
సర్మాంతరాత్ముడవు శరణాగతుడ నేను – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సర్మాంతరాత్ముడవు శరణాగతుడ నేను సర్వాపరాధినైతి చాలుఁజాలునయ్యా ॥చ1॥ వూరకున్న జీవునికి వొక్కొక్క స్వతంత్ర మిచ్చి కోరేటి యపరాధాలు కొన్ని వేసి నేరకుంటే నరకము నేరిచితే సర్గమంటా దూరవేసే వింతేకాక దోష మెవ్వరిదయ్యా ॥చ2॥ మనసు చూడవలసి మాయలు నీవే కప్పి జనులకు విషయాలు చవులు చూపి కనుఁగొంటే మోక్షమిచ్చి కానకుంటె కర్మమిచ్చి ఘనము సేసే విందు గర్త లెవ్వరయ్యా ॥చ3॥ వున్నారు ప్రాణులెల్లా నొక్కనీ గర్భములోనే కన్న కన్న భ్రమతలే కల్పించి యిన్నిటా శ్రీవేంకటేశ యేలితివి మమ్ము నిట్టె నిన్ను నన్ను నెంచుకొంటే నీకే తెలుసునయ్యా |
రాగము: లలిత రేకు: 0084-05 సంపుటము: 1-409 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత