“కాటమరాయుడా..కదిరి నరసిం హుడా” అంటూ పవన్ కల్యాణ్ “అత్తారింటికి దారేదీ” అనే చిత్రం కోసం పాడిన పాట రాయలసీమలో జనులు పాడుకునే ఒక ప్రసిద్ధ జానపదగీతం. కదిరి తాలూకా ఒకప్పుడు కడప జిల్లాలో భాగంగా ఉండేది. అందువల్ల కడప జిల్లా జానపదులకు కూడా ఈ గీతం బాగా పరిచయమే!
శ్రీ మహావిష్ణువు దశావతారాలను ఈ గీతం వివరిస్తుంది. ఈ గీతాన్ని చక్క భజన కళాకారులూ ఇతర జానపద కళాకారులూ వివిధ పద్దతుల్లో పాడుకొంటూ ఉంటారు..
1940 లో చిత్తూరు నాగయ్య నటించిన సుమంగళి చిత్రంలో ఈ పాటలో కొంత భాగం ఉంది. తర్వాత 1970-80 ప్రాంతాల్లో ఆకాశవాణి కడప కేంద్రం ద్వారా ఈ జానపదగేయం విశేషంగా ప్రసారం అయ్యింది. దీనిని ఇప్పుడు పవన్ కల్యాణ్ ఖూనీ చేస్తూ పాడాడు.
మూలపు గేయంలో మత్స్యావతారము, కూర్మావతారము, వరాహావతారము, నృసింహావతారము లేదా నరసింహావతారము, వామనావతారము, పరశురామావతారము, రామావతారము, కృష్ణావతారము, బుద్ధావతారము, కల్క్యావతారముల పై చరణాలుండగా పవన్ కల్యాణ్ కేవలం మత్స్యావతారము, కూర్మావతారము, నృసింహావతారము లను గురించిన చరణాలను మాత్రమే పాడాడు.
పాట రికార్డింగ్ సమయంలో పవిత్రమైన భావాలతో కూడిన పాటను వెకిలి చేష్టలతో అభినయిస్తూ పాడటం మంచిదికాదు. రాయలసీమ సంస్కృతిని అనేక సినిమాలలో వక్రీకరించిన సినిమావాళ్ళు రాయలసీమ జానపదగేయాలను వికృతంగా పాడటం శోచనీయం.
ఆ రాయలసీమ జానపదులు పాడుకునే ఈ గేయం ఈ పాట పూర్తి పాఠం కోసం మరియు గీతంలోని పదాలకు అర్థాలను తెలుసుకోవడానికి క్రింది లింకును క్లిక్ చెయ్యండి.
సుమంగళి చిత్రంలోని పాట:
nijame kooni chesaadu..maree veella istam aypoyindhi
Rayalaseema charitranu khoony cheste battalu oodadeesi kodatamu.GRSF.
మన రాయలసీమ డబ్బులతో సినిమాలు తీసే ఈ రాజకీయనాయకులు మన సంస్కృతిని చాలా దారుణంగా చూపించి రాయల సీమలో ఉండేవారు మనుసులే కాదు అనే విధంగా చూపించారు. గోరంతను కొండంత చేసి చూపించారు అందులో ఈ పాట విషయానికి వస్తే పెద్ద తప్పేమీ లేదనిపిస్తుంది మిత్రమా!
Meeru kooda Telangana vallalaga sankuchitanga valla darilo nadavoddandi