గాలివీడు: గాలివీడు మండలంలోని చీమలచెరువుపల్లి పంచాయతీ ఎర్రదొడ్డిపల్లిలో పురిగమ్మ వేల్పు శుక్ర, శనివారం ఘనంగా జరిగింది. 15 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ వేల్పునకు ప్రజలు భారీగా హాజరయ్యారు. శుక్రవారం రాత్రి వివిధ గ్రామాల నుంచి 12 నాణములు వేల్పులో పాల్గొన్నాయి. ఆలయం చుట్టూ ప్రదర్శనలు చేశారు. శనివారం సాయంత్రం నిర్వహించిన దేవతా నాణములతో నీలకర్త కార్యక్రమం, పూజ, గందోడి కోలలాడే సంబరాలు,. బాణసంచా పేల్లుళ్లు, వివిధ వాయిద్యాలతో చేసిన భజన ఆకట్టుకున్నాయి. నాణములతో పాలు దేవర ఎద్దులను పోటాపోటీగా అలంకరించి పురిగమ్మ ఆలయం వరకు పరుగులు తీశారు. లక్కిరెడ్డిపల్లి సీఐ సుధాకర్ ఆధ్వర్యంలో నలుగురు ఎస్సైలు, 50 మంది కానిస్టేబుళ్లు బందోబస్తు పర్యవేక్షించారు. పరుగుల పోటీలో తొక్కిలాట జరుగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు.
ట్యాగ్లుfairs festivals galiveedu kadapa purigamma velpu rayachoty yerradoddipalli ysr district
ఇదీ చదవండి!
కడప జిల్లా కలెక్టర్‌గా భాద్యతలు తీసుకున్న హరికిరణ్
కడప: ఇటీవల కడప జిల్లా కలెక్టర్‌గా నియమితులైన హరికిరణ్ బదిలీపై వెళుతున్న కలెక్టర్ బాబురావు నాయుడు నుంచి శుక్రవారం బాధ్యతలు …