ఆదివారం , 22 డిసెంబర్ 2024

1,050 మెగావాట్ల కరెంటు తయారీ ఆగింది!

ఉద్యోగుల సమైక్య సమ్మె నేపధ్యంలో రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం(ఆర్టీపీపీ)లో మూడు రోజులుగా కరెంటు తయారీ ఆగిపోయింది.  కడపతోపాటు, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎంతో కీలకమైన ఈ కేంద్రం మూడు రోజులుగా పడకేసింది. అయిదు యూనిట్లలో 1,050 మెగావాట్ల కరెంటు తయారీ నిలిచిపోయింది. ఇంజినీర్లు, ఉద్యోగులంతా సమ్మె కారణంగా విధులకు హాజరుకామంటూ కరాఖండిగా చెబుతున్నారు. ఈ ప్రభావం జిల్లాఅంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్ఉద్యోగులంతా రాజీలేని సమ్మె కొనసాగిస్తుండటంతో జిల్లావాసుల విద్యుత్ కష్టాలు వినే నాథుడే కరవయ్యాడు.

చదవండి :  నెలాఖరు వరకు ఉపకారవేతనాల దరఖాస్తుకు గడువు

విద్యుత్ ఉద్యోగుల సమ్మె ప్రభావం జిల్లావాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. పగలంతా సరఫరా ఉండటమే గగనమైపోయింది. ఆది, సోమ,మంగళ వారాల్లో జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఉదయం నుంచి రాత్రి 7గంటల వరకు సరఫరా ఎక్కడా లేకపోవడంతో అన్నివర్గాల వారు అవస్థలు పడాల్సివచ్చింది.

కనీసం తాగునీటి పథకాలకు నీరందించే అవకాశం లేకపోవడంతో పట్టణాలు, గ్రామాల్లో నీటికష్టాలు తప్పలేదు. ప్రభుత్వాసుపత్రుల్లో అత్యవసర సేవలకు సైతం విద్యుత్ సరఫరా కష్టంగా మారింది. జెరాక్స్ కేంద్రాలు, పిండిమిల్లులు తదితర వ్యాపారులు తీవ్ర ఇబ్బందిపడ్డారు.

చదవండి :  రేపు వేంపల్లెలో 'తలుగు' పుస్తకావిష్కరణ

52 వేలకుపైగాఉన్న వాణిజ్య విద్యుత్ వినియోగదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక ప్రజలైతే సమీపంలోని విద్యుత్ ఉపకేంద్రాల వద్దకు వెళ్లి పదేపదే సరఫరా ఎప్పుడు పునరుద్ధరణ అవుతుందోనని వాకబు చేస్తూనేఉన్నారు. జిల్లావ్యాప్తంగా 6.45 లక్షల గృహ విద్యుత్ వినియోగదారులు ఆపసోపాలుపడుతున్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: