గురువారం , 21 నవంబర్ 2024
వైఎస్ హయాంలో

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి

వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.

విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే…

విద్యారంగం:

  • యోగివేమన విశ్వవిద్యాలయం
  • సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల గ్రాంట్ ఇన్ ఎయిడ్ (విశ్వవిద్యాలయాలకు అనుసంధానించడం, ప్రస్తుతం యోవేవికి అనుబంధంగా ఉంది)
  • ప్రభుత్వ పశు వైద్య కళాశాల, ప్రొద్దుటూరు (GO Number MS 72, Dated: 18/07/2008, Dept of ANIMAL HUSBANDRY AND FISHERIES)
  • యోగి వేమన ఇంజనీరింగ్ కళాశాల, ప్రొద్దుటూరు (యోవేవి వారి సొంత కళాశాల, G.O.Ms.No.121, Dated: 21/07/2008, Dept of Higher Education)
  • ట్రిపుల్ ఐటి, ఇడుపులపాయ
  • రాజీవ్ గాంధీ వైద్య కళాశాల (రిమ్స్), కడప
  • రిమ్స్ నర్సింగ్ కళాశాల, కడప
  • రిమ్స్ దంత వైద్య కళాశాల, కడప
  • జెఎన్టియు ఇంజనీరింగ్ కళాశాల, పులివెందుల
  • ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజి, పులివెందుల (ఆచార్య ఎన్.జి.రంగా వ్యావసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధ కళాశాల)
  • వైఎస్ఆర్ ఉద్యాన కళాశాల (Horticulture College), అనంతరాజుపేట (రాయలసీమలోని ఏకైక ఉద్యాన కళాశాల, 06/06/2007న ప్రారంభమైంది)
  • ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు – కమలాపురం, రాయచోటి, రాజంపేట, ఓబులవారిపల్లి (GO No MS 45, Dated 10/04/2008 & RT 405, Dated: 03/05/2008)
  • Govt. College for Men, Kadapa became autonomous (the first autonomous college in Rayalaseema)
  • పదికి పైగా ప్రయివేటు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు అనుమతి
  • కడప నగరంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూలు ఏర్పాటు
  • కడప నగరంలో కేంద్రీయ విద్యాలయ ఏర్పాటు
  • వైఎస్ వెంకటరెడ్డి మెమోరియల్ మహిళా జూనియర్ కళాశాల, పులివెందుల (ప్రయివేటు కళాశాలను ప్రభుత్వపరం చేసినారు) (GO No. MS 164, Dated: 14/08/2008, Dept of Higher Education)
  • సైనిక పాఠశాల ఏర్పాటుకు అనుమతి (వైఎస్ చనిపోయినాక అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ దీనిని చిత్తూరు జిల్లాలోని కలికిరికి తరలించినారు)
  • నియోజకవర్గానికి ఒకటి చొప్పున 11 ఆదర్శ పాఠశాలలు
చదవండి :  మోపూరు భైరవ క్షేత్రం - నల్లచెరువుపల్లె

పారిశ్రామిక రంగం:

  • భారతి సిమెంటు కర్మాగారం
  • భారతి పాలిమర్స్ కర్మాగారం
  • NSL స్పిన్నింగ్ మిల్, ఎడ్లపాడు
  • దాల్మియా సిమెంటు కర్మాగారం
  • బ్రాహ్మణి ఉక్కు కర్మాగారం (ప్రస్తుతం రద్దయింది)
  • గోవిందరాజ స్పిన్నింగ్ మిల్, పులివెందుల
  • సజ్జల పాలిమర్స్
  • యుసిఐఎల్, తుమ్మలపల్లె
  • చెన్నూరు సహకార చెక్కెర కర్మాగారం పునరుద్ధరణ (వైఎస్ చనిపోయినాక మూతపడింది)
  • రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం విస్తరణ, ఈ కేంద్రానికి నీటి కొరత తీర్చడానికి బ్రహ్మం సాగర్ నుండి ప్రత్యేక పైప్ లైన్ ఏర్పాటు
  • బద్వేలు సమీపంలో తోళ్ళ శుద్ది కర్మాగారం (వైఎస్  మరణాంతరం ఇది కార్యరూపం దాల్చలేదు)
  • కడప నగరంలో ఆం.ప్ర.పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పనా సంస్థ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు (వైఎస్ చనిపోయిన తరువాత దీన్ని తిరుపతికి తరలించారు)
  • మైలవరంలో టెక్స్ టైల్ పార్కు ఏర్పాటు (ఇది వాడుకలోకి రాలేదు)
  • కడప శివారులో APIIC ఆధ్వర్యంలో సిపిబ్రౌన్ ఐటి సెజ్ ఏర్పాటుకు అనుమతులు మరియు భూసేకరణ. (ఇక్కడ ఏర్పాటు కావలసిన భవనాలు వైఎస్ చనిపోవడంతో ఆగిపోయాయి)
  • కొప్పర్తిలో APIIC ఆధ్వర్యంలో పారిశ్రామికవాడ ఏర్పాటకు కావలసిన మౌలిక సదుపాయాల కల్పన

క్రీడా రంగం:

  • వైఎస్సార్ ఇండోర్ స్టేడియం
  • వైఎస్సార్ క్రీడా పాఠశాల (రాష్ట్రంలోని ఏకైక క్రీడా పాఠశాల)
  • వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియం
కడప జిల్లాతో వైఎస్ అనుబంధం తెలిపే ఇలస్ట్రేషన్
కడప జిల్లాతో వైఎస్ అనుబంధం తెలిపే ఇలస్ట్రేషన్

మౌలిక సదుపాయాలు:

  • కడప విమానాశ్రయం ఏర్పాటు
  • కడప రైల్వే స్టేషన్ ఆధునీకరణ
  • కడప – బెంగుళూరు రైల్వే లైను మంజూరు (నిర్మాణ ఖర్చులను కేంద్ర – రాష్ట్ర ప్రభుత్వాలు చెరో సగం చెల్లించాలనే ఒప్పందంతో పనులు మొదులైనాయి. ఈ రైల్వే లైను లాభదాయకం కాదని సొంతంగా నిర్మించటానికి కేంద్రం ఒప్పుకోలేదు.)
  • కడప మీదుగా చెన్నై – హైదరాబాదుల నడుమ కాచిగూడ/ఎగ్మోర్ రైలు
  • ఓబులవారిపల్లి – కృష్ణపట్నం రైల్వేలైను మంజూరు (2006). రాయలసీమ జిల్లాలను సముద్ర మార్గానికి అనుసంధానించేందుకు దోహదం చేస్తుంది. (కేంద్ర రైల్వే శాఖ, రాష్ట్ర ప్రభత్వం, NMDCలు సంయుక్తంగా నిర్మించినది.ఈ రైల్వే లైను లాభదాయకం కాదని సొంతంగా నిర్మించటానికి కేంద్రం ఒప్పుకోలేదు)
  • కడప – పులివెందుల నాలుగు వరుసల రహదారి (జీవో నెం. MS 348, తేదీ: 03/12/2008, రోడ్లు మరియు భవనాల శాఖ)
  • నెల్లూరు – గుంతకల్ నాలుగు వరుసల రహదారి
  • కడప – కర్నూలు జాతీయ రహదారి విస్తరణ
  • కడప నగరంలో శాటిలైట్ టౌన్ షిప్, సింగపూర్ టౌన్ షిప్పులు
  • ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి స్థాయి పెంపు (350 పడకలతో జిల్లా స్థాయి ఆసుపత్రిగా మార్పు)
  • ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి పట్టణాలలో ఆం.ప్ర. హౌసింగ్ బోర్డు/రాజీవ్ స్వగృహ కార్పోరేషన్ నివాస సముదాయాలు
  • కడప నగరంలో రాష్ట్ర ప్రభుత్వ అతిధి గృహం, అధునాతన సౌకర్యాలతో జిల్లా పరిషత్ సమావేశ మందిరం
  • కడప నగరంలో వైఎస్సార్ ప్రెస్ క్లబ్
  • కడప నగరంలో నూతన కలెక్టరేట్ సముదాయం
  • కడప నగరంలో బుగ్గవంక రక్షణ గోడల నిర్మాణం, రహదారుల విస్తరణ మరియు వంతెనల ఏర్పాటు
  • కడప, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, రాయచోటి పట్టణాలలో బయటి రహదారుల (ఔటర్ రింగ్ రోడ్/బైపాస్ రోడ్) ఏర్పాటు
  • కడపలో రాయలసీమ జైళ్ళ శాఖ డి.ఐ.జి కార్యాలయం ఏర్పాటు
  • ప్రొద్దుటూరులో 5 ఎకరాల విస్తీర్ణంలో RTO కార్యాలయాల నిర్మాణం (GO No: RT 1552, Dated: 17/10/2008, Dept of Transports Roads & Buildings)
  • కమలాపురం, యర్రగుంట్ల, రైల్వేకోడూరు, పెనగలూరు, నాయుడువారిపల్లి, ఓబిలి గ్రామాలలో ఉర్దూ ఘర్/షాదీఖానాల నిర్మాణం (GO nos:  RT668,669 Dt: 12/11/2008 & RT 580, Dated: 29092008, మైనారిటీ సంక్షేమ శాఖ)
  • Establishment of Additional District & Sessions court at Rayachoty (GO No: MS 50, Dated: 17/04/2008, Dept of Law – Home – Courts)
  • కుందు నదిపైన ప్రొద్దుటూరు-చాగలమర్రి (వెల్లాల వద్ద), గుండ్లకుంట్ల-సత్రం, పెద్దపసుపుల-నెమళ్లదిన్నె రోడ్ల పైన హైలెవెల్ బ్రిడ్జిల నిర్మాణం (జీవో నెంబర్లు RT 1756, 1643, 509 Dept of Transports Roads & Buildings)
  • కడప నగరంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (కోటిరెడ్డి మహిళా కళాశాల)కు అదనపు తరగతి గదులు, హాస్టల్ భవనాలు
  • ఎర్రగుంట్ల రైల్వే క్రాసింగ్ వంతెన
  • సోమశిల వెనుక జలాల నుండి ఎత్తిపోతల ద్వారా అనంతపురం వరకు తాగు, పారిశ్రామిక అవసరాల కోసం నీటి సరఫరా (వైఎస్ చనిపోయినాక అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ ఈ పథకాన్ని రద్దు చేశారు.)
చదవండి :  'పోలి' గ్రామ చరిత్ర

వ్యవసాయరంగం:

  • కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు
  • ఐజీ కార్ల్, పులివెందుల ఏర్పాటు (దీనిని ప్రభుత్వం పూర్తిగా వినియోగంలోకి తీసుకురాలేదు)
  • ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల, కడప
  • పులివెందులలో సూపర్ స్పెషాలిటీ వెటరినరీ ఆసుపత్రి (SSVH) (స్థాపితం: 2006)
  • మహిళా డెయిరీల ఏర్పాటు
  • యోగివేమన విశ్వవిద్యాలయ ప్రాంగణాలలో (ఇడుపులపాయ, కడప)అగ్రిసైన్సెస్ పార్క్ ఏర్పాటు (GO MS No 69, Dated: 12/03/2008, Dept of Industries and Commerce)

పర్యాటక రంగం:

  • కడప నగరం, గండికోట, గండి, ఇడుపులపాయ, ఒంటిమిట్టలలో పర్యాటక శాఖ విశ్రాంతి గృహాల (lodge/rest house/cottages) ఏర్పాటు
  • కడప, పులివెందులలో శిల్పారామాలు
  • కడప, తాళ్ళపాకలలో పర్యాటక శాఖ హోటళ్ళు
  • కడప నగర శివారులో రామకృష్ణ మఠం కోసం స్థలం కేటాయింపు
  • తాళ్ళపాక ముఖద్వారం వద్ద అన్నమయ్య విగ్రహ ఏర్పాటు
  • దేవుని కడప, గండి ఆలయాలను తితిదే పరిధిలోకి తీసుకురావటం
  • మోపూరు భైరవేశ్వర ఆలయం అభివృద్ది
  • అల్లాడుపల్లె వీరభద్ర స్వామి దేవాలయ జీర్ణోద్ధరణకు 73 లక్షల కేటాయింపు (CGF నిధుల నుండి)
  • బ్రహ్మం సాగర్ జలాశయం, దేవుని కడపలలో బోటింగ్
  • పదివేల కోట్ల వ్యయంతో గండికోట అభివృద్దికి మంత్రివర్గ నిర్ణయం (వైఎస్ మృతితో అటకెక్కింది)
  • ఇడుపులపాయలో ఎకో టూరిజం పార్కు, నెమళ్ళ పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటు
  • రామేశ్వరం (ప్రొద్దుటూరు) మసీదు పునర్నిర్మాణానికి పది లక్షల గ్రాంట్ ఇన్ ఎయిడ్ (జీవో నెం. RT 756, 06/12/2008, మైనారిటీ సంక్షేమ శాఖ)
చదవండి :  మన జయరాం, మన సొదుం

పట్టణీకరణ:

  • కడపకు నగరపాలిక హోదా
  • బద్వేలు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, యర్రగుంట్లలకు పురపాలిక హోదా
  • రాయచోటి పట్టణానికి వెలిగల్లు జలాశయం నుండి తాగునీటి సరఫరా కోసం పైప్ లైన్ ఏర్పాటు
  • కడప, పులివెందుల, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలలో రహదారుల విస్తరణ
  • కడప, ప్రొద్దుటూరు, పులివెందులల్లో భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ

సాగునీరు:

  • పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ విస్తరణ
  • గండికోట జలాశయానికి (80%) నిధుల కేటాయింపు
  • పులివెందుల బ్రాంచి కెనాల్ పూర్తి
  • పిబిఆర్ జలాశయం పూర్తి
  • బ్రహ్మంసాగర్ జలాశయం పూర్తి
  • వెలిగల్లు జలాశయం పూర్తి
  • బహుదా నదిపైన ఝరికోన ప్రాజెక్టు (ఉద్దేశం : సంబేపల్లి, సుండుపల్లె, చిన్నమండెం మండలాలకు తాగునీటి సరఫరా. వైఎస్ మరణానంతరం కిరణ్ కుమార్ ఈ ప్రాజెక్టు నీటిని చిత్తూరు జిల్లాలోని కెవిపల్లె, కలకడ, కలికిరి మండలాలకు తరలించుకుపోయారు)
  • కుందు నదిపైన నక్కలదిన్నె లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం ఏర్పాటుకు అనుమతి
  • ఇడుపులపాయ సమీపంలోని గజ్జలరెడ్డి చెరువు పునరుద్ధరణ (GO Number RT 1130, Dated:29082008, Dept of Minor Irrigation)

ఇదీ చదవండి!

జిల్లా కేంద్రంగా కడప

కొత్త జిల్లా కేంద్రంగా కడప వద్దు !

ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు వస్తే కొన్ని నెలల క్రిందట పత్రికల్లో ఒక వార్త వచ్చింది – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో …

3 వ్యాఖ్యలు

  1. Pl add HPS,Singapore township at kadapa and 350 beded hospital at proddatur

  2. ఈ వెబ్ సైట్ చూసి చాలా సంతోషం కలిగింది. మీ ప్రయత్నం అభినందనీయం. వ్యాసం బాగా రాశారు.వైఎస్ లాంటి వ్యక్తి మరణించటం మన జిల్లాకు తీరని లోటు…:(

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: