॥పల్లవి॥కటకటా యిటుచేసెఁ గర్మబాధయెటువంటివారికిని నెడయ దీబాధ॥చ1॥దినదినముఁ బ్రాణులకు దీపనముచే బాధతనుపోషణములు కందర్పబాధమనసుశాంతికి సదా మమకారములబాధతనివోనికోర్కులకు దైవగతిబాధ॥చ2॥వెడయాసచూపులకు వేడుకలచే బాధకడువేడ్కలకు వియోగములబాధతొడవైనయెఱుకలకు దురితబుద్దులబాధజడియుఁబరచింతలకు సంసారబాధ॥చ3॥ఆరిది నిశ్చయమతికి ననుమానములబాధసరిలేని జీవులకు జన్మబాధతిరువేంకటాచలాధిపునిఁ గని మని కొలుచు-వెరవుచేతనె కాని వీడ దీబాధ రాగము: సామంతం రేకు: 0039-03 సంపుటము: 1-239 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥పాయపుమదముల బంధమా మముజీయని యిఁకఁ గృపసేయఁగదో॥చ1॥ధనధాన్యములై తనులంపటమైపనిగొంటివి నను బంధమాదినదినంబు ననుతీదీపులఁ బెను-గనివైతివి యిఁక గావఁగదో॥చ2॥సతులై సుతులై చలమై కులమైపతివైతివి వోబంధమారతిఁ బెరరేఁపుల రంతులయేఁపులగతిమాలితి విఁక గావఁగదో॥చ3॥పంటై పాఁడై బలుసంపదలైబంటుగ నేలితి బంధమాకంటి మిదివో వేంకటగిరిపై మా-వెంటరాక తెగి విడువఁగదో రాగము: సామంతం రేకు: 0039-02 సంపుటము: 1-238 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కొనరో కొనరో మీరు కూరిమిమందువునికిమనికి కెల్ల నొక్కటే మందు॥చ1॥ధ్రువుఁడు గొనినమందు తొల్లియుఁ బ్రహ్లాదుఁడుచవిగాఁ గొనినమందు చల్లనిమందుభవరోగములు వీడిపారఁగఁ బెద్దలు మున్నుజవకట్టికొనిన నిచ్చలమైనమందు॥చ2॥నిలచి నారదుఁడు గొనినమందు జనకుఁడుగెలుపుతోఁ గొని బ్రదికిన యామందుమొలచి నాలుగుయుగములరాజులు ఘనులుకలకాలముగొని కడగన్నమందు॥చ3॥అజునకుఁ బరమాయువై యొసగినమందునిజమై లోకములెల్ల నిండినమందుత్రిజగములు నెఱఁగ తిరువేంకటాద్రిపైద్వజమెత్తెఁ గోనేటిదరినున్నమందు రాగము: శంకరాభరణం రేకు: 0039-01 సంపుటము: 1-237 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఏమిఫలము దా నిన్నియునుఁ దెలిసిననుసామునేసిన ఫలము జయశీలుఁడౌట గాక॥చ1॥తానుగలిగిన ఫలము దయ సేయఁగలుగుటమేనుగలిగిన ఫలము మేలెల్ల గనుటమానుషముగల ఫలము మంచివాఁడౌట తనుఁదానె తెలిసినఫలము తత్వపరుఁడౌట గాక॥చ2॥పదిలమగు కులము గల ఫలము తాఁజదువుటచదివినఫలం బర్థసారంబు గనుటపొదలి శాస్త్రర్థంబు పొడగన్న ఫలము మతిదలఁకకిటు వేంకటేశుదాఁడౌట గాక రాగము: దేవగాంధారి రేకు: 0038-06 సంపుటము: 1-236 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేవగాంధారిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వెఱతు వెఱతు నిండువేడుకపడ నిట్టి-కుఱుచబుద్దుల నెట్టు గూడుదునయ్య॥చ1॥దేహమిచ్చినవానిఁ దివిరి చంపెడువాఁడుద్రోహిగాక నేఁడు దొరయటఆహికముగ నిట్టి అధమవ్రిత్తికి నేసాహమున నెట్టు చాలుదునయ్య॥చ2॥తోడఁబుట్టినవాని తొడరి చంపెడువాఁడుచూడ దుష్టుఁడుగాక సుకృతియటపాడైనయిటువంటిపాపబుద్దులుసేసినీడ నిలువ నెట్టు నేరుతునయ్య॥చ3॥కొడుకు నున్నతమతిఁ గోరి చంపెడువాఁడుకడుఁబాతకుఁడుగాక ఘనుఁడటకడలేనియటువంటికలుషవ్రిత్తికి నాత్మవొడఁబరపఁగ నెట్లోపుదునయ్య॥చ4॥తల్లిఁ జంపెడువాఁడు తలఁప దుష్టుఁడుగాకయెల్లవారల కెల్ల నెక్కుడటకల్లరియనుచు లోకము రోయుపని యిదిచెల్లఁబోనే నేనేమి సేయుదునయ్య॥చ5॥యింటివేలుపు వేంకటేశ్వరుఁ దనవెంట-వెంటఁదిప్పెడువాఁడు విభుఁడటదంటనై యాతనిదాసానుదాసినైవొంటినుండెద నేమి నొల్లనోయయ్య రాగము: శ్రీరాగం రేకు: 0038-05 సంపుటము: 1-235 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, […]పూర్తి వివరాలు ...
॥పల్లవి॥కూడులేక యాఁటికిఁ గూరఁ దిన్నట్లుఆడనీడ మోవిచిగురాకు దినేరయ్య॥చ1॥దుండగపుఁ బగవారు దోఁచఁగానే తమకానకొండలెక్కినట్లు సిగ్గు గొల్లఁబోఁగానుదండువెళ్లేమదనునిదాడికి సతులచన్ను-గొండలెక్కి సారెసారె గోడనేరయ్య॥చ2॥పొదిగొన్న యలపుతోఁ బొదలుతీగెలక్రిందతుదలేనిభయముతోఁ దూరినట్లుమృదువైనతరుణుల మెఱఁగుబాహులతల.-పొదలెల్లఁ దూరితూరి పుంగుడయ్యేరయ్య॥చ3॥వలసగంపలమోపువలె లంపటము మోఁచితలఁకుచుఁ బారలేక దాఁగినయట్లుయిల వేంకటేశ నిన్నెఱఁగ కింద్రియములతలవరులిండ్లనే దాఁగేరయ్య రాగము: ఆహిరి రేకు: 0038-04 సంపుటము: 1-234 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic పూర్తి వివరాలు ...
॥పల్లవి॥ఎవ్వరికైనను యీవ్రాఁత ననునవ్వులు సేసెఁబో నావ్రాఁత॥చ1॥తొలిజన్మంబున దోషకారియైనలుగడఁ దిప్పెను నావ్రాఁతయిల దుర్గణముల కీజన్మంబున –నలఁకువ నేనెఁబో నావ్రాఁత॥చ2॥పురుషునిఁజే శల్పుని ననిపించుటనరజన్మమునకు నావ్రాఁతతరుచయ్యినపాతక మరుపెట్టుకనరకము చూపెఁబో నావ్రాఁత॥చ3॥పామఱితనమున బహువేదనలనునామన సెనసెఁబో నావ్రాఁతకామితఫలు వేంకటపతినిఁ గొలిచినామతి దెలిపెఁబో నావ్రాఁత రాగము: ముఖారి రేకు: 0038-03 సంపుటము: 1-233 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారిపూర్తి వివరాలు ...
॥పల్లవి॥నీవనఁగ నొకచోట నిలిచివుండుటలేదునీవనుచుఁ గనుఁగొన్న నిజమెల్ల నీవే॥చ1॥తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల –ననయంబుఁ గనుఁగొన్నయతఁడే నీవుతనుఁగన్న తల్లిఁగా తగనితరకాంతలనుఆనఘఁడై మదిఁజూచునతఁడే నీవు॥చ2॥సతతసత్యవ్రతాచారసంపన్నుఁడైఆతిశయంబుగ మెలఁగునతఁడే నీవుధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు-హతకాముకుఁడైనయతఁడే నీవు॥చ3॥మోదమున సుఖదు:నాదరింపుచునున్న యతఁడే నీవువేదోక్తమతియైన వేంకటాచలనాథఆదియును నంత్యంబు నంతయును నీవే రాగము: సామంతం రేకు: 0038-02 సంపుటము: 1-232 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతంపూర్తి వివరాలు ...
॥పల్లవి॥వేసరితిఁమెట్ల నీవెంటఁ దిరిగిగాసిఁబెట్టక మమ్ముఁ గావరాదా॥చ1॥తీసితివి కోరికల తెగనీక పంచలకుతోసితివి యింటింటఁ దోయఁదోయచేసితివి నీచేఁత చెల్లె నిఁకనైననుఆస నీపొందొల్ల మంపరాదా॥చ2॥కట్టితివి కర్మముల కడదాఁక నాపదలఁబెట్టితివి దు: ఖములఁ బెనచిపెనచిపట్టితివి చలము మము పాయనని యాస నీ-విట్టైన గొంతసుఖ మియ్యరాదా॥చ3॥కఱపితివి పాపములే కడఁగి నానావిధులనెఱపితివి దుర్దశలే నేర్పుమెరసితెఱఁ గొసంగియును శ్రీతిరువేంకటేశ్వరుని-నెఱిఁగియును నెఱఁగలే మింక నేతెరువో రాగము: దేసాక్షి రేకు: 0038-01 సంపుటము: 1-231 Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, […]పూర్తి వివరాలు ...