బత్తుల ప్రసాద్ వెలువరించిన కథా సంపుటి ‘గంజిబువ్వ’ ఆవిష్కరణ శనివారం రాత్రి హైదరాబాదులోని ఎన్టీఆర్ క్రీడా మైదానంలో జరిగింది. హైదరాబాదు బుక్ ఫెయిర్‌లో భాగంగా జరిగిన కార్యక్రమంలో చలనచిత్రాల నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు ఆవిష్కరించి మొదటి పుస్తకాన్ని తెలంగాణా దర్శకుల సంఘం అధ్యక్షుడు అల్లాణి శ్రీధర్‌కు అందించారు.
ఈ సంకలనంలో బత్తుల ప్రసాద్ రాసిన 16 కథలు ఉన్నాయి.ఇవి ఇంతకు ముందు వివిధ పత్రికలలో ప్రచురితమైన కథలు. గతంలో బత్తుల ప్రసాద్ కథలు ‘సగిలేటి కథలు’ పేర సంకలనంగా వెలువడ్డాయి. ‘గంజిబువ్వ’ బత్తుల ప్రసాద్ రాసిన కథల రెండవ సంకలనం. ప్రసాద్ స్వస్థలం కడప జిల్లాలోని కలసపాడు.
ఈ కార్యక్రమంలో రచయిత బత్తులప్రసాద్, దర్శకుడు అజయ్ కుమార్, అరవింద్ కొల్లి, రచయిత్రి వత్సల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
బత్తుల ప్రసాద్ ‘గంజి బువ్వ’ పేర రెండవ కథల సంకలనం వెలువరించడం పట్ల కడప జిల్లా రచయితలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు బత్తుల ప్రసాద్‌కు శుభాకాంక్షలు తెలియచేశారు.