
సకలసంగ్రహము సకలసంచయము – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ సకలసంగ్రహము సకలసంచయము అకృతకృత మిది హరినామం ॥చ1॥ సకలవేదశాస్త్రములసార మిది సకలమంత్రరాజంబు నిది సకల పురాణరసముల మధుర మిది ఆకుటిలపావనం హరినామం ॥చ2॥ సకలతత్వసంశయఖండన మిది సకలకర్మనిశ్చయము నిది సకలవిధిరహస్యప్రధాన మిది అకారణహితం హరినామం ॥చ3॥ సకలదేవతాస్వామిప్రియం బిది సకలలోకరక్షణము నిది ప్రకటం వేంకటపతి నామాంకిత- మకించనధనం హరినామం |
రాగము: లలిత రేకు: 0067-04 సంపుటము: 1-349 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, లలిత