తుంట వింటి వాని తూపుల ఘాతకు మింటి మంటి నడుమ మిడుక తరమె? ఇంటి యాలి విడిచి యెట్లుండవచ్చురా విశ్వదాభిరామ వినురవేమ కుటుంబ వ్యవస్థ లోపల గాని, బయటగాని విరహం విరహమే. ఈ భూమ్యాకాశాల మధ్య విరహమంతటి దుస్తర బాధ లేదని అంటున్నాడు వేమన. వేమన జీవితంలోని పరిణామాన్ని ఈ పద్యం సూచిస్తుందేమో తెలియదు. గతంలో భర్తతో సయోధ్య లేని భార్య గురించి అనేక పద్యాలు చెప్పాడు. వేశ్యా జీవితాలనుపూర్తి వివరాలు ...
1929 (౧౯౧౯౨౯) మే 17 వ తారీఖున గాంధీజీ కడప జిల్లాలో ప్రవేశించి కొండాపురం, మంగపట్నం, మారెడ్డిపల్లి, ముద్దనూరు, చిలమకూరు, నిడుజువ్వి, ఎర్రగుంట్ల గ్రామాల మీదుగా రాత్రి 11 గంటలకు ప్రొద్దుటూరుకు చేరినారు. మహాత్మా గాంధి అమ్మవారిశాలను సందర్శించి శ్రీ వాసవీ మాతను సేవించారు. ఈ అన్ని చోట్లా గాంధీజీని అత్యంత ఉత్సాహముతో ఆదరించి సన్మానించారు. ముద్దనూరులో… గాంధీజీ రాత్రి 9 గంటలకు ముద్దనూరు చేరినారు. ముద్దనూరులో గాంధీజీ దర్శనార్థం , అక్కడకు 12 మైళ్ళ దూరములో ఉన్న జమ్మలమడుగు […]పూర్తి వివరాలు ...
రాయించినది: కుల్కరిణీ శంకరప్ప నల్లమల పర్వతమందు ఉన్న అహోబిల నారసింహ క్షేత్రానికి దక్షిణ భాగమున యోజన ద్వయ స్థలమున పూర్వము వాల్మీకి తపస్సు చేస్తూ ఉండేవాడు. అందువలన ఈ స్థలమును వాల్మీకి పురం అని ప్రజలు చెప్పుకుంటున్నారు… ఇటు తరువాత చోళ మహారాజు రాజ్యం చేసేటప్పుడు (కలియుగమందు కొంత కాలం జరిగిన తరువాత) నర్ర గొల్లలు అనే వాళ్ళు ఈ స్థలములో నర్రవుల మందలు ఆపు చేసుకుని ఉండేవారు. అప్పుడు వాళ్ళు ఉండేటందుకు () గాను కొట్టాలు […]పూర్తి వివరాలు ...
తనకు ప్రాప్తిలేక దాతలివ్వరటంచు దోషబుద్ధి చేత దూరుటెల్ల ముక్క వంకజూచి ముకురంబు దూరుట విశ్వదాభిరామ వినురవేమ దాత తనకు ద్రవ్య సహాయం చెయ్యటం లేదనే ఆక్రోశంతో అతన్ని నిందించటం అవివేకం. నిజానికి తనకా అదృష్టం ఉందా లేదా అని ఆలోచించాలి. ఇలా ఆలోచించకపోవడం ఎట్లా ఉంటుందంటే, తన ముక్కు వంకరగా ఉందని మర్చిపోయి, అద్దమే దానిని వంకర చేసి చూపించిందని తూలనాడినట్టు, అంటున్నాడు వేమన.పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో జగన్‌గ్రూపును దెబ్బతీసేందుకు మంత్రుల బృందం ఎత్తులకు పైఎత్తులు వేస్తోంది. ముఖ్యంగా జిల్లాలో కాంగ్రెస్ పార్టీ పట్టుకోసం ప్రాకులాడుతున్నారు. తెలుగుదేశం పార్టీతో మ్యాచ్ ఫిక్స్‌ంగుకు సిద్దపడుతున్నారు. జిల్లాలో రెండు రోజుల నుంచి నలుగురు మంత్రులు కన్నాలక్ష్మినారాయణ, డిఎల్ రవీంద్రారెడ్డి, అహ్మదుల్లా, వివేకానందరెడ్డి తిష్టవేశారు. సాధ్యమైనంత మేరకు జగన్ గ్రూపుపై పట్టు సాధించేందుకు ప్రతిపక్షాలతో సైతం దోస్తీకి కాంగ్రెస్ సిద్దపడుతోంది.పూర్తి వివరాలు ...
కడప : రాయలసీమలో పేరొందిన అనంతపురం గంగజాతర శని, ఆదివారాల్లో జరగనుంది. జాతరకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. చాగలగట్టుపల్లె నుంచి ఉత్సవ విగ్రహం శనివారం ఉదయానికి జాతర ఆవరణం చేరుకోనుంది. భక్తుల చెక్క భజనలు, కోలాటాలతో అమ్మవారు, గొల్లపల్లె నుంచి మరో గంగమ్మ విగ్రహం జాతరలోకి చేరుకుంటాయి. ఏటా శివరాత్రి ముగిసిన రెండో రోజే జాతర ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది ఒక రోజు ఆలస్యంగా ప్రారంభం కానుంది. జాతర ఏర్పాట్లను ఆలయ కమిటీ కన్వీనర్ టి.పురుషోత్తంరెడ్డి, మేనేజరు […]పూర్తి వివరాలు ...
కడప : కమలాపురం ఎమ్మెల్యే గతాన్ని గుర్తు చేసుకుని విమర్శలు చేయాలని కడప, కమలాపురం ప్రాంతాల జగన్ వర్గనాయకులు హెచ్చరించారు. 2009 ఎన్నికల్లో మేయర్ రవీంద్రనాథరెడ్డి వచ్చేంత వరకు నామినేషన్ వేయలేని వీరశివా ఇప్పుడు తేల్చుకుందాం అంటూ ప్రగల్భాలు పలుకుతావా అంటూ ప్రశ్నించారు. కడపలో కాదు.. కమలాపురం నియోజకవర్గంలో గీత గీస్తే తేల్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని వారు సవాల్ విసిరారు. వాహనాల కుంభకోణంలో పోలీసుల దాడిని తట్టుకోలేక ఆళ్లగడ్డ ఫామ్‌హౌస్‌లో దాక్కున్న ఘనత వీరశివారెడ్డికే దక్కుతుందన్నారు.పూర్తి వివరాలు ...
న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌లోని కడప లోక్‌సభ, పులివెందుల అసెంబ్లీ స్థానాలకు మరో రెండు రోజుల్లో ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను సీఈసీ ఈరోజు విడుదల చేసింది.పూర్తి వివరాలు ...
కడప : ‘ఏమీ చేయలేని అమాయకుల మీద కాదు ప్రతాపం చూపేది. దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డున తగుల్దాం.. ఎప్పుడైనా సరే. సవాల్ చేస్తున్నా..’ అంటూ కమలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి ఆగ్రహంతో మాజీ మేయరు రవీంద్రనాథ్‌రెడ్డికి సవాల్ విసిరారు. సోమవారం ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం జరిగిన కిడ్నాప్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ వీరశివ సహనం కోల్పోయారు. మాజీ మేయరుపై విరుచుకుపడ్డారు. ‘రవీంద్రనాథ్‌రెడ్డి’ పేరు ఉచ్చరించేందుకుపూర్తి వివరాలు ...