ఆదివారం , 22 డిసెంబర్ 2024

జిల్లా కళాకారునికి ‘హంస’ పురస్కారం

మైదుకూరు: కడప జిల్లాకు చెందిన హరికథ, బుర్రకథ, యక్షగాన కళాకారుడు కొండపల్లి వీరభద్రయ్య భాగవతార్‌ను ప్రభుత్వం జానపద కళల విభాగంలో హంస (కళారత్న) పురస్కారానికి ఎంపిక చేసింది. ఉగాది సందర్భంగా తుళ్లూరులో నిర్వహించే ఉగాది సంబరాల్లో వీరభద్రయ్య పురస్కారంతో పాటు రూ.50 వేల నగదు బహుమతిని అందుకోనున్నారు. ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో 32 మంది కళాకారులకు హంస పురస్కారాలను, 67 మందికి ఉగాది పురస్కారాలనూ, బాలాంత్రపు రజనీకాంతరావుకు ‘తెలుగు వెలుగు విశిష్ట పురస్కారం’ను ప్రకటించింది.

చదవండి :  నో డౌట్...పట్టిసీమ డెల్టా కోసమే!

గతంలో వీరభద్రయ్యకు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం అందజేసింది. తమిళనాడుకు చెందిన అఖిలభారత తెలుగు అసోసియేషన్ ‘యక్షగాన కళానిధి’, విజయవాడలోని ఆదిభట్ల నారాయణదాసు సంస్మరణ సభ ‘హరికథా వాచాస్పతి’ బిరుదును వీరికి గతంలో ప్రదానం చేశాయి.

1985లోనే కళాకారులకు ఒక గ్రామం ఉండాలన్న భావనతో కళాకారులంతా కలిసి వీరభద్రయ్య నేతృత్వంలో మైదుకూరు సమీపంలో ‘పార్వతీనగర్’ పేర ఒక గ్రామాన్ని నిర్మించుకున్నారు.

వీరభద్రయ్య గారికి, కడప జిల్లా ప్రజల తరపున

www.www.kadapa.info అభినందనలు తెలియచేస్తోంది!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: