గురువారం , 21 నవంబర్ 2024

నేడు హనుమజ్జయంతి

ఆంజనేయస్వామి జయంత్యుత్సవం పురస్కరించుకుని జిల్లాలో ఉన్న ఆంజనేయస్వామి దేవస్థానాల్లో బుధవారం హనుమజ్జంతి వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఉదయం నుంచే భక్తులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

ఆలయాల నిర్వాహకులు భక్తులు స్వామిని దర్శించుకునేందుకు అన్నిఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానంగా భక్తులు ఆంజనేయస్వామికి ఇష్టమైన ఆకుపూజలు చేయించి తమ మొక్కుబడులు తీర్చుకుంటారు. ఈసందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి ఉదయం గణపతిపూజ, పుణ్యాహవాచనం, పురుషసూక్త, శ్రీసూక్త, నమక, చమక, మన్యుసూక్తపారాయణము, రుద్రహోమం, పూర్ణాహుతి, శ్రీరామాంజనేయ మూలమంత్ర జపం, అభిషేకం, అర్చన, నివేదనం, మంత్రపుష్పం తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు.

చదవండి :  కోరవాని పల్లెలో గొర్రెల కాపరుల వింత ఆచారం

అలాగే సాయంత్రం 6గంటలకు స్వామివారికి ఆకుపూజ, అర్చన, మంగళహారతి, మంత్రపుష్టం అనంతరం తీర్థప్రసాదాల వినియోగం గావిస్తారు. కొన్ని దేవస్థానాల్లో మద్యాహ్నం 12 గంటల నుంచి పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

కడప నగరం పాత బస్టాండ్ సమీపంలోవున్న గాలిదేవర ఆంజనేయస్వామి ఆలయంలో ఉదయం నుంచి విశేష పూజలు చేస్తారు. ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేకం, పుష్పా లంకరణ, సహస్రనామార్చన, మహా మంగళహారతి, ప్రసాద వినియోగం అనంతరం హనుమత్ చాలీసా పఠనము, మద్యాహ్నం అన్నదానము కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే సాయంత్రం 6 గంటల నుంచి నగరంలో గ్రామోత్సవము వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామోత్సవంలో చెక్క్భజన బృందం, వివిధ వేషాలతో కళాబృందాలతో ఈగ్రామోత్సవం ఆలయం నుండి ప్రారంభమై నగర పురవీధులలో గుండావెళ్లి తిరిగి ఆలయం చేరుకుంటుంది. అలాగే నగరంలోని గంజికుంట కాలనీలో వున్న ఆంజనేయస్వామిదేవస్థానంలో చిన్మయామిషన్ ఆధ్వర్యంలో విశేషపూజలు గావిస్తారు.

చదవండి :  29న తాటిమాకులపల్లెలో బండలాగుడు పోటీలు

నగరంలోని బ్రాహ్మణవీధిలోని జూల్ ఆంజనేయస్వామి ఆలయం, జడ్జికోర్టువద్ద గల ఆంజనేయస్వామి ఆలయం, చిన్నచౌకు ప్రాంతంలోని పంచముఖాంజనేయస్వామి ఆలయం, మారుతీనగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం, గడ్డిబాజరువీధిలోని (బాలాజి) దేవస్థానం, జౌళి బజారులోని కోదండరామస్వామి ఆలయం, కో- ఆపరేటివ్ కాలనీలోని దేవస్థానం, శంకరాపురంలోని దేవస్థానం, కృష్ణాపురంలోని పంచముఖ ఆంజనేయస్వామిదేవస్థానం, ఎర్రముక్కపల్లెలోని దేవస్థానం, దేవునికడపలోని దేవస్థానం, అల్మాస్‌పేటలోని దేవస్థానం, దేవునికడపలోని ఆంజనేయస్వామి ఆలయం, రైల్వేస్టేషన్ సమీపంలోని పంచముఖ ఆంజనేయస్వామి, రాయచోటి ఘాట్‌లోవున్న ఆంజనేయస్వామిదేవస్థానం, గండి, వెల్లాలతోపాటు పలు ఆంజనేయస్వామి దేవస్థానాల్లో బుధవారం ఆంజనేయస్వామికి విశేషపూజలు నిర్వహిస్తారు.

చదవండి :  పశుపక్షాదులను గురించిన మూఢనమ్మకాలు

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: