ఆదివారం , 22 డిసెంబర్ 2024

బేట్రాయి సామి దేవుడా! – జానపద గీతం

బేట్రాయి సామి దేవుడా-నన్నేలినోడ

బేట్రాయి సామి దేవుడా

కాటేమి రాయుడా ! కదిరి నరసిమ్మడా

మేటైన వేటుగాడ నిన్నే నమ్మితిరా                       1బే1

శాపకడుపున చేరి పుట్టగా-రాకాసిగాని

కోపామునేసి కొట్టగా

ఓపినన్ని నీళ్ళలోన వలసీ వేగమె తిరిగి

బాపనోళ్ళ సదువులెల్ల బెమ్మదేవరకిచ్చినోడ            1బే1

తాబేలై తాను పుట్టగ -ఆ నీల్లకాడ

దేవాసురులెల్ల గూడగ

దోవసూసి కొండకింద దూరగానె సిల్కినపుడు

సావులేని మందులెల్ల దేవర్ల కిచ్చినోడ                  !బే1

అందగాడవవుదు లేవయా-గోపాల గో

విందా రచ్చించ రావయా

పందిలోన సేరి కోరపంటితో ఎత్తి భూమి

చదవండి :  బుంగ ఖరీదివ్వరా పిల్లడ - జానపదగీతం

కిందుమిందు సేసినట్టి సందమామ నీవె కాద            1బే1

నారసిమ్మ నిన్నె నమ్మితి -నానాటికైన

కోరితి నీ పాదమె గతి

ఓరి నీవు కంబాన – సేరి ప్రహ్లాదు గాచి

కోరా మీసాల శతృగుండె దొర్లసేసినోడ                    1బే1

బుడుత బాపనయ్య వైతివి

ఆ శక్కురవరితినడిగి భూమి యేలుకొంటివి

నిడువు కాళ్ళోడివై అడుగు వాని నెత్తిమీద బెట్టి

డవులేక లోకమెల్ల-మెడిమ తోటి తొక్కినోడ          1బే1

రెండు పదులు ఒక్కమారుతో -ఆ దొరలనెల్ల

సెండాడితివిర  పరశుతో

చదవండి :  నేటి రాజకీయాలపై గ్రామీణ మహిళల జానపద చెణుకులు!

సెండకోలబట్టి కోదండరామ సామికాడ

బెండుకోల సేసుకొని కొండకపుడు ఏగినోడ                 1బే1

రామదేవర రచ్చించరావయా-సీతమ్మ తల్లి

శ్యామసుందర నిన్ను మెచ్చగా

సామి తండ్రి మాటగాచి-ప్రేమ భక్తుల నాదరించి

ఆమీద లంకనెల్ల దోమగాను చేసినోడ                       1బే1

దేవకీదేవి కొడుకుగా ఈ జగములోన

దేవుడై నిలిచినావుగా

ఆవూల మేపుకొని ఆడోళ్ళ గూడుకొని

తావు బాగ చేసుకోని తక్కిడిబిక్కిడి చేసినోడ                 1బే1

దాలు నమ్మరాదని ఆ శాస్రాల

వాదాలు బాగలేవని

బోదనలు సేసుకొని బుద్దులు సెప్పుకొని

నాదా వినోదుడైన నల్లనయ్య నీవుకాద                        1బే1

చదవండి :  నలుగూకు రావయ్య నాదవినోదా! - జానపదగీతం

లికి నాదొరవు నీవెగా -ఈ జగములోన

పలికినావు బాలశిశువుడా

చిల్లకట్టు పురములోన -సిన్నిగోపాలుడవురా

పిల్లంగోవి సేతబట్టి -పేట పేట తిరిగినోడ                          1బే1

 

ఈ గేయం లోని కొన్ని రాయలసీమ మాండలిక పదాలకు అర్థాలు:

బేట్రాయి= కొండరాయి

వేటుగాడ= వేటగాడ

రాకాసిగాని = రాక్షసుని

ఓపినన్ని = చాలినన్ని

బెమ్మదేవర = బ్రహ్మదేవుడు

కిందు మిందు = తలకిందులు

కంబాన = స్థంభాన

బుడుత = పొట్టివాడు

నిడువు = పొడవైన

అడుగు = పాదం

సెండకోల = ఖందించే ఆయుధం

బెండుకోల = శక్తి విసర్జించిన

తక్కిడిబిక్కిడి = మోసం

ఆవూల = ఆవుల

ఇదీ చదవండి!

రామభద్ర రఘువీర

భరతుడా! నా చిన్ని తమ్ముడా (చెక్కభజన పాట)

ఒకప్పుడు రామాయణ, భారత, భాగవత కథలు జానపదుల జీవితంలో నిత్య పారాయణాలు. వారికి ఇంతకంటే ఇష్టమైన కథలు మరేవీ ఉండవేమో! …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: