సోమవారం , 23 డిసెంబర్ 2024

సాయిప్రతాప్ రాజీనామా!

తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని కేంద్రం ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌ కాంగ్రెస్‌ పార్టీకి, పదవులకు రాజీనామా చేశారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్‌ను నమ్ముకుని ఎనలేని సేవలందించినా, సీమాంధ్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసేలా కేబినెట్‌లో టీ.నోట్‌ను పెట్టడంపై సాయిప్రతాప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు.
సీమాంధ్ర ప్రజలను దెబ్బతీసే విధంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ను వీడడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి, పీసీసీ అధ్యక్షుడికి కూడా పంపానన్నారు. ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
చదవండి :  పురంధేశ్వరిపై లక్షా 74 వేల మెజార్టీతో గెలిచిన యువకుడు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: