సతతము నేఁ జేయు ననాచారములకుఁ గడ యెక్కడ – అన్నమయ్య సంకీర్తన

సతతము నేఁ జేయు ననాచారములకుఁ గడ యెక్కడ – అన్నమయ్య సంకీర్తన

॥పల్లవి॥
సతతము నేఁ జేయు ననాచారములకుఁ గడ యెక్కడ
మతి ననుఁగని కావుము రామా రామా రామా
॥చ1॥
నేసిననాబ్రహ్మత్యలు శిశుహత్యలు గోహత్యలు
ఆసలనెన్నో యెన్నో ఆయాజాడలను
యీసున నేనిపు డెరిఁగియు నెరఁగక సేసేదురితపు-
రాసులకును గడలే దిదె రామా రామా రామా
॥చ2॥
నమలెడి నావాచవులకు నానావిధభక్షణములు
కమిలిన దుర్గంధపు శాకమ్ములు దొమ్ములును
జముబాధల నరకంబుల సారేకు నన్నెటువలె శ్రీ …
రమణుఁడ ననుఁగాచే విటు రామా రామా రామా
॥చ3॥
కపటపునాధనవాంఛలు కలకాలముఁ బరకాంతలఁ
జపలపుదలఁపుల నేఁతల సంఖ్యము లరయఁగను
యెపుడును నిటువలెనుండెడుహీనుని నన్నెటు గాచెదో
రపమున శ్రీ వేంకటగిరి రామా రామా రామా
రాగము: ఆహిరి
రేకు: 0066-02
సంపుటము: 1-341

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ఆహిరి

చదవండి :  ఎండలోనినీడ యీమనసు - అన్నమయ్య సంకీర్తన

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: