హరిఁ గొలిచియు మరీ నపరములా – అన్నమయ్య సంకీర్తన

హరిఁ గొలిచియు మరీ నపరములా – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
హరిఁ గొలిచియు మరీ నపరములా
తిరముగ నతనినే తెలియుటగాకా
॥చ1॥
పంకజనాభునిపాదములు దలఁచి
యింకా మరి యొకయితరములా
అంకెల నతనినే అతనిదాసులనే
కొంకక నిజముగఁ గొలుచుటగాకే
॥చ2॥
పన్నగశయనునిబంట్లకు బంటై
కొన్నిటిపై మరి కోరికెలా
యిన్ని కోరికలు యిదియే తనకని
కొన్నది కోలై కోరుటగాకా
॥చ3॥
వీనుల వేంకటవిభునామామృత –
మూనిన మతి మరియును రుచులా
తేనెలుగారెడితీపు లతనిమతి
నానారుచులై ననుచుటగాకా
రాగము: భైరవి
రేకు: 0047-05
సంపుటము: 1-290

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, భైరవి

చదవండి :  ఎటువంటిరౌద్రమో యెటువంటికోపమో - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: