సొంపుల నీ వదనపు సోమశిల కనుమ – అన్నమయ్య సంకీర్తన

    సొంపుల నీ వదనపు సోమశిల కనుమ – అన్నమయ్య సంకీర్తన

    వర్గం : శృంగార సంకీర్తనలు

    ॥పల్లవి॥ సొంపుల నీ వదనపు సోమశిల కనుమ
    యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి

    ॥చ1॥ కలికి నీ పిఱుఁదనే గద్దెరాతి కనుమ
    మొలనూళ్ళలతలనే ముంచుకొన్నది
    కలయఁ బోకముడినే కట్లువడ్డది
    అలరువిలుతుదాడికడ్డము నీ పతికి ||సొంపుల||

    ॥చ2॥ ఇదివొ నీ కెమ్మోవి యెఱ్ఱశిల కనుమ
    కదిసి లేఁజిగురులఁ గప్పుకొన్నది
    వదలకింతకుఁ దలవాకిలైనది
    మదనుని బారికి మాఁటువో నీ పతికి ||సొంపుల||

    ॥చ3॥ కాంత నీ చిత్తమే దొంగలసాని కనుమ
    యింతటి వేంకటపతికిరవైనది
    పంతపు నీ గుబ్బలే గుబ్బలికొండకనుమ
    మంతనాల కనుమాయ మగువ నీ పతికి ||సొంపుల||

      చదవండి :  దేవుని కడప రథోత్సవం వైభవం తెలిపే అన్నమయ్య సంకీర్తన

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *