గురువారం , 21 నవంబర్ 2024

జూన్ 6 వరకు ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదు

కడప డిఎస్పీకడప : జూన్ నెల 6 వ తేదీ వరకూ కడప అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఎలాంటి ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని, ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరించారు. శనివారం డి.ఎస్.పి పత్రికా ప్రకటన విడుదల చేశారు. జూన్ 6 అనంతరం మోడల్ కోడ్ అఫ్ కండక్ట్ ముగిసిన తర్వాత పరిశీలించి ర్యాలీలకు, ఊరేగింపులు అనుమతిస్తామన్నారు.

144 సెక్షన్ అమలులో ఉందని,నలుగురికి మించి గుమికూడదన్నారు. అలాగే, 30 పోలీస్ యాక్ట్ కూడా అమలులో ఉందని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ తెలిపారు.

చదవండి :  ఉక్కు పరిశ్రమ కోసం ‘అఖిల‌ప‌క్షం’ ఆందోళన

కడప నగరంలో అన్ని రకాల దుకాణాలు రాత్రి 9 గంటల కే మూసివేయాలని డి.ఎస్.పి తెలిపారు. ట్రబుల్ మాంగర్లు జాగ్రత్తగా ఉండాలని, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా కఠిన చర్యలు తీసుకుంటామని కడప డి.ఎస్.పి ఎం.డి షరీఫ్ హెచ్చరించారు.

ఇదీ చదవండి!

అష్టదిగ్గజాలు

మట్లి (సిద్ధవటం) రాజుల అష్టదిగ్గజాలు

సిద్ధవటం రాజుల అష్టదిగ్గజాలు నా నీతిని వినని వానిని – వానను తడవని వానిని కననురా కుందవరపు కవి చౌడప్పా- …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: