కడప: సంవత్సర కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కవి, రచయిత, సీనియర్ పాత్రికేయుడు షేక్ బేపారి రహమతుల్లా అలియాస్ శశిశ్రీ బుధవారం అర్ధరాత్రి కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు.
స్థానిక ద్వారకానగర్‌లోని ఆయన ఇంటికి చేరుకుని అభిమానులు, సాహితీవేత్తలు, పాత్రికేయులు బుధవారం సాయంత్రం కన్నీటి వీడ్కోలు పలికారు. భౌతికకాయం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.
వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు, పాత్రికేయులు, సీమ జిల్లాలకు చెందిన సాహితీవేత్తలు కూడా ఆయన భౌతికకాయాన్ని సందర్శించారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు వెంట రాగా ఆయన భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో చిలకలబావి సమీపంలోని ముస్లిం శ్మశాన వాటికకు చేర్చారు. మత గురువుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఖనన కార్యక్రమాన్ని నిర్వహించారు.
కడప జిల్లా సిద్ధవటంలో ఎస్.బి.సలీమాబీ, ఎస్.బి.రసూల్ దంపతులకు షేక్ బేపారి రహంతుల్లా జన్మించారు. కవి, రచయిత, వక్త, పత్రికా సంపాదకులు, ప్రసార భారతి న్యూస్ రిపోర్టర్ -ఇలా మూడున్నర దశాబ్దాలుగా తెలుగు సాహిత్యానికీ, ఇతర రంగాలకూ సేవ లందించిన ప్రజ్ఞాశాలి శశిశ్రీ (6.12.1957- 31-3- 2015). ‘మనోరంజని’ లిఖిత మాసపత్రికను, ‘సాహిత్యనేత్రం’ మాసపత్రికను స్థాపించి తనదైన ప్రతి భను చాటుకున్నారాయన.
‘పల్లవి’, ‘శబ్దానికి స్వాగతం’, ‘జేబులో సూర్యుడు’, ‘కాలాంతవేళ’ (వచన కావ్యాలు), ‘సీమగీతం’ (పద్య కావ్యం), ‘చూపు’ (వ్యాసాలు), ‘దహేజ్’, ‘టర్న్స్ ఆఫ్ లైఫ్’, ‘రాతిలో తేమ’ (కథా సంపుటాలు), ‘మనకు తెలి యని కడప’ (చరిత్ర), కేంద్ర సాహిత్య అకాడమీ సహకారంతో ‘పుట్టపర్తి నారాయణాచార్య’ (విమర్శ) శశిశ్రీ రచించారు. ఆయన కథలు ఆంగ్లం, హిందీ, ఉర్దూ, కన్నడ, మల యాళ భాషలలోకి అనువాదమయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ‘ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం-2010’, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ‘పట్టాభిరామిరెడ్డి లిటరరీ అవార్డు-2008’, గుంటూరు అభ్యుదయ రచయితల నుంచి ‘కొండేపూడి శ్రీనివాసరావు సాహిత్య పుర స్కారం-2008’, పత్రికా రచయితగా అందించిన సేవలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ‘ఉత్త మ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అవార్డు-2007’, ‘యునిసెఫ్ అవార్డు-2010’ వంటి ఎన్నో పురస్కా రాలు ఆయనను వరించాయి. యోగి వేమన విశ్వ విద్యాలయం పాలక మండలి సభ్యునిగా రాష్ట్ర గవ ర్నర్ చేత నియమితులయ్యారు. ఆయన ‘అభ్యుదయ రచయితల సంఘం’ రాష్ట్ర కార్యవర్గసభ్యులుగా కూడా పనిచేశారు.