కేఁగినయట్టిచందమాయె॥చ3॥పగగొన్న పొగ కోపక మంటఁ బడిపడిపగలు రేలైనయీబ్రదుకుతగువేంకటేశ్వరుఁ దలఁచి నేల నుండియెగసి మేడమీఁది కేఁగినట్లాయె రాగము: ముఖారి రేకు: 0033-02 సంపుటము: 1-203 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వెన్నవట్టుక నేయి వెదకనేలా మరియునెన్ని వలసిన దమయేలిటివే కావా॥చ1॥తలఁపునకు విష్ణుచింతన నిమిషమాత్రంబుకలుగుటే కలుగువలెఁగాకవలనైన భోగములు వైభవంబులు మరియుకలవెల్ల తమయెదుటఁ గలిగినవె కావా॥చ2॥పదిలముగ హరినామపఠన మంత్రము నోరుకదియుటే కలుగవలెఁగాకతుదలేని సంపదలు తొలగని ముదంబులునుకదలకెప్పుడుఁ దమకు గలిగినవె కావా॥చ3॥యించుకైనను వేంకటేశు గిరిశిఖరంబుకాంచుటే కలుగవలెఁగాకఅంచితంబైన నిత్యానంద పదవులనుమించి తమయెదుటఁ బ్రభనించినవె కావా రాగము: శ్రీరాగం రేకు: 0033-01 సంపుటము: 1-202 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఎందరివెంట నెట్లఁ దిరుగవచ్చు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥ఎందరివెంట నెట్లఁ దిరుగవచ్చుకందువెఱిఁగి చీఁకటిదవ్వుకొనుఁగాక॥చ1॥తల రాయిగాఁగ నెందరికి మొక్కెడినితెలివిమాలినయట్టిదేహికొలఁదిమీరినదేవకోట్లు దనలోనకలవాని నొక్కనినే కొలుచుఁగాక॥చ2॥కాలీచపడఁగ నెక్కడికి నేఁగెడినిపాలుమాలినయట్టిప్రాణిమేలిమిజగములు మేనిలోఁ గలవాఁడుపాలిటివాఁడై ప్రణుతికెక్కుఁగాక॥చ3॥నూరేండ్ల నెందరి నుతియింపఁ గలవాఁడుచేరఁదావులేనిజీవిశ్రీరమణీశుఁడు శ్రీవేంకటేశునికోరికెఁ దలఁచి నుతి కొల్ల గొనుటగాక రాగము: దేవగాంధారి రేకు: 0032-07 సంపుటము: 1-201 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలము

॥పల్లవి॥సామాన్యమా పూర్వ సంగ్రహంబగు ఫలమునేమమునఁ బెనగొనియె నేఁడు నీవనక॥చ1॥జగతిఁ బ్రాణులకెల్ల సంసారబంధంబుతగుల బంధించు దురితంపుఁ గర్మమునమగుడ మారుకుమారు మగువ నీవురముపైతెగికట్టి రెవ్వరో దేవుండవనక॥చ2॥పనిలేక జీవులను భవసాగరంబులోమునుఁగ లేవఁగఁ జేయు మోహదోషమునపనిపూని జలధిలోఁబండఁబెట్టిరి నిన్నువెనకెవ్వరో మొదలివేలుపనక॥చ3॥వుండనియ్యక జీవనోపాయమున మమ్ముకొండలను గొబల తతిగొని తిప్పుఫలముకొండలను నెలకొన్న కోనేటిపతివనఁగనుండవలసెను నీకు నోపలేననక రాగము: ధన్నాశి రేకు: 0032-06 సంపుటము: 1-200 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాశిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సడిబెట్టెఁగటకటా సంసారము చూడ-

॥పల్లవి॥సడిబెట్టెఁగటకటా సంసారము చూడ-జడధి లోపలి యీఁత సంసారము॥చ1॥జమునోరిలో బ్రదుకు సంసారము చూడచమురు దీసిన దివ్వె సంసారముసమయించుఁ బెనుదెవులు సంసారము చూడసమరంబులో నునికి సంసారము॥చ2॥సందిగట్టినతాడు సంసారము చూడసందికంతలతోవ సంసారముచుందురునిజీవనము సంసారము చూడచంద మేవలెనుండు సంసారము॥చ3॥చలువలోపలివేఁడి సంసారము చూడజలపూఁతబంగారు సంసారముయిలలోనఁ దిరువేంకటేశ నీదాసులకుచలువలకుఁ గడుఁజలువ సంసారము రాగము: భైరవి రేకు: 0032-05 సంపుటము: 1-199 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, భైరవిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగ

॥పల్లవి॥ఏదైవము శ్రీపాదన్నఖమునఁ బుట్టినగంగత్రిలోకపావనము చేయను త్రిపథగామిని ఆయను॥చ1॥యేదైవమువురస్థలంబు దనకును మందిరమైన యిందిరమాతయయ్యే యీజగంబుల కెల్లనుయేదైవము‌ అవలోకన మింద్రాదిది విజగణంబులకెల్లప్పుడును సుఖంబు లాపాదించును॥చ2॥యేదైవము దేహవస్తువని అనిమిషులందరుఁ గూడిశ్రీనారాయణ దేవుండని నమ్మి యుండుదురుఆదేవుఁడే సిరుల కనంతవరదుఁడు తిరువేంకట-గిరినాథుఁడుభయ విభూతినాథుఁడే నానాథుఁడు రాగము: గీతం – నాట రేకు: 0016-06 సంపుటము: 1-100 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలుపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలు

॥పల్లవి॥తనకేడ చదువులు తనకేడ శాస్త్రాలుమనసు చంచలబుద్ధి మానీనా॥చ1॥జడ్డుమానవుఁడు చదువఁజదువ నాసవడ్డివారుఁగాక వదలీనాగుడ్డికుక్క సంతకుఁబోయి తిరిగినదుడ్డుపెట్లే కాక దొరకీనా॥చ2॥దేవదూషకుఁడై తిరిగేటివానికిదేవతాంతరము తెలిసీనాశ్రీవేంకటేశ్వరుసేవాపరుఁడుగాకపావనమతియై పరగీనా రాగము: నాట రేకు: 0032-04 సంపుటము: 1-198 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, నాటపూర్తి వివరాలు ...

error: