Search Results for: చక్రవేణు

    కథలు

    కసాయి కరువు (కథ) – చక్రవేణు

    చక్రవేణు కథ ‘కసాయి కరువు’ రాళ్లసీమ పల్లె మీద ఎర్రటి ఎండ నిప్పులు కురిసినట్లు కురుస్తోంది. ఎందుకో నూరీడు వగపట్టినట్లు ఊరి మీద అగ్గి వాన చల్లుతున్నాడు. తూరువు కొండ మీద చెట్లు మలమల మాడి ఎండిపోయాయి. గుట్టల మీద తెల్లకనిక రాళ్ళు కొలిమిలో మండినట్లు ఎర్రగా మెరున్తున్నాయి. యుద్ధకాలంలో శత్రువుల దాడికి భయవడి ఊరొదిలి వలనపోయిన విధంగా వల్లె పల్లె అంతా. బోసిగా ఉంది. పల్లెలో ఇళ్ళ యజమనులెవ్వరూ లేరు. పసిబిడ్డలూ, వాళ్ళ తల్లులూ, మునలోళ్ళూ […]పూర్తి వివరాలు ...

    కథలు

    కువైట్ సావిత్రమ్మ (కథ) – చక్రవేణు

    సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్లూ ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకూ ఆవైపు అంత గొప్పగా పెండ్లి జరిపినవారే లేరని కీర్తించారు. ‘ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా,’ అని పెదవి విరచి […]పూర్తి వివరాలు ...

    Home

    అల్లసాని పెద్దన అష్టదిగ్గజ కవులలో ఒకరు ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ జీన్ బాప్టిస్ట్ ట్రావెర్నియర్ ఫ్రెంచి యాత్రికుడు మరియు వర్తకుడు అనురాగ, అభిమాన మూర్తులు కడప వాసులు. పర్యాటకులను, యాత్రీకులను ఎంతో ఆదరిస్తారు. ఎంతగానో సహకరిస్తారు. డా.వైఎస్ రాజశేఖరరెడ్డి​ ముఖ్యమంత్రి​ కడప జిల్లాలో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. కడప పేరెత్తితే నాకు తెలియని ఆనందం కలుగుతుంది. కన్నతల్లి, కన్న ఊరు ఇష్టంలేని వారెవరు? తొలి తెలుగు కవయిత్రి తిమ్మక్క మొదలు, నాచన సోమన్న, […]పూర్తి వివరాలు ...

    వ్యాసాలు

    కడప జిల్లాలో కథాసాహిత్యం – డా|| కేతు విశ్వనాధరెడ్డి

    కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...

    కథలు వ్యాసాలు

    రాయలసీమ కథా సాహిత్య ప్రాభవ వైభవాలు -డాక్టర్ వేంపల్లి గంగాధర్

    రాయలసీమలో వైవిధ్య భరితమైన సాహిత్య ప్రాభవ వైభవాలు  కనిపిస్తాయి. శ్రీకృష్ణ దేవరాయలు ఆస్థానంలోని అల్లసాని పెద్దన, ప్రజాకవి వేమన, కాలజ్ఞానకర్త వీరబ్రహ్మం, పదకవితా పితామహుడు అన్నమయ్య వంటి మహానుభావులు ఎందరో ఈ ప్రాంతంలో సాహితీ సేద్యం చేశారు. కవిత్వం, అవధానం, నవల, విమర్శ, కథ వంటి సాహితీ ప్రక్రియలన్నీ ఆనాటి పునాదుల పైనే నిర్మితమవుతూ వచ్చాయి.పూర్తి వివరాలు ...