సీమ సినుకయ్యింది
ముసురు మొబ్బయ్యింది
దారి ఏరయ్యింది
ఊరు పోరయ్యింది
సినుకు సినుకే రాలి
సుక్క సుక్కే చేరి
ఊరి వంకై పారి
ఒక్కొక్కటే కూరి
పెన్నేరుగా మారి
పోరు పోరంట ఉంది
పోరు పెడతా ఉంది
సీమ సినుకయ్యింది
ముసురు మొబ్బయ్యింది
దారి ఏరయ్యింది
ఊరు పోరయ్యింది
మెడలు వంచాలంది
మడవ తిప్పాలంది
మడమ తిప్పకు అంది
తడవ మనదే అంది
కడవ పగలాలంది
అడుగు మడుగయ్యింది
గొడవ దడి చేరింది
సీమ సినుకయ్యింది
ముసురు మొబ్బయ్యింది
దారి ఏరయ్యింది
ఊరు పోరయ్యింది
కొలిం కాకకెక్కింది
గళం ఎర్రబారింది
కలం నిప్పయ్యింది
కలే ‘నీళ్ళ’య్యింది
జనం దళమయ్యింది
మౌనం బద్దలయింది
స్వప్నం సీమయ్యింది
సీమ సినుకయ్యింది
ముసురు మొబ్బయ్యింది
దారి ఏరయ్యింది
ఊరు పోరయ్యింది
కోడి కూతేసింది
కోడె రంకేసింది
దూడ గంతేసింది
దోని కడుగయ్యింది
దాడి మడుగయ్యిండి
గోడు వాడేక్కింది
నేడు కాదంటే-రేపు లేనట్టే అంది
సీమ సినుకయ్యింది
ముసురు మొబ్బయ్యింది
దారి ఏరయ్యింది
ఊరు పోరయ్యింది
దగా సిగ్గిర్సింది
బతుకు బుగ్గయ్యింది
లోన అగ్గి రేగింది
సీమ బగ్గ్గుమంటాంది
అల్లె దగ్గరయ్యింది
ముంగు ముగ్గయ్యింది
జనం జాతరయ్యింది
సీమ సినుకయ్యింది
ముసురు మొబ్బయ్యింది
దారి ఏరయ్యింది
ఊరు పోరయ్యింది
వారు దండోరయ్యింది
ఊరు దరువయ్యింది
వేలు ఈలయ్యింది
కాలు గోలయ్యింది
సీమ చిందేసింది
నోము ఫలించింది
నింగి తొంగిచూసింది
జగ్……….జగ్……….జగ్గనక్
జగ్……..జగ్……..జగ్గనక్
జగ్……జగ్……జగ్గనక్
జగ్….జగ్….జగ్గనక్
జగ్..జగ్..జగ్గనక్
జగ్ జగ్ జగ్గనక్
జగ్గనక్ జగ్గనక్ జగ్ జగ్ జగ్గనక్
జగ్గనక్ జగ్గనక్ జగ్ జగ్ జగ్గనక్
ఆదిరా అడుగు… అది…ఎయ్
ఎయ్ రా నారిగా ఎయ్…
తొక్కు రా దాన్ తక్కె తొక్కు
ఇంగాడికి పోతాడో కొడుకు సూచ్చం
జగ్గనక్ జగ్గనక్ జగ్ జగ్ జగ్గనక్
జగ్గనక్ జగ్గనక్ జగ్ జగ్ జగ్గనక్
సీమ సినుకయ్యింది
ముసురు మొబ్బయ్యింది
దారి ఏరయ్యింది
ఊరు పోరయ్యింది