శుక్రవారం , 22 నవంబర్ 2024

ఒంటిమిట్ట కోదండరాముని సన్నిధిలో అన్నమయ్య రాసిన సంకీర్తన

అన్నమాచార్యుడు – తొలి తెలుగు వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు. బాషలో, భావంలో- విలక్షణత్వాన్ని, వినూత్నత్వాన్నీ చేర్చి పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినాడు. తన పల్లవీ చరణాలతో వేంకటపతిని దర్శించిన అన్నమయ్య ఒంటిమిట్ట కోదండ రామయ్యను ఇలా కీర్తిస్తున్నాడు..

 

జయ జయ రామా సమరవిజయ రామా
భయహర నిజభక్తపారీణ రామా

జలధిబంధించిన సౌమిత్రిరామా
సెలవిల్లువిరచినసీతారామా
అలసుగ్రీవునేలినాయోధ్యరామా
కలిగి యజ్ఞముగాచేకౌసల్యరామా

అరిరావణాంతక ఆదిత్యకులరామా
గురుమౌనులను గానేకోదండరామా
ధర నహల్యపాలిటిదశరథరామా
హరురాణినుతులలోకాభిరామా.

చదవండి :  దేవుని కడప రథోత్సవం వైభవం తెలిపే అన్నమయ్య సంకీర్తన

అతిప్రతాపముల మాయామృగాంతక రామా
సుతకుశలవప్రియ సుగుణ రామా
వితతమహిమలశ్రీవేంకటాద్రిరామా
మతిలోనబాయనిమనువంశరామా

ఇదీ చదవండి!

నరసింహ రామకృష్ణ

నరసింహ రామకృష్ణ : అన్నమయ్య సంకీర్తన

భగవదంకితబుద్ధులను ఏ దుష్టశక్తులూ నిలుపలేవు. భగవంతుని చేరడానికి పేర్కొన్న నవవిధ భక్తి మార్గాలలో వైరాన్ని ఆశ్రయించిన వారు శిశుపాల హిరణ్యకసిపాదులు. …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: