సోమవారం , 23 డిసెంబర్ 2024

సామీ నమస్కారం…. (కవిత)

సామీ నమస్కారం….
మాకు పంగనామాలు పెట్టిన 
సామీ నీకు నమస్కారం

అమ్మ నోట్లో మన్ను కొట్టి
అబద్దాలు ఆరవోసిన 
సామీ నీకు నమస్కారం

సొమ్ములున్న సోగ్గాళ్ళ
కౌగిట బందీవై 
మము వెక్కిరించిన 
సామీ నీకు నమస్కారం!

సభ సాక్షిగా సీమకు 
మకిలిని అంటగట్టిన 
సామీ నీకు నమస్కారం!

రాజధాని పేర రంకు నడిపి 
ప్రకాశం పేరును బొంకిన
సామీ నీకు నమస్కారం!

చదవండి :  రోంత జాగర్తగా మసులుకోర్రి సోములారా ! (కవిత)

ఉత్తుత్తి వరాలతో ఊదరగొట్టి
పేపర్లతో అదరగొట్టించిన
సామీ నీకు నమస్కారం!

సొంతింటి పేరు సెప్పి
అత్తింటికి దాసుడవైన
సామీ నీకు నమస్కారం!

పదవుల పందేరం పేరు సెప్పి
కాగితపు పులులను ఆడిస్తున్న
సామీ నీకు నమస్కారం!

రాజధాని పేరు సెప్పి
ఉన్న నీళ్ళూ ఊడ్సేదానికి
కంకణం కట్టుకున్న 
సామీ నీకు నమస్కారం!

అమ్మ పాలు తాగి 
రొమ్ము గుద్దిన 
సామీ నీకు నమస్కారం!
సామీ…! సామీ నీకు నమస్కారం!!

చదవండి :  ఒక్క వాన చాలు (కవిత) - సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి

ఇదీ చదవండి!

రాయలసీమ సంస్కృతి

‘రాయలసీమ సంస్కృతి’పై చిత్రసీమలో ఊచకోత

తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని …

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: