సులభుఁడు మధుసూదనుఁడు మన- – అన్నమయ్య సంకీర్తన

సులభుఁడు మధుసూదనుఁడు మన- – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సులభుఁడు మధుసూదనుఁడు మన-
మెలమి నమ్మిన నిట్టే సుండీ
is-aber.net
॥చ1॥
పడుచు మాటన కా ప్రహ్లదునెదుట
పొడచూపె నాదిపురుషుఁడు
అడవి దేహనక అదంతిమొఱకును
తడవి కాచిన దైవము సుండీ
॥చ2॥
ఆడుమాటలనక అంతలో ద్రౌపదిని
వాడిమి గాచిన వరదుఁడు
పోఁడిమిఁ బేదనక పొందిన కుచేలుని
వీఁడె సంపదిచ్చె విష్ణుఁడు సుండీ
॥చ3॥
వీరువారన కిదె వేఁడిన వరములు
సారేకు నిచ్చిన సర్వేశుఁడు
మేరతో లోకముల మెఱసె నిప్పుడును
యీరీతి శ్రీవేంకటేశుఁడే సుండీ
రాగము: రామక్రియ
రేకు: 0082-02
సంపుటము: 1-394

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, రామక్రియ

చదవండి :  ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: