
సకలసందేహమై జరగుచున్నది యెకటి – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సకలసందేహమై జరగుచున్నది యెకటి ప్రకటింప జీవమో బ్రహ్మమో కాని ॥చ1॥ వసుదేవుజఠరమనువననిధికిఁ జంద్రుఁడై అసమానగతిఁ బొడమినాఁ డీతఁడు వసుధఁ జంద్రుఁడు నీలవర్ణుఁ డేఁటికినాయ కసరెత్తి ననుఁగందు గలయఁగొనుఁబోలు ॥చ2॥ ఇనవంశమున లోకహితకల్పభూజమై ఆనఘఁడై జనియించినాఁ డీతఁడు ననుపై నసురతరువు నల్లనేఁటికినాయ పెనుఁగొమ్మలో చేఁగ పెరిగిరాఁబోలు ॥చ3॥ తిరువేంకటాద్రిపైఁ దెలియఁ జింతామణై అరిదివలెఁ బొడచూపినాఁ డీతఁడు గరిమె నది యిపుడు చీఁకటివర్ణమేలాయ హరినీలమణులప్రభ లలమికొనఁబోలు |
రాగము: శ్రీరాగం రేకు: 0064-05 సంపుటము: 1-332 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం