వార్తా విభాగం

సంకీర్తనలు

నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదునీవనుచుఁ గనుఁగొన్న నిజమెల్ల నీవే॥చ1॥తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల –ననయంబుఁ గనుఁగొన్నయతఁడే నీవుతనుఁగన్న తల్లిఁగా తగనితరకాంతలనుఆనఘఁడై మదిఁజూచునతఁడే నీవు॥చ2॥సతతసత్యవ్రతాచారసంపన్నుఁడైఆతిశయంబుగ మెలఁగునతఁడే నీవుధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు-హతకాముకుఁడైనయతఁడే నీవు॥చ3॥మోదమున సుఖదు:నాదరింపుచునున్న యతఁడే నీవువేదోక్తమతియైన వేంకటాచలనాథఆదియును నంత్యంబు నంతయును నీవే రాగము: సామంతం రేకు: 0038-02 సంపుటము: 1-232 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

వేసరితిఁమెట్ల నీవెంటఁ దిరిగి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥వేసరితిఁమెట్ల నీవెంటఁ దిరిగిగాసిఁబెట్టక మమ్ముఁ గావరాదా॥చ1॥తీసితివి కోరికల తెగనీక పంచలకుతోసితివి యింటింటఁ దోయఁదోయచేసితివి నీచేఁత చెల్లె నిఁకనైననుఆస నీపొందొల్ల మంపరాదా॥చ2॥కట్టితివి కర్మముల కడదాఁక నాపదలఁబెట్టితివి దు: ఖములఁ బెనచిపెనచిపట్టితివి చలము మము పాయనని యాస నీ-విట్టైన గొంతసుఖ మియ్యరాదా॥చ3॥కఱపితివి పాపములే కడఁగి నానావిధులనెఱపితివి దుర్దశలే నేర్పుమెరసితెఱఁ గొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని-నెఱిఁగియును నెఱఁగలే మింక నేతెరువో రాగము: దేసాక్షి రేకు: 0038-01 సంపుటము: 1-231 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

చెప్పుడుమాటలే చెప్పకొనుటగాక – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥చెప్పుడుమాటలే చెప్పకొనుటగాకచెప్పినట్లఁ దాము నేయ రెవ్వరును॥చ1॥దొడ్డయినశరీరదోషమైనయట్టిజడ్డు దొలఁగవేయఁజాల రెవ్వరునుగడ్డబడి యీఁతకాండ్లౌటగానివొడ్డునడుమ నీఁద నోపరెవ్వరును॥చ2॥శ్రీవేంకటేశుపైఁ జిత్త మర్పణ నేసియీవిధు లన్నియు నెడయ రెవ్వరునుచావుఁ బుట్టగులేని జన్మముగలసర్వ.-దేవతామూర్తులై తిరుగ రెవ్వరును రాగము: దేవగాంధారి రేకు: 0037-04 సంపుటము: 1-230 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారిపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁ డెవ్వఁడు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥తనవారలు పెరవారలుఁ దానని యెడివాఁ డెవ్వఁడుతనుగుణముల దిగవిడిచినధన్యుం డాతఁడెపో॥చ1॥తెగఁబడి మదనసముద్రము దేహముతోడనె దాఁటినవిగతభయుం డతఁ డెవ్వఁడు వీరుం డెవ్వఁడొకోపగగొని పంచేంద్రియముల ప్రాణముతోడనె బతికిజగదేకప్రీతుండగుచతురుం డాతఁడెపో॥చ2॥యేచినపరితాపాగ్నుల నేమియు నొవ్వక వెడలినధీచతురుం డతఁడెవ్వఁడు ధీరుం డెవ్వఁడొకోచూచిన మోహపుఁజూపులఁ జురుచూండ్ల కెడమియ్యనిరాచఱికపు నెరజాణఁడు రసికుం డాతఁడెపో॥చ3॥చావుకు సరియగు ద్రవ్యవిచారపు తుగులులఁ బాసినపావనుఁ డెవ్వఁడు బహుజనబాంధవుఁ డెవ్వఁడొకోశ్రీవేంకటగిరినాథుని చిత్తములోపల నిలిపిన –దేవసమానుఁడు నాతఁడె ధీరుఁడు నాతఁడెపో రాగము: ఆహిరి రేకు: 0037-03 సంపుటము: 1-229 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

సిరి దొలంకెడి పగలు చీఁక టా యితఁడేమి – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥సిరి దొలంకెడి పగలు చీఁక టా యితఁడేమియిరవు దెలిసియుఁ దెలియనియ్యఁడటుగాన॥చ1॥తలపోయ హరినీలదర్పణంబో ఇతఁడువెలుఁగుచున్నాడు బహువిభవములతోడకలగుణం బటువలెనె కాఁబోలు లోకంబుగలదెల్ల వెలిలోనఁ గనిపించుఁ గాన॥చ2॥మేరమీరిననీలమేఘమో యితఁడేమిభూరిసంపదలతోఁ బొలయుచున్నాడుకారుణ్యనిధియట్ల కాఁబోలు ప్రాణులకుకోరికలు దలఁపులోఁ గురియు నటుగాన॥చ3॥తనివోనిఆకాశతత్వమో యితఁడేమిఅనఘుఁడీ తిరువేంకటాద్రి వల్లభుఁడుఘనమూర్తి అటువలెనె కాఁబోలు సకలంబుతనయందె యణఁగి యుద్భవమందుఁగాన రాగము: ముఖారి రేకు: 0037-02 సంపుటము: 1-228 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగము – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అదె చూడు తిరువేంకటాద్రి నాలుగు యుగములందు వెలుగొందీ ప్రభ మీరఁగాను॥చ1॥తగ నూటయిరువై యెనిమిది తిరుపతుల గలస్థానికులును చక్రవర్తి పీఠకములునుఅగణితంబైన దేశాంత్రుల మఠంబులునునధికమై చెలువొందఁగాను॥చ2॥మిగుల నున్నతములగు మేడలును మాడుగులుమితిలేని దివ్య తపసులున్న గృహములునువొగి నొరగుఁ బెరుమాళ్ళ వునికి పట్టయివెలయుదిగువ తిరుపతి గడవఁగాను॥చ3॥పొదలి యరయోజనము పొడవుననుఁ బొలుపొందిపదినొండు యోజనంబుల పరపుననుఁ బరగిచెదరకే వంక చూచిన మహాభూజములుసింహశార్దూలములును॥చ4॥కదిసి సురవరలు కిన్నరులు కింపురుషులును…..గరుడ గంధర్వ యక్షులును విద్యాధరులువిదితమై విహరించు విశ్రాంతదేశములవేడుకలు దైవారగాను॥చ5॥యెక్కువల కెక్కువై యెసఁగి వెలసిన పెద్ద-యెక్కు డతిశయముగా నెక్కి నంతటిమీఁదఅక్కజంబైన పల్లవరాయని […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకు – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥కడలుడిపి నీరాడఁగాఁ దలఁచువారలకుకడలేని మనసునకుఁ గడమ యెక్కడిది॥చ1॥దాహమణఁగినవెనుక తత్వమెరిఁగెదనన్నదాహమేలణఁగు తా తత్వ మే మెరుఁగుదేహంబుగలయన్ని దినములకుఁ బదార్ఢ-మోహమేలుడుగు దా ముదమేల కలుగు॥చ2॥ముంద రెరిఁగిన వెనుక మొదలు మరచెదనన్నముంద రేమెరుఁగుఁ దా మొదలేల మరచుఅందముగఁ దిరువేంకటాద్రీశు మన్ననలకఁదువెరిఁగినమేలు కలనైన లేదు రాగము: శుద్దవసంతం రేకు: 0036-07 సంపుటము: 1-226 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శుద్దవసంతంపూర్తి వివరాలు ...

సంకీర్తనలు

ఏది కడ దీని కేది మొదలు | వట్టి … – అన్నమయ్య

॥పల్లవి॥ఏది కడ దీని కేది మొదలు | వట్టి …వేదనలు తన్ను విడుచు టెన్నఁడు॥చ1॥తొడరినహృదయమే తోడిదొంగయైవడిగొని తన్ను వలఁబెట్టఁగానుకడఁగి కర్మములఁ గడచు టెన్నడునిడినిబంధముల నీఁగు టెన్నఁడు॥చ2॥తతిగొన్న తలఁపులే దైవయోగమైమతినుండి తన్ను మరిగించఁగానుప్రతిలేని యాపదఁ బాయు టెన్నఁడుధృతిమాలిన యాస దీరు టెన్నఁడు॥చ3॥పొదలిన మమతయే భూతమై తన్నుఁబొదిగొని బుద్ధి బోధించఁగానుకదిసి వేంకటపతిఁ గనుట యెన్నఁడుతుదలేనిభవములఁ దొలఁగు టెన్నఁడు రాగము: కన్నడగౌళ రేకు: 0036-06 సంపుటము: 1-225 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, […]పూర్తి వివరాలు ...

సంకీర్తనలు

అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥అన్నలంటాఁ దమ్ములంటా ఆండ్లంటా బిడ్డలంటావన్నెల నప్పులుగొన్నవారువో వీరుread॥చ1॥తెగనీక అప్పులెల్లాఁ దీసితీసి | వారుతగిలినఁ బెట్టలేక దాఁగి దాఁగివెగటునఁ బారిపోఁగా వెంట వెంట | పెక్కుపగల నప్పులుగొన్న వారువో వీరు॥చ2॥సేయరానిపనులెల్లఁ జేసిచేసి | తవ-రాయడికి లోలోనే రాసిరాసికాయములోచొచ్చిచొచ్చి కాఁచికాఁచి | మున్నువ్రాయనిపత్రాల కాఁగేవారువో వీరు॥చ3॥దొరయై యప్పులవారిఁ దోసితోసి | యీ-పరిభవములనెల్లఁ బాసిపాసిసిరులవేంకటపతిఁ జేరిచేరి | యిట్టి …వరుసనే గెలిచినవారువో వీరు రాగము: వరాళి రేకు: 0036-05 సంపుటము: 1-224 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, [&పూర్తి వివరాలు ...

error: