జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో సరాసరి 72.71% పోలింగ్ నమోదైంది. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు.
కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. 232 వార్డులు/డివిజన్‌లలో ఎన్నికలు జరుగగా 1188 మంది బరిలో నిలిచారు. 6,56,742 మందికి ఓట్లు ఉంటే 4,44,355 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడంతో పాటు పెద్దఎత్తున బైండోవర్ కేసులు నమోదు చేయడంతో ఎక్కడా హింసనే సంఘటనే చోటు చేసుకోలేదు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. దీంతో పోలీసులతో పాటు జనం ఊపిరి పీల్చుకున్నారు.
కడప నగరంలో 18వ డివిజన్‌లోని పిఎఫ్ కార్యాలయం బూత్‌లో జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ జీవిజీ అశోక్‌కుమార్‌లు ఓటు హక్కును వినియోగించుకున్నారు.