వేదవేద్యులు వెదకేటిమందు

॥పల్లవి॥
వేదవేద్యులు వెదకేటిమందు
అదినంత్యములేని‌ ఆమందు
॥చ1॥
అడవిమందులుఁ గషాయములు నెల్లవారు
కడగానక కొనఁగాను
తొడిఁబడ నొకమందు దొరకె మాకు భువి-
నడియాలమైనట్టి ఆమందు
॥చ2॥
లలితరసములుఁ దైలములు నెల్లవారు
కలకాలము గొనఁగాను
చెలువైన దొకమందు చేరె మాకు భువి-
నలవిమీఱినయట్టియామందు
॥చ3॥
కదిసినజన్మరోగముల నెల్లవారు
కదలలేక వుండఁగాను
అదన శ్రీతిరువేంకటాద్రిమీఁదిమందు
అదివో మాగురుఁడిచ్చె నామందు
రాగము: దేసాక్షి
రేకు: 0001-02
సంపుటము: 1-2

Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, దేసాక్షి

చదవండి :  తిరువీధుల మెరసీ దేవదేవుడు - అన్నమాచార్య సంకీర్తన

    వార్తా విభాగం

    ఇవీ చదవండి

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *