
శ్రీశో యంసుస్థిరో యం – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ శ్రీశో యంసుస్థిరో యం కౌశికమఖరక్షకోయం ॥చ1॥ నిగమనిధినిర్మలోయం జగన్మోహనసతీపతి- విగతభయోయం విజయసఖోయం భృగుమునినా సంప్రీతోయం ॥చ2॥ సకలపతి శ్శాశ్వతోయం శుకముఖమునిజనసులభోయం ప్రకటబహళశోభనాధికోయం వికచరుక్మిణీవీక్షణోయం ॥చ3॥ సరసోయం పరిసరప్రియోయం తిరువేంకటాధిపోయం చిరంతనోయం చిదాత్మకోయం శరణాగతవత్సలోయం |
రాగము: ముఖారి రేకు: 0043-04 సంపుటము: 1-264 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, ముఖారి