
వేదనఁ బొరలే వెరవేలా – అన్నమయ్య సంకీర్తన
॥పల్లవి॥ వేదనఁ బొరలే వెరవేలా యీదయ విధి దన కీయదా read ॥చ1॥ తత్తరపాట్ల తనువికారములఁ జిత్తము దెంచే చెలువేలా బత్తితో దాఁచిన పరధనంబుంగొని సత్తయి వుండుట చాలదా ॥చ2॥ యెక్కువతమకపుటింతులఁ బొందక పక్కుచువాడేవయసేలా మొక్కుచు దాఁచిన మూలధనము గన- నెక్కువ దైవం బియ్యదా ॥చ3॥ సేఁతలఁ బొరలెడి చిక్కులఁ గెరలెడి-. రోఁతల యీనేరుపులేలా బాఁతిగ వేంకటపతిరతిఁ జిత్తపు- టూఁతలఁ గోరిక లూనవా |
రాగము: శ్రీరాగం రేకు: 0035-03 సంపుటము: 1-216 |
Tags: Annamacharya Keerthanalu, Telugu Devotional, అన్నమయ్య సంకీర్తనలు, తాళ్ళపాక అన్నమయ్య కీర్తనలు, అన్నమయ్య, తాళ్ళపాక అన్నమయ్య, అన్నమయ్య పాటలు, Carnatic Songs, శ్రీరాగం