కడప : జిల్లాలోని పవిత్రపుణ్యక్షేత్రం పుష్పగిరిలో శనివారం సాయంత్రం శ్రీజ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న (ఇంకాపేరుపెట్టని) ప్రొడక్షన్‌నెంబరు1 సినిమా చిత్రీకరణ జరిగింది. నిర్మాణంలో భాగంగా హీరో రోహిత్, హీరోయిన్ శ్రీలపై సన్నివేశాన్ని చిత్రీకరించారు.
పీఎన్‌రెడ్డి దర్శకత్వంలో నిర్మాత మదన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతదర్శకుడు సుకుమార్ కాగా మగధీరా సినిమాలో నటించిన సంపత్‌రాజు ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. హీరోయిన్ గుడి నుంచి వస్తుండగా హీరో ఆమెను చూస్తూ అందానికి ముగ్దుడై పరవశించే సన్నివేశాన్ని చిత్రీకరించారు.
దర్శకుడు మాట్లాడుతూ పది సంవత్సరాల క్రితం గ్రామీణ ప్రాంతాలలో ఉండే సమాజం, వాటితీరు తెన్నులు సామాజిక అంశంపై చిత్రాన్ని తీస్తున్నామని తెలిపారు. ఈ సన్నివేశంలో సహనటులు నరశయ్య, శ్రీలక్ష్మి, నీలిమ, అరుణ, చెన్నకేశవరెడ్డి, దండపాణి తదితరులు పాల్గొన్నారు.