ప్రొద్దుటూరు: పుస్తకాలు మానవాళికి మార్గదర్శకం అని జిల్లా గ్రంధాలయ పాలక మండలి సభ్యులు జింకా సుబ్రహ్మణ్యం అన్నారు. జనవిజ్ఞాన వేదిక ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు.
జవివే పట్టణ ప్రధాన కార్యదర్శి కే.వి.రమణ మాట్లాడుతూ పుస్తక ప్రదర్శనకు మంచి స్పందన లభించిందని ఆన్నారు. సైన్సు, కథలు , విశ్వదర్శనం, ప్రయోగదీపికలకు మంచి స్పందన లభించిందని అన్నారు,
పుస్తక ప్రదర్శన లో ci సత్యనారాయణ, si మహేష్, న్యాయవాది ముదివేముల కొండా రెడ్డి, సీనియర్ సిటిజన్ అసోసియేషన్ అద్యక్షులు రామి రెడ్డి, ముని స్వామి, జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తవ్వా సురేష్ రెడ్డి , జిల్లా ఉపాధ్యక్షులు గోపీనాథ్ రెడ్డి, డైరెక్టర్ ఉత్తమా రెడ్డి, మురళి గుప్తా , గురు నరసింహారెడ్డి , తదితరులు పాల్గొన్నారు.