
సహజ వైష్ణవాచార వర్తనుల- – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సహజ వైష్ణవాచార వర్తనుల- సహవాసమె మాసంధ్య ॥చ1॥ అతిశయమగు శ్రీహరిసంకీర్తన సతతంబును మాసంధ్య మతి రామానుజమతమే మాకును చతురతమెఱసిన సంధ్య ॥చ2॥ పరమభాగవతపదసేవనమే సరవి నెన్న మాసంధ్య సిరివరుమహిమలు చెలువొందఁగ వే- సరక వినుటె మాసంధ్య ॥చ3॥ మంతుకెక్క తిరుమంత్రపఠనమే సంతతమును మాసంధ్య కంతుగురుఁడు వేంకటగిరిరాయని- సంతర్పణమే మాసంధ్య |
రాగము: సామంతం రేకు: 0002-04 సంపుటము: 1-10 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, సామంతం