అక్టోబరు 26 నుంచి 28 వరకూ జిల్లాలో పర్యాటక ఉత్సవాలు నిర్వహించనున్నారు. రాష్ట్ర పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ‘గండికోట హెరిటేజ్’ ఉత్సవాల పేరిట గండికోటతోపాటు రాజంపేట, కడప నగరంలో కూడా మొత్తం మూడు రోజులు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు.
పారంభ కార్యక్రమ వేడుకలకు ‘గండికోట’ వేదిక కానుంది. ఈ ఉత్సవాల నిర్వాహక ప్రత్యేక అధికారి జీఎన్ రావు ప్రారంభ వేడుకల్లో ఏనుగులు, గుర్రాలు, ఒంటెలు, వృషభరాజాలు వగైరాలతో రాయల నాటి వైభవం గుర్తుకొచ్చేలా నిర్వహించాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు.
అందుకు కలెక్టర్‌తోపాటు సంబంధిత అధికారులు కూడా సహకరిస్తామని చెప్పడంతో ప్రారంభోత్సవ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించాలని యోచిస్తున్నారు.