
సీతాశోక విఘాతక – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సీతాశోక విఘాతక పాతాళ లంకాపతివిభాళా ॥చ1॥ హనుమంతరాయ అంజనీతనయ వో- వనధిలంఘనగాత్ర వాయుపుత్రా యినకులాధిపనిజహిత జగన్నుత- వనజోదరసేవక సత్వధనికా ॥చ2॥ ప్రళయాంతకరూప బలదీప రవిఫల- గిళనప్రతాప సుగ్రీవప్రియా కుళకదానవసంకులవిదారణ భళిభళి జగత్పతిబలుబంటా ॥చ3॥ పంకజాసనుదివ్యపదవైభవ వో- లంకిణీ ప్రాణ విలంఘన వేంకటేశ్వరు సేవావీర మహాధీర కింకరరాయ సుఖీభవా |
రాగము: దేసాక్షి రేకు: 0070-03 సంపుటము: 1-366 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, దేసాక్షి