సందడి విడువుము సాసముఖా
॥పల్లవి॥ సందడి విడువుము సాసముఖా మంధరధరునకు మజ్జనవేళా link ॥చ1॥ అమరాధిపు లిడుఁ డాలవట్టములు కమలజ పట్టుము కాళాంజి జమలిచామరలు చంద్రుఁడ సూర్యుఁడ అమర నిడుఁడు పరమాత్మునకు ॥చ2॥ అణిమాదిసిరులనలరెడు శేషుఁడ మణిపాదుక లిడు మతి చెలఁగా ప్రణుతింపు కదిసి భారతీరమణ గుణాధిపు మరుగురు బలుమరును ॥చ3॥ వేదఘోషణము విడువక సేయుఁడు ఆదిమునులు నిత్యాధికులు శ్రీదేవుండగు శ్రీవేంకటపతి ఆదరమున సిరు లందీ వాఁడె |
రాగము: ధన్నాసి రేకు: 0002-06 సంపుటము: 1-12 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, ధన్నాసి