ఆదివారం , 22 డిసెంబర్ 2024

‘వాళ్ళు సీమ పేరు పలకడానికి భయపడుతున్నారు’

రాయలసీమ అనే పేరు చెప్పడానికి నాయకులు భయపడుతున్న పరిస్థితి దాపురించడం హేయంగా ఉందని  కేతువిశ్వనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీపీబ్రౌన్ భాషాపరిశోధనకేంద్రంలో జరిగిన మాచిరెడ్డి వెంకటస్వామి స్మారకోపన్యాసాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాగునీరు, సాగునీరు, విద్యాప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టు రూపకల్పన, నగరాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ వంటి మాటలు నాయకుల నోటి రాకపోవడం బాధకరంగా ఉందన్నారు. రాయలసీమ పౌరసమాజం చైతన్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. సీమ సమాజవికాసం కోసం స్థబ్దుగా ఉన్న పౌరులను చైతన్యం వైపు నడిపించాల్సిన బాధ్యత కవులు, మేధావులపైన ఉందన్నారు.

చదవండి :  ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కినారు

ప్రస్తుతం సీమ సమస్యలను విద్యార్థులకు తెలియజేయాల్సిన అవసరం గుర్తించాలన్నారు. మేధావులు, కవులు వేదికగా నిలవాలన్నారు. ఇలాంటి ప్రయోజనకరమైన ఉపన్యాసాలు ప్రజల్లోకి తీసుకువచ్చిన వెంకటస్వామి స్మారక సమితి కన్వీనర్ డా.కిన్నెర శ్రీదేవి అభినందనీయురాలన్నారు. గతంలో రాయలసీమ గురించి మాట్లాడిన నాయకులందరు ప్రస్తుతం అధికారపక్షంలో ఉండడంతో గళం విప్పేవారు కరవయ్యారని రచయిత జియస్. రామ్మోహన్ అన్నారు.

రాయలసీమలో చెప్పుకోదగ్గ పెద్ద పరిశ్రమలు, విద్యాసంస్థలు లేవన్నారు. రాయలసీమ రచయితల కర్తవ్యాలు అనడం కంటె రాజకీయ నాయకులు చేయాల్సిన కర్తవ్యంపై మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ విమర్శకుడు, కథకులు సింగమనేని నారాయణ అన్నారు.

చదవండి :  సీమ యువకుడికి కేంద్ర సాహిత్య అకాడమీ 'యువ పురస్కారం'

ఇటీవల అనంతపురంలో విభజన నేపథ్యంలో రాజకీయనాయకులు చేయాల్సిన కర్తవ్యాలపై సమావేశం జరిగితే ఒక్కనాయకుడు సభలోనికి రాలేకపోయాడన్నారు. ఉద్యమభావజాల ప్రచారానికి కవులే పూనుకోవాలన్నారు. ప్రస్తుతం కవులు, మేధావులు ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు.

రాయలసీమ వ్యక్తులు అధికసంఖ్యలో ముఖ్యమంత్రులుగా ఉండి కూడా అభివృద్ధిపై పాలకులు శీతకన్ను వేశారని ఆచార్యరాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో స్పందించారు.

అనంతరం వెంకటస్వామి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వెంటకస్వామి రచయిత కాకపోయినా ప్రజాసమస్యల పట్ల ఎలా స్పందించినది, కవుల పట్ల ఎలాంటి సదభిప్రాయం ఉండేదో అతిథులు సభకు వివరించారు. ప్రముఖ రచయిత శశిశ్రీ, డా.ఈశ్వర్‌రెడ్డి, డా.మూలమల్లికార్జునరెడ్డి, యన్సీ రామసుబ్బారెడ్డి, విద్వాన్ కట్టానరసింహులు, మొగలిచెండు సురేష్, పలువురు సాహితీవేత్తలు, వెంకటస్వామి అభిమానులు, స్మారక సమితి సభ్యులు పాల్గొన్నారు.

చదవండి :  గండికోటను దత్తత తీసుకున్న దాల్మియా సంస్థ

ఇదీ చదవండి!

సీమపై వివక్ష

‘సీమ’పై వివక్ష ఇంకా ఎన్నాళ్లు?

‘వడ్డించేవాడు మనవాడైతే పంక్తిలో ఎక్కడ కూర్చున్నా ఫర్వాలేదు..’ అన్న సామెత రాయలసీమకు మాత్రం వర్తించదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: