సోమవారం , 23 డిసెంబర్ 2024

జై రాయలసీమ (కవిత) – సొదుం శ్రీకాంత్

తోరణాలు దిగేయండి
పావురాలు ఎగిరేయండి

బారులుగా కూరండి
మాలలుగా మారండి

అడుగుల మడుగై
అరవండి జోరుగా
జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? )
జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు )

ఇంగా ఏముంది ఎదురుజూడ్దానికి?
కొట్టం కాలిపాయ బతుకు బుగ్గైపాయ
కరువు పుండాయ బతుకు ఎండిపాయ
నిండా మునిగినాక సలేంది, గిలేంది!

ఇంగ మన బాట తిరుగుబాటే
ఇంగ మన మాట వేర్పాటే
యాడజూసినా
జై రాయలసీమ గీతాలు మారుమోగాల
‘జై జై జై రాయలసీమ జై జై జై’ అంటూ
ఉద్యమ సంగీతం వెలుగెత్తాల

చదవండి :  ఆనకట్టలు తెగే కాలం (కవిత) - డా. ఎం హరికిషన్

రాయలసీమ నా కల
రాయలసీమ నీ కల
రాయలసీమ మన కల
రాయలసీమ మనందరి కల

ఆలోచించు సీమకై
ఆవహించు సీమవై
ఆగ్రహించు సీమకై
అందుకో నినాదం
ఇక ఆగదు ఈ పోరాటం
రాయలసీమ సాధనే మన లక్ష్యం

జై రాయలసీమ
జై జై రాయలసీమ

ఇదీ చదవండి!

సిద్దేశ్వరం ..గద్దించే

నాది నవసీమ గొంతుక (కవిత)

కరువు గడ్డ కాదిది కాబోయే పోరు బిడ్డ నెత్తుటి గుడ్డ కాదిది కాబోయే ఉద్యమ అడ్డా మౌనాంగీకారం కాదు రా….. …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: